Saturday, June 20, 2020

ఆ ఒప్పంద‌మే..ప్రాణ‌న‌ష్టాన్ని మిగిల్చిందా..?

భార‌త్‌-చైనా ఘ‌ర్ష‌ణ‌లో 

తుపాకులు వాడ‌ని సైనికులు

జూన్ 15-16 అర్థ‌రాత్రి పూట గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన విష‌యం విధిత‌మే. ఇందులో 20 మంది భార‌తీయ సైనికులు మ‌ర‌ణించారు. ఇనుప మేకులున్న రాడ్‌ల‌తో చైనా సైనికులు భార‌త సైనికుల మీద దాడి చేశారు. స‌రిహ‌ద్దుల్లో భార‌త సైనికుల‌ను కొట్టి చంపార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కూడా ప్ర‌క‌టించారు. అయితే చైనా సైనికుల‌తో ఘ‌ర్ష‌ణ సంద‌ర్భంగా భార‌త సైనికులు తుపాకులు వాడ‌లేద‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇది అంద‌ర‌న్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బీబీసీ ఛానెల్ లో వ‌చ్చిన క‌థ‌నం మేర‌కు..
న్యూఢిల్లీ(Newdelhi): అస‌లు ఆయుధాలు లేకుండా వారిని స‌రిహ‌ద్దుల‌కు ఎందుకు పంపారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు. అయితే గ‌తంలో చైనాతో కుదుర్చుకున్న ఒప్పందాల వ‌ల్లే ఆయుధాల‌ను వాడ‌లేక‌పోయామ‌ని విదేశాంగ శాక మంత్రి జ‌య‌శంక‌ర్ అన్నారు.  స‌రిహ‌ద్ధులో పోస్ట్ చేసిన సైనికులంద‌రి ద‌గ్గ‌రా ఆయుధాలున్నాయ‌ని జ‌య‌శంక‌ర్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. పోస్ట్ నుంచి దూరంగా వెళ్లేట‌ప్పుడు వారుఆయుధాల‌ను త‌ప్ప‌కుండా తీసుకెళ‌తార‌ని, జూన్‌15న గాల్వాన్ లోయ‌లో పోస్ట్ చేసిన సైనికుల ద‌గ్గ‌ర ఆయుధాలున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. 1996,2005 లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం ఇండో-చైనా సైనికుల ముఖాముకి త‌ల‌పిడిన‌ప్పుడు తుపాకుల‌ను ఉప‌యోగించ‌కూడ‌ద‌ని విదేశాంగ మంత్రి వెల్ల‌డించారు. పాక్ డ్రోన్ కూల్చివేత‌

ఆ ఒప్పందంలో ఏముంది?

"ఇరు ప‌క్షాలు ఒక‌దాని మీద మ‌రొక‌టి ఎలాంటి బ‌లాన్ని ప్ర‌యోగించ‌వు. సైనిక ఆధిప‌త్యాన్ని సాధించ‌డం కోసం ఇత‌రుల‌ను బెదిరించ‌వు" అని 1996లో కుదిరిన ఒప్పందంలో ఉంది. అందులోని మొద‌టి పేరాలో "రెండు దేశాలు ఏవీ మిల‌ట‌రీ శ‌క్తిని మ‌రొక దేశానికి వ్య‌తిరేకంగా ఉప‌యోగించ‌వు. ఎల్ ఎస్‌(లైవ్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్‌) రెండు వైపులా మోహ‌రించిన ఏ సైనం, దాని సైనిక సామ‌ర్థ్యంతో మ‌రొక సైన్యంపై దాడి చేయ‌దు. అలాంటి సైనిక కార్య‌క‌లాపాల్లో పాల్గొన‌దు. అలా చేసేలా మ‌రోదేశంపై ఒత్తిడి చేయ‌దు. త‌ద్వ‌రా ఇండో-చైనా స‌రిహ‌ద్దు ప్రాంతంలో శాంతి, స్థిర‌త్వాలు కొన‌సాగుతాయి." అని రాసి ఉంది. 
విదేశాంగ మంత్రి జ‌య‌శంక‌ర్ ప్ర‌స్తావిస్తున్న ఒప్పందంలోని ఈ భాగం ఆర్టిక‌ల్ 6లో ఉంది. దీని ప్ర‌కారం "ఎల్ ఎసీకి రెండు కిలోమీట‌ర్ల వ్యాసార్థంలో ఏ దేశ‌మూ కాల్పులు జ‌ర‌ప‌దు. జీవ‌ర‌సాయ‌న ఆయుధాలు, పేలుడు ప‌దార్థాలు, తుపాకుల‌తో దాడుల‌కు దిగ‌దు."
1993లో కూడా చైనాతో ఒక ఒప్పందం  కుదిరింది. ఇందులో "భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం శాంతియుతంగా , స్నేహ‌పూర్వ‌క చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవచ్చ‌ని ఇరుప‌క్షాలు న‌మ్ముతున్నాయి. ఏ దేశ‌మూ బ‌ల‌ప్ర‌యోగానికి దిగ‌దు. "అని ఉంది. 1993,1996 నాటి ఒప్పందాల‌లోని అనేక అంశాలు 2005 ఒప్పందంలో పున‌రావృత‌మ‌య్యాయి. 

ఈ ఒప్పంద‌మే ఆయుధాల‌ను నిషేధించిందా?

ఆయుధాల‌ను ఉప‌యోగించ‌డానికి ఏ దేశానికి అనుమ‌తిలేద‌ని ఒప్పందాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అయితే ప‌ర‌స్థితులు ప‌ర‌స్ప‌ర దాడి వ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు ఈ నియ‌మాలు వ‌ర్తిస్తాయా? ఈ సంద‌ర్భంలో భార‌త సైన్యం చేస్తున్న వాద‌న‌లు స‌రైన‌వేనా?  రి ట్రీట్ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అశోక్ మెహ‌తాతో ఈ విష‌యంపై బీబీసి మాట్లాడింది. 
"మ‌న‌పై మెరుపుదాడి జ‌రుగుతుంటే, అనూహ్యంగా రాళ్ల‌తో దాడికి దిగితే మీరు మీ ద‌గ్గ‌రున్న ఆయుధాల‌ను వ‌దిలేయ‌లేరు. ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఒప్పందాల‌ను ఉల్లంఘించాలా వ‌ద్దా అని అక్క‌డున్న క‌మాండ‌ర్ నిర్ణ‌యించాలి. క‌మాండ‌ర్ లేక‌పోతే సెకండ్‌-ఇన్‌-క‌మాండ్ ఆదేశించాలి. ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం ఆయుధాన్ని ఉప‌యోగించ‌డంలో త‌ప్పులేదు."    అన్నారు మెహ‌తా. జ‌య‌శంక‌ర్ చెబుతున్న ఒప్పందాన్ని చైనా అప్ప‌టికే ఉల్లంఘించింద‌ని అంటారు మెహ‌తా. "సాధార‌ణంగా స‌రిహ‌ద్దు వివాదాలు స‌మ‌యంలో బ్యాన‌ర్ల‌ను తొల‌గిస్తారు. ఇక్క‌డ కూడా బ్యాన‌ర్ లేదు. వారి సాయంత్రం పూట ఆక‌స్మాత్తుగా దాడికి దిగారు. అంటే స‌రిహ‌ద్దు ఒప్పందాన్ని అప్ప‌టికే వారివైపు నుంచి ఉల్లంఘించారు." అన్నారాయ‌న‌.
"అయితే అక్క‌డ ప‌రిస్థితులు ఏమిటో మ‌న‌కు తెలియ‌దు. అస‌లు ఎంత‌మంది ఉన్నారు. ఎంత‌మంది చ‌నిపోయారు,ఎంత‌మంది బ‌తికి ఉన్నారు. ఎంత‌మంది కాల్పులు జ‌ర‌ప‌గ‌లిగే స్థితిలో ఉన్నారో తెలియ‌దు. ముందుగా దాడి చేసిన వారిదే సాధార‌ణంగా పై చేయి అవుతుంది." అన్నారు మెహ‌తా.
అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు ఎస్‌.డి.మున్షి "పూర్తి వివ‌రాలు తెలిసే వ‌ర‌కు రెండు వైపులా ఎవ‌రు ఎలాంటి బ‌ల‌ప్ర‌యోగం చేశారు. ఎవ‌రు ఒప్పందాన్ని ఉల్లంఘించారో చెప్ప‌డం క‌ష్టం. కానీ చాలా మంది సైనికులు మ‌ర‌ణించ‌డం మామూలు విష‌యం కాదు. ప్రాణాల‌ను కాపాడుకోడానికి ఆయుధాలు వాడ‌వ‌చ్చ‌నేది నిజం. మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోవాల‌నుకుంటే, ఆయుధాల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని అంత‌ర్జాతీయ ప్రోటోకాల్ చెబుతోంది." అని అన్నారు. 

No comments:

Post a Comment