Tuesday, June 30, 2020

ఆదేశాలు షురూ...ప్లేస్టోర్‌లో మాయ‌మైన యాప్‌లు..!

 చైనాకు భార‌త్ గ‌ట్టి షాకిచ్చింది. దేశ సార్వ‌భౌమాధికారం, స‌మ‌గ్ర‌త‌, ర‌క్ష‌ణ‌, ప్ర‌జా భద్ర‌త దృష్ట్యా మొత్తం 59 యాప్‌ల‌పై నిషేధం విధిస్తున్న‌ట్టు కేంద్ర స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న‌లో చైనా పేరు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌క ‌పోయినా..దాదాపు ఈ యాప్‌ల‌న్నీ చైనాకు చెందిన‌వే. బాగా పాపుల‌ర్ అయిన టిక్‌టాక్‌, హెలో, యూసీ బ్రౌజ‌ర్‌, న్యూస్‌డాగ్ వంటి యాప్‌లు స‌హా మొత్తం 59 యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ సంచ‌లన నిర్ణ‌యం తీసుకుంది. గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌త సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. చైనా వ‌స్తువులు, మొబైల్ అప్లికేష‌న్లు(యాప్స్‌) నిషేధిం చాల‌న్న డిమాండ్ దేశ‌వ్యాప్తంగా పెరుగుతూ వ‌చ్చింది. భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాల దృష్ట్యా వీట‌న్నింటిపై నిషేధం విధిస్తున్న‌ట్టు కేంద్ర ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ సోమ‌వారం రాత్రి ప్ర‌క‌టించింది. 

న్యూఢిల్లీ(NewDelhi): ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టంలో ని సెక్ష‌న్ 69ఏ, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ నిబంధ‌న‌లు-2009 ని అనుస‌రించి భ‌ద్ర‌తాప‌రంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా 59 యాప్‌ల‌ను నిషేధిస్తున్న‌ట్టు తెలిపింది. ఇవి దేశ సార్వ‌భౌమాధికారం, స‌మ‌గ్ర‌త‌, దేశ ర‌క్ష‌ణ‌, ప్ర‌జా భ‌ద్ర‌త‌కు హాని క‌లిగించే కార్య‌క‌లాపాల్లో నిమ‌గ్న‌మై ఉన్న‌ట్టు స‌మాచారం ఉంద‌ని కేంద్ర స్ప‌ష్టం చేసింది. 130 కోట్ల మంది భార‌తీయుల గోప్య‌త‌ను కాపాడాల్సి ఉంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ల‌ద్ధాఖ‌లోని గాల్వ‌న్ లోయ‌లో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితుల నడుమ తాజా నిర్ణ‌యాన్ని భార‌త్ తీసుకుంది. 

భార‌తీయుల భ‌ద్ర‌త‌కుకూడా భంగ‌మే...!

గ‌త కొన్నేళ్లుగా ఆవిష్క‌ర‌ణ‌ల్లో భార‌త్ దూసుకెళ్తోంది.  కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాలు ఇక్క‌డ అవ‌త‌రిస్తున్నాయి. దేశం ప్ర‌ధాన డిజిట‌ల్ మార్కెట్‌గానూ మారింది. అదే స‌మ‌యంలో డేటా భ‌ద్ర‌తోపాటు 130 కోట్ల మంది భార‌తీయుల గోప్య‌త‌పై ఆందోళ‌న‌లూ వ్య‌క్తం అవుతున్నాయి. అని ఓ ప్ర‌క‌ట‌న‌లో భార‌త్ పేర్కొంది. ఇలాంటి ముప్పుల‌తో దేశ సార్వ‌భౌమ‌త్వం, భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగే అవ‌కాశ‌ముంది. దీనికి సంబంధించి మంత్రిత్వ‌శాఖ‌కు చాలా ఫిర్యాదులూ అందాయి. ఆండ్రాయిడ్‌,ఐవోఎస్ ప్లాట్‌ఫాంలలో కొన్నియాప్‌ల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. డేటా చౌర్యంతో పాటు విదేశాల్లోని స‌ర్వ‌ర్ల‌కు అన‌ధికారికంగా డేటాను త‌ర‌లిస్తున్నార‌ని స‌మాచారం  ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది.
ఈ డేటాను దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించేవారు డేటామైనింగ్‌, ప్రొఫైలింగ్ లాంటి సాంకేతిక‌త‌ల‌తో శోధిస్తే, భార‌త్ సార్వ‌భౌమ‌త్వం, దేశ స‌మ‌గ్ర‌త‌ల‌కు ముప్పు క‌లిగే అవ‌కాశం ఉంది. ఇది చాలా ఆందోళ‌న‌క‌ర ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. దీనిపై సత్వ‌ర‌మే చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. వీటిలో కొన్ని యాప్‌ల‌ను త‌క్ష‌ణ‌మే బ్యాన్ చేయాల‌ని ఇండియ‌న్ సైబ‌ర్ క్రైమ్ కో- ఆర్డినేష‌న్ సెంట‌ర్‌,  కేంద్ర హోంశాఖ కూడా సూచించాయ‌ని ప్ర‌భుత్వం తెలిపింది. కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు కూడా ఈ యాప్‌ల‌పై చాలా ఫిర్యాదులు అందాయ‌ని చెప్పింది. ఈ యాప్‌ల‌తో దేశ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగే ముప్పుంద‌ని త‌గిన స‌మాచారం అందిన‌త‌ర్వాతే ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు పేర్కొంది. వీటిని మొబైల్‌తో పాటు  ఏ ఇంట‌ర్నెట్ ఆధారిత డివైజ్‌లోనూ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఘాటైన హెచ్చ‌రికే...!

యాప్‌ల‌పై నిషేధం విధించ‌డం చైనా ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌పై ఇప్ప‌టికిప్పుడు ఎలాంటి ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. ఆయా యాప్‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ద్వారా భార‌త్‌లో  రూ.వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నాయి. టిక్‌టాక్ మొత్తం వినియోగ‌దారుల్లో 30 శాతం మ‌ది మ‌న దేశం నుంచే ఉన్న‌ట్టు అంచ‌నా. ప్ర‌స్తుతం భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య వ‌ల్ల ఆయా కంపెనీల ఆదాయం గ‌ణ‌నీయంగా ప‌డిపోవ‌డ‌మే కాకుండా వాటి విలువ తగ్గుతుంది. చైనాయాప్ రెవెన్యూలో 2016 నుంచి ఏటా 140 శాతం వృద్ధి రేటు ఉన్న‌ట్టు గ‌ణాంకాల చెబుతున్నాయి. చైనా యాప్‌ల‌పై నిషేధం విధించ‌డంతో భార‌తీయ యాప్ మార్కెట్ విస్త‌రించే అవ‌కాశం ఉంది. టిక్ టాక్ వంటి యాప్‌ల‌కు పోటీగా ఇప్ప‌టికే చింగారి వంటి స్వ‌దేశీ యాప్ నిల‌దొక్కుకుంటోంది. అలాగే న్యూస్‌డాగ్‌, హెల్ వంటి న్యూస్ అ గ్రిగేట‌ర్ల‌కు ధీటైన స్వ‌దేశీ యాప్స్ నిల‌దొక్కుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. చైనా దుందుడుకు చ‌ర్య‌ల‌కు త‌గిన స‌మాధానంగానే యాప్‌ల‌పై నిషేధం విధించిన‌ట్టు అవ‌గ‌త‌మ‌వుతోంది. 

No comments:

Post a Comment