Monday, June 29, 2020

స్పీడ్ రైలొస్తేనే అభివృద్ధి స్పీడ్ : కేటీఆర్‌

హుజూర్‌న‌గ‌ర్(HuzurNagar):
  జిల్లాలోని హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఆర్‌డీఓ కార్యాల‌యాన్ని పుర‌పాల‌క‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, స‌హ‌చ‌ర మంత్రి జ‌గ‌దీష్ రెడ్డితో క‌లిసి ప్రారంభించారు. హుజూర్ న‌గ‌ర్ పుర‌పాల‌క సంఘం భ‌వ‌న కార్యాల‌యం లో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రులు మొక్క‌లు నాటారు. పుర‌పాల‌క సంఘం ప‌రిధిలో నూత‌నంగా నిర్మించ త‌ల‌పెట్టిన అర్బ‌న్ పార్క్ నిర్మాణంతో పాటు స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేంద్రానికి శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ పాల‌న‌ను ప్ర‌జ‌ల ముంగిట‌కు తెస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల‌కు తెర‌లేపార‌న్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాలు, గ్రామ‌పంచాయ‌తీలు ఏర్పాటు చేసిన‌ట్టు వివ‌రించారు. నేడు సంక్షేమ ఫ‌లాలు ప్ర‌జ‌ల ముంగిట‌కు వ‌చ్చాయ‌ని తెలిపారు. చిట్ట చివ‌రి మ‌నిషి వ‌ర‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరుతున్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మిస్తే ఉపేక్షించేది లేద‌ని, వారిప‌ట్ల క‌ఠినంగానే ఉంటామ‌ని హెచ్చ‌రించారు. క‌రోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురౌవుతున్న‌ప్ప‌టికీ ఇంత క‌ష్ట కాలంలో కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ 54 ల‌క్ష‌ల 22 వేల రైతుల‌కు రూ.7 వేల కోట్ల‌ను రైతుబంధు కింద ఆర్థిక చేయూత ఇచ్చార‌ని వెల్ల‌డించారు. అంద‌రికీ ఆస‌రా పెన్ష‌న్లు, క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌కు డబ్బులు మంజూరు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. 
హుజూర్‌న‌గ‌ర్‌లో స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేశామ‌ని, యువ‌త‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. హైద‌రాబాద్ టు విజ‌య‌వాడ‌కు హైస్పీడు రైలు ఏర్పాటు చేసేలా ప్ర‌య‌త్నం చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. పార్టీల‌కు అతీతంగా తెలంగాణ‌లో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని, ఇప్పుడు ఎన్నిక‌లు ఏమీ లేవు. మా ముందున్న ల‌క్ష్యం అభివృద్ధి మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.  ఇవి చ‌ద‌వండి : హోమంత్రికి క‌రోనా
ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, శానంపూడి సైదిరెడ్డి, డా.గాద‌రి కిశోర్ కుమార్‌, భాస్క‌ర్‌రావు, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, మ‌ల్ల‌య్య యాద‌వ్‌, ఎమ్మెల్సీ చిన్న‌ప్ప‌రెడ్డి, క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణా రెడ్డి, జ‌డ్పీ ఛైర్ ప‌ర్స‌న్ దీపిక‌, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, టీఆర్ ఎస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తక్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, వేమిరెడ్డి న‌ర‌సింహారెడ్డి పాల్గొన్నారు.

విజ‌య‌వాడ ముఖ్య‌మైన ఆర్థిక‌కేంద్రం అని తెలంగాణ ఐటీ శాఖామంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు అన్నారు. దేశంలోనే హైద‌రాబాద్ ఓ ముఖ్య‌మైన మెట్రోపాలిట‌న్ న‌గ‌ర‌మ‌ని తెలిపారు. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ మ‌ద్య హైస్పీడు రైలు రావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. రెండు న‌గ‌రాల మ‌ధ్య హైస్పీడు రైలు కోసం త‌మ‌వంతు కృషిచేస్తామ‌ని అన్నారు. రైలు వస్తే జాతీయ‌ర‌హదారి వెంబ‌డి అభివృద్ధి జ‌రుగ‌తుంద‌ని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 43 రెవెన్యూ డివిజ‌న్లు ఉండ‌గా వాటిని 73 కి పెంచామ‌న్నారు. తండాలు,గూడేల‌ను గ్రామ పంచాయ‌తీలుగా మార్చామ‌నీ, 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ‌ను త‌మ పార్టీ హ‌యాంలో 33 జిల్లాల‌కు పెంచిన‌ట్టు కేటీఆర్ గుర్తుచేశారు. పీసీసీ అధ్య‌క్షుడిగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. అధికారులు రాజ‌కీయాల‌కు అతీతంగా నిష్ప‌క్ష‌పాతంగా ప‌నిచే యాల‌న్నారు. 

No comments:

Post a Comment