Sunday, June 14, 2020

సైకో..మ‌నుషుల్ని చంపండం అంటే ఇష్టం..!

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్(Uttar pradesh): వ‌రుస హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఓ సైకో కిల్ల‌ర్ సొంత అన్న‌ను హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. విచార‌ణ‌లో హ‌త్య‌లు చేయ‌డానికి గ‌ల‌కార‌ణాల‌ని బ‌య‌ట‌పెట్టి పోలీసుల‌ను షాక్‌కు గురిచేశాడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆల‌స్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఈటా జిల్లా ధ‌ర్మ‌పుర్ గ్రామానికి చెందిన స‌త్యేంద్ర అనే ఆరేళ్ల కుర్రాడు గ‌త ఫిబ్ర‌వ‌రిలో అనుమాన‌స్ప‌దంగా మ‌ర‌ణించాడు. జూన్ 9వ తేదీన అత‌డి సోద‌రుడు ప్ర‌శాంత్ కూడా అదే రీతిలో అనుమాన‌స్ప‌దంగా మృతి చెందాడు. ఈ కేసులో కొంత‌మంది వ్య‌క్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే జూన్ 11 వ తేదీన స‌త్యేంద్ర‌, ప్ర‌శాంత్‌ల చిన్నాన్న రాథే శ్యామ్‌..సొంత అన్న విశ్వ‌నాథ్ సింగ్ నిద్ర‌పోతున్న స‌మ‌యంలో క‌త్తితో దాడిచేయ‌టానికి ప్ర‌య‌త్నించాడు. అయితే ముందుగానే గుర్తించిన బంధువులు శ్యామ్‌ను ప‌ట్టుకొని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో పోలీసుల విచార‌ణ‌లో అత‌డు కొన్ని సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డాడు. త‌న‌కు మ‌నుషుల్ని చంప‌డం ఇష్ట‌మ‌ని పోలీసుల‌కు తెలిపాడు. స‌త్యేంద్ర‌, ప్ర‌శాంత్‌ల‌ను తానే చంపాన‌ని ఒప్పుకున్నాడు. ఇంకా మ‌రో ముగ్గుర్ని చంప‌టానికి ప‌థ‌కం వేసుకున్న‌ట్టు తెలిపాడు.  చిన్నారుల హ‌త్య కేసులో జైలు పాలైన వారిని విడుద‌ల చేసేందుకు పోలీసులు స‌న్న‌హాలు చేస్తున్నారు.ఇవి చ‌ద‌వండి: ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ద్ద‌న్న హీరోనే..చివ‌రికి ఇలా..!

మ‌హారాష్టలో రాజ‌కీయ భేదాభిప్రాయాలు..!

ముంబై(Mumbai): మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్‌-శివ‌సేన‌-ఎన్సీపీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్య పార్టీల మ‌ధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయ‌ని సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, మంత్రి అశోక్ చ‌వాన్ అంగీక‌రించారు. విభేదాల ప‌రిష్కారానికి ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్‌ఠాక్రేతో స‌మావేశం కావాల‌ని కాంగ్రెస్ కోరుతోంద‌ని చెప్పారు. మ‌రో రెండు రోజుల్లో సీఎం కాంగ్రెస్ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌వుతార‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. మ‌హావికాస్ అగ‌డి భాగ‌స్వామ్య పార్టీల మ‌ధ్య కొన్ని అంశాలున్నాయ‌ని, అన్ని అంశాల‌పై స‌మ‌గ్రంగా చ‌ర్చించేందుకు తాము సీంతో రెండు రోజుల్లో భేటీ అవుతామ‌ని అశోక్ చ‌వాన్ చెప్పారు. 

కీల‌క స‌మావేశాలకు హాజ‌ర‌య్యేందుకు త‌మ‌కు ఆహ్వానం అంద‌డం లేద‌ని కొంత‌కాలంగా కాంగ్రెస్ నేత‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి స‌హా ప‌లు అంశాల‌పై చ‌ర్చించేందుకు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ప‌లుమార్లు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో స‌మావేశ‌మ‌వు తుండ‌గా ఈ భేటీల‌కు కాంగ్రెస్ నేత‌ల‌ను పిల‌వ‌క‌పోవ‌డంపై ఆ పార్టీ నేత‌లు గుర్రుగా ఉన్నారు. ఈ అంశంతో పాటు గ‌వ‌ర్న‌ర్ కోటాలో శాస‌న మండ‌లికి నామినేష‌న్లు, నామినేట‌డ్ పోస్టుల వ్య‌వ‌హారంపై మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోర‌ట్‌, అశోక్ చ‌వాన్‌లు సోమ‌వారం ఉద్ధ‌వ్ ఠాక్రేతో సంప్ర‌దింపులు జ‌రుపుతార‌ని స‌మాచారం. 

No comments:

Post a Comment