Wednesday, June 24, 2020

ప‌ల్నాడులో వింత శిశువు జ‌న‌నం..!


గుంటూరు(Guntur): గుంటూరు జిల్లా కారంపూడి మండ‌లం ఒప్పిచ‌ర్ల గ్రామంలో బుధ‌వారం వింత చోటుచేసుకుంది. ఒప్పిచ‌ర్ల గ్రామానికి చెందిన బోడ్ల పార్వ‌తి అనే మ‌హిళ‌కు నెల‌ల నిండ‌కుండా ఒక వింత‌బాబుని ప్ర‌స‌వించ‌డం జ‌రిగింది. నెల‌ల నిండ కుండా ఒక వింత బాబు 10 కేజీల బ‌రువుతో జ‌న్మించాడు. జ‌న్మించిన 10 నిమిషాల‌కే మ‌ర‌ణించాడు. ఇది గుంటూరు జిల్లా గుర‌జాల ప‌ట్ట‌ణంలో ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో చోటుచేసుకుంది. 

ఈఎస్ఐ స్కామ్ : కోర్టు అనుమ‌తితో 

ఏసీబీ క‌స్ట‌డీకి..

విజ‌య‌వాడ(Vijayawada): ఈఎస్ఐ కుంభ‌కోణం కేసులో నిందితుల‌ను మూడు రోజుల ఏసీబీ క‌స్ట‌డీకి కోర్టు అనుమ‌తించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్ట‌ర్ ర‌మేష్ కుమార్‌, ఏ2 గా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తో పాటుగా మ‌రో ముగ్గురు నిందితుల‌ను క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే అనార్య‌గోం కార‌ణంగా ఆస్ప‌త్రిలో ఉన్న అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అక్క‌డే విచారించ‌నున్నారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో మిగ‌తా న‌లుగురిని క‌స్ట‌డీలోకి తీసుకొని విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధ‌మ‌య్యారు. కాగా ఈ కేసులో ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడిని అధికారులు ఈ నెల 12న అదుపులోకి తీసుకొని..ఏసీబీ న్యాయ‌మూర్తి ముందు హాజ‌రుపరిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో న్యాయ‌మూర్తి ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కార‌ణాల దృష్ట్యా ఆయ‌న‌ను గుంటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని న్యాయ‌మూర్తి తెలిపారు. 

No comments:

Post a Comment