Sunday, June 7, 2020

వీడియో:జర్నలిస్ట్ మనోజ్ కు కన్నీటి వీడ్కోలు

హైదరాబాద్(Hydarabad):
కరోనా వైరస్ సోకి మృతిచెందిన Tv5 సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ మనోజ్ కు ఆదివారం సాయంత్రం బంధువుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు జరిగాయి. మదన్ పేటకు చెందిన మనోజ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. జర్నలిస్ట్ మనోజ్ కరోనా వైరస్ బారినపడి మృతి చెందటంతో తెలుగు రాష్ట్రాల్లో తోటి జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. మనోజ్ మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురికి కంటతడి పెట్టించింది.
విషాదంగా ముగిసిన జర్నలిస్ట్ మనోజ్ జీవితం..!
మాదన్నపేట కు చెందిన జర్నలిస్టు మనోజ్ కి వివాహం జరిగి 8 నెలలు అవుతుంది. ఒక రోడ్డు ప్రమాదంలో తన అక్క బావ చనిపోవడంతో తన మేనల్లుడు పెంచుకుంటూ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో చాలీచాలని జీతాలతో Tv5లో క్రైమ్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ కూడా వీధుల్లోనే ఉన్నాడు. దీంతో కరోనా వైరస్ మనోజ్కు సోకింది. వైరస్ తీవ్రత ఎక్కువ అవడంతో నాలుగు రోజులు చికిత్స అనంతరం ఆదివారం శ్వాసవిడిచారు.
జర్నలిస్టుల పరిస్థితి మరింత ఘోరం..!
  • కోట్లకు కోట్లు లాభాలు మూట కట్టుకోవడం తప్పా.. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కనీసం జీతాలు ఇవ్వకుండా చానళ్లను నడిపే యాజమాన్యాలు ఎన్నో ఉన్నాయి. పైగా జాగ్రత్తలు ఉండక్కర్లేదా.. అని ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపు కునే యాజమాన్యాలు కూడా ఉన్నాయి. అత్యవసరమైతే అడగ్గా అడగ్గా  ఇచ్చే సెలవు విషయంలో ఎల్లుండి కంపల్సరిగా విధులకు రావాలని ఆదేశాలు జారీ చేసే ఇన్చార్జులు లేకపోలేదు.
  • అన్నం తినే సమయంలో కూడా పక్క ఛానల్ లో బ్రేకింగ్ వస్తుందని ఆగమేఘాల మీద లోగో పట్టుకుని పరిగెత్తే జర్నలిస్టులు ఎందరో ఉన్నారు. అర్ధరాత్రి ఫోన్ రింగ్ అయితే వెంటనే స్పందించేది కేవలం ఒక జర్నలిస్టు మాత్రమే.
  • 24 గంటలు విధులు ల్లోనే ఉంటూ చచ్చిన శవాల తోనూ పరుగులు పెడుతున్న పోలీసులతోనూ సాహస జీవితం కొనసాగించే జర్నలిస్టులు ఉన్నారు. సమయానికి తినకపోతే ఆరోగ్యం పాడవుతుంది అప్పటికీ పైన యాజమాన్యాలు వేసే అక్షింతలను తాళలేక మౌనంగా పని చేసుకుంటూ వార్తలు అందించే జర్నలిస్టులు ఎందరో ఉన్నారు.
  • హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు.ఎవడూ సహాయం చేయడానికి తెలుసు.ఇచ్చే జీతం కూడా టైంకు రాదు అని కూడా తెలుసు. జీవితానికి గ్యారెంటీ లేదని కూడా తెలుసు అయినప్పటికీ వృత్తినే దైవంగా భావించి జీవన పోరాటంలో అసువులు బారే జర్నలిస్టులు ఎందరో.

No comments:

Post a Comment