Sunday, June 28, 2020

తాజా ఘ‌ర్ష‌ణ‌ల దృష్ట్యా.. ఆ దేశ‌ సైనికుల‌కు క‌ఠోర శిక్ష‌ణ‌

  • ఆయుధాలు వాడ‌కూడ‌ద‌న్న నిబంధ‌నే కార‌ణ‌మా..?

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ల‌ద్ధాఖ‌లోని  గ‌ల్వాన్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌న దేశ సైనికులు 20 మంది అమ‌ర‌వీరులైన విష‌యం తెలిసిందే. అదే విధంగా చైనా సైనికులు కూడా భారీగానే మ‌ర‌ణించి ఉంటార‌నే వాద‌న‌కు ఆ దేశం నుంచి ఎలాంటి  చిన్న వార్త కూడా బ‌హిరంగంగా బ‌య‌ట‌కు ఇంత వ‌ర‌కూ రాక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే తాజా ప‌రిణామాల దృష్ట్యా త‌మ బ‌ల‌గాల‌కు శిక్ష‌ణ ఇచ్చేందుకు టిబెట్ పీఠ‌భూమిలో ఉన్న ఆ దేశ సైనికుల‌కు మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుల్ని 20 మందిని పంపామ‌నే వార్త ప్ర‌పంచానికి చెబుతోంది చైనా. 

వెబ్‌న్యూస్(WebNews): అయితే 1996 లో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం..రెండు దేశాలు(భార‌త్‌-చైనా) ఆ ప్రాంతాల్లో తూపాకులు, పేలుడు పదార్థాలు ఉప‌యోగించ‌కూడ‌ద‌నే నిబంధ‌న ఉన్న‌ది. ఈ నెల 15న గ‌ల్వాన్ లోయ‌లో ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి త‌ప్పు మీదంటే మీద‌ని చైనా దుశ్చ‌ర్యల‌కు పాల్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఎంబో ఫైట్ క్ల‌బ్‌కు చెందిన 20 మంది యోధుల‌ను టిబెట్ రాజ‌ధాని లాసాకు త‌ర‌లిస్తున్న‌ట్టు చైనా అధికారిక వార్తా సంస్థ  సీసీటీవీ తెలిపింది. ఈ విష‌యంపై  భార‌త్ స‌రిహ‌ద్దుల్లో  ఉన్న బ‌ల‌గాల‌కు ఈ మార్ష‌ల్స్ శిక్ష‌ణ ఇవ్వ‌బోతున్నారా అనేది మాత్రం స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. 
అక్సాయ్ చిన్‌కు స‌మీపంలో క‌ఠిన‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌తో పాటు భారీ ఎత్తులో ఉండే ఈ వివాద‌స్ప‌ద ప్రాంతం భార‌త్‌ది అయిన‌ప్ప‌టికీ చైనా మాది అంటూ ఆ దేశ నియంత్ర‌ణ‌లోకి తీసుకుంది.  ఈ విష‌య‌మై తరుచూ వివాదం ర‌గులుతూనే ఉంది. రెండు బ‌ల‌గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌వించింది..కేవ‌లం  ఈ 45 ఏళ్ల‌లో ఇదే తొలిసారిగా చెప్ప‌వ‌చ్చు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో  చైనా సైనికులు ఇనుప ముళ్ల గ‌ద‌ల‌ను, రాడ్డుల‌ను, క‌ర్ర‌ల‌ను ఉప‌యోగించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య చైనా త‌మ సైనికుల‌కు క‌ఠోర ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునేలా తీవ్ర‌మైన శిక్ష‌ణ ఇస్తోంది. ఇవి చ‌ద‌వండి :క‌రోనా ప్ర‌భావం:ఎన్నారైల ‌పై ఎలా ఉందంటే?

త‌గిన స‌మాధానం చెప్పాం.. మ‌న్‌కీబాత్‌లో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ విష‌య‌మై మాట్లాడిన ప్ర‌ధాని మోడీ..!

భార‌త్ సైనిక యోధులు దేశ గౌర‌వాన్ని నిల‌బెట్టార‌ని మోదీ కొనియాడారు. "మ‌న సైనికులు స‌త్తా చూపించారు." అని పేర్కొన్నారు. త‌మ కుమారుల‌ను దేశం కోసం అర్పించిన వారి కుటుంబాల త్యాగ‌మే భార‌త‌దేశానికి ర‌క్ష అని కొనియాడారు.  "స్నేహాన్ని ఎలా కాపాడుకోవాలో భార‌త్‌కు తెలుసు. క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూసేవారికి త‌గిన స‌మాధానం ఇచ్చి తీరుతాం. భార‌తీయ వీర సైనికులు భార‌త గౌర‌వానికి ఏమాత్ర‌మూ భంగం క‌ల‌గ‌నివ్వ‌రు." అని మోడీ అన్నారు. ఎన్ని సంక్షోభాలూ వ‌చ్చినా పొరుగు దేశాల నుంచి భార‌త‌దేశానికి ఏం జ‌రుగుతుందో ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూనే ఉన్న‌మాని ప్ర‌ధాని అన్నారు. దేశం కొత్త మార్గంలోకి అడుగు పెడుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశ ప్ర‌జ‌ల‌మీద  త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, క‌ష్ట స‌మ‌యంలో ప్ర‌పంచానికి భార‌త‌దేశం ఎన్నోసార్లు సాయం చేసిన విష‌యాన్ని ప్ర‌పంచం కూడా గుర్తించింద‌ని ఆయ‌న అన్నారు. 
ల‌ద్ధాక్‌లో అమ‌ర‌వీరులైన మ‌న సైనిక యోధుల సాహ‌సానికి దేశం మొత్తం నివాళులు అర్పిస్తోంది అని అన్నారు. దేశం మొత్తం  వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతోంద‌ని, త‌మ సొంత కుటుంబ స‌భ్యుడు మ‌ర‌ణించిన బాధ‌ను ప్ర‌తి భార‌తీయుడు అనుభ‌విస్తున్నాడ‌ని ప్ర‌ధాని అన్నారు. త‌మ కొడుకుల త్యాగాల‌ను చూసి కుటుంబ స‌భ్యులు గ‌ర్విస్తున్నార‌ని, ఇదే దేశానికి బ‌ల‌మ‌ని మోదీ మ‌న్‌కీబాత్‌లో వ్యాఖ్యానించారు. ల‌ద్ధాఖ‌లో చైనాతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌ర‌ణించిన 20 మంది సైనికుల గురించి ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడారు. బిహార్ రాష్ట్రం నుంచి సైనికుడిగా వెళ్లి ప్రాణాలు  త్యాగం చేసిన కుంద‌న్ కుమార్ గురించి, ఆయ‌న తండ్రి అన్న మాట‌లు త‌న చెవుల్లో మారుమోగుతున్నాయ‌ని మోదీ అన్నారు. దేశాన్ని ర‌క్షించ‌డానికి త‌మ కుటుంబంలో మిగిలిన వారిని, త‌మ మ‌న‌వ‌ళ్ల‌ను కూడా సైన్యంలోకి పంపిస్తామ‌ని ఆయ‌న అన్నారు. దేశంలో ప్ర‌తి అమ‌ర‌వీరుడి కుటుంబంలో దైర్యాన్ని నింపే మాట‌ల‌ని ఈ కుటుంబాల త్యాగం మ‌రువ‌లేనిది అని పేర్కొన్నారు. 

No comments:

Post a Comment