Monday, June 29, 2020

ముఖ్య అనుచ‌రుడు దారుణ హ‌త్య‌..కంట‌త‌డి పెట్టిన పేర్నినాని

మ‌చిలీప‌ట్ట‌ణం(Machilipatnam): మ‌చిలీప‌ట్ట‌ణంలో వైసీపీ  పార్టీనేత రాష్ట్ర ర‌వాణా, స‌మాచార శాఖ మంత్రి పేర్నినాని ముఖ్య అనుచ‌రుడు మేకా భాస్క‌ర‌రావు సోమ‌వారం దారుణ‌హ‌త్య కు గుర‌య్యారు. గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మున్సిప‌ల్ చేప‌ల  మార్కెట్ లో ఉన్న ఆయ‌న‌ను క‌త్తితో పొడిచి ప‌రార‌య్యారు. ప‌క్కా ప్లాన్‌తో సైనేడ్ పూసిన క‌త్తితో భాస్క‌ర్ రావును హ‌త్య చేశారు. ఈ హ‌త్య‌లో ఇద్ద‌రు యువ‌కులు పాల్గొన్న‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ఇద్ద‌రూ మాజీ కౌన్సిల‌ర్ అనుచ‌రులుగా అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు. 

క‌న్నీరు పెట్టిన పేర్నినాని

దారుణ‌హ‌త్య‌కు గురైన మేకా భాస్క‌ర‌రావు మృత‌దేహానికి రాష్ట్ర ర‌వాణా, స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని నివాళ్ల‌ర్పించారు. భాస్క‌ర్ రావు మృత‌దేహాన్ని చూసి మంత్రి పేర్నినాని భావోద్వేగానికి లోన‌య్యారు. ఆయ‌న‌న‌కు నివాళ్ల‌ర్పిస్తున్న స‌మ‌యంలో మంత్రి క‌న్నీరు పెట్టుకున్నారు. అనంత‌రం హ‌త్య‌కు గురైన భాస్క‌ర‌రావు కుటుంబాన్ని మంత్రి ఓదార్చారు. కాగా, మున్సిప‌ల్ చేప‌ల మార్కెట్‌లో ఉన్న భాస్క‌ర‌రావును దుండ‌గులు క‌త్తితో పొడిచి ప‌రార‌య్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న‌ను మ‌చిలీప‌ట్నం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. స్పీడ్ రైలొస్తేనే అభివృద్ధి స్పీడ్ : కేటీఆర్‌
భాస్క‌ర‌రావు హ‌త్య‌కు గుర‌య్యాడనే విష‌యం తెలుసుకున్న వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్నారు. భాస్క‌ర‌రావును హ‌త్య‌చేసిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు ఆస్ప‌త్రి వ‌ద్ద భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. దీంతోఆస్ప‌త్రి వ‌ద్ద హైటెన్ష‌న్ నెల‌కొంది. మ‌రోవైపు ఎస్పీ ర‌వీంద్ర‌నాధ్ బాబు కూడా ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

No comments:

Post a Comment