Wednesday, June 24, 2020

బీహార్‌లో వారి సినిమాలు బ్యాన్‌?

వెబ్‌న్యూస్(WebNews): వెనుక‌బ‌డిన రాష్ట్ర‌మైన బీహార్‌కు చెందిన వాడు కావ‌డంతోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ ప్ర‌ముఖులు చిన్న‌చూపు చూశార‌ని బీహార్ వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌పై స‌ల్మాన్ ఖాన్‌, ఆలియా భ‌ట్‌, క‌ర‌ణ్ జోహార్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌దిత‌ర సినిమాల‌ను త‌మ రాష్ట్రంలో విడుద‌ల కానివ్వ‌బోమ‌ని ట్వీట్లు చేస్తున్నారు ఆ రాష్ట్రానికి చెందిన కొంద‌రు. సుశాంత్ ఆత్మ‌హ‌త్య కార‌ణంగా బాలీవుడ్ లోని ప‌లువురిపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న తరుణంలో స్టార్ వార‌సులు, వారిని మాత్ర‌మే ఎంక‌రేజ్ చేసే క‌ర‌ణ్ జోహార్‌, సంజ‌య్ లీలా భ‌న్సాలీ వంటి వారు ప్ర‌ధాన టార్గెటుగా మారారు. వీరి సినిమాల‌ను త‌మ రాష్ట్రంలో విడుద‌ల కానివ్వ‌కూడ‌ద‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇవి చ‌ద‌వండి: పాకిస్తాన్ ప్ర‌మాదం ...కార‌ణాలివే..!

సుశాంత్ పైన‌ల్ పోస్టుమార్టం పూర్తి..!

ముంబాయి(Mumbai): బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఆయ‌న మృతి ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశాయి. గ‌త ఆరు నెల‌లుగా తీవ్ర మాన‌సిక ఒత్త‌డి ఎదుర్కొన్న సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. తాజాగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన తుది పోస్ట్‌మార్టం రిపోర్ట‌ను పోలీసుల‌కు వైద్యులు స‌మ‌ర్పించారు. ఉరి వేసుకోవ‌డం కార‌ణంగా ఊపిరాడ‌క‌సుశాంత్ మృతి చెందిన‌ట్టు తేలింది. ఇక సుశాంత్‌కు సంబంధించిన ఉద‌ర భాగంగాలోని కొన్ని అవ‌యవాల‌ను ప్ర‌త్యేక ప‌రీక్ష‌ల నిమిత్తం పంపారు. సుశాంత్ చ‌నిపోయిన త‌ర్వాత ఇచ్చిన పోస్టుమార్టం నివేదిక‌పై ముగ్గురు వైద్యులు సంత‌కం చేయ‌గా, తుది నివేదిక‌పై ఐదుగురు వైద్యులు సంత‌కం  పెట్టారు. మ‌రో వైపు డైర‌క్ట‌రేట్ ఆఫ్ పోరెన్సిక్ సైన్స్ స‌ర్వీసెస్‌కు పోలీసులు లేఖ రాశారు. సుశాంత్ అవ‌య‌వాల‌పై చేసే కెమిక‌ల్ ప‌రీక్ష‌ల నివేదిక‌లు కూడా త్వ‌ర‌గా స‌మ‌ర్పించాల‌ని కోరారు. సుశాంత్ చ‌నిపోయే ముందు ఆయ‌న ఎలాంటి బాధ‌నూ అనుభ‌వించ‌లేద‌ట‌. శ‌రీరంపై ఎలాంటి గాయాలూ లేవు. ఆయ‌న గోళ్లు కూడా శుభ్రంగా ఉన్న‌ట్టు వైద్యులు గుర్తించారు. ఆయ‌న‌ది క‌చ్చితంగా ఆత్మ‌హ‌త్యేన‌ని , ఇందులో ఎలాంటి సందేహం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఇవి చ‌ద‌వండి: స‌రిహ‌ద్దులో "ఆస‌క్తిక‌ర‌మైన" ఘ‌ట‌న‌..!

సుశాంత్‌ది హ‌త్యే.. ప్ర‌ముఖ న‌టుడి ఉద్య‌మం..!

బాలీవుడ్ యువ‌న‌టుడు సుశాంత్ సింగ్ రాజ‌పూత్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంపై దేశవ్యాప్తంగా ఎన్నో అనుమానాలు రేకెత్తిన్న‌ప్ప‌టికీ తాజాగా వైద్యులు ఆత్మ‌హ‌త్య‌గా ధృవీక‌రించి మీడియా ఎదుట తెలిపారు.అయినప్ప‌టికీ ఆయ‌న‌ది ఆత్మ‌హ‌త్య కాదు..హ‌త్యే నంటూ తీవ్ర‌మైన ఆరోప‌ణులు చేస్తుడ‌టం హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వివాదంగా మారింది. కొంద‌రు అభిమానులు ర్యాలీలు చేప‌డుతూ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త వారం రోజులుగా సుశాంత్ కు న్యాయం జ‌ర‌గాలి..అంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇవి చ‌ద‌వండి: ప‌ది విద్యార్థులు ప‌బ్జీకి బానిసై 10 మంది ఆత్మ‌హ‌త్య‌..!
సుశాంత్ మృతిపై చేప‌ట్టిన ద‌ర్యాప్తులో వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాలి అనే డిమాండ్ల‌తో "సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ డెత్"‌, "జ‌స్టీస్ ఫ‌ర్ సుశాంత్ ఫోర‌మ్"‌ లాంటి హ్యాష్ ట్యాగ్స్‌తో ఉద్య‌మాలు చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు, యాంక‌ర్, హోస్ట్ శేఖ‌ర్‌సుమ‌న్ ఆన్‌లైన్ ఉద్య‌మాన్ని ఉధృతం చేశారు. వ‌రుస ట్విట్ల‌తో ఆయ‌న ఉద్య‌మం చేప‌డుతున్నారు. 
సుశాంత్ సామాన్య‌మైన వ్య‌క్తి కాదు..మాన‌సికంగా ధృఢ‌మైన వ్య‌క్తి అని, అసామాన్య ప్ర‌తిభావంతుడు అని అలాంటి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారంటే ఎవ‌రూ న‌మ్మ‌రు అని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌ర‌ణం వెనుక వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాల‌ని, అందుకే తాను ట్విట్ట‌ర్ లో జ‌స్టిస్ ఫ‌ర్ సుశాంత్ ఫోర‌మ్ ప్రారంభించాన‌ని తెలిపారు. సుశాంత్ మ‌ర‌ణం వెనుక సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని శేఖ‌ర్ సుమ‌న్ డిమాండ్ చేశారు. 
బాలీవుడ్‌లో మాఫియా కార్య‌క్ర‌మాల‌కు అంతం ప‌ల‌కాల‌ని, గ్యాంగులు, గ్రూపులు చెల్ల‌చెదుర‌య్యేలా ఉద్య‌మం చేయాల‌ని, బ‌య‌టి వ్య‌క్తుల‌పై చేసే మాన‌సిక దాడుల‌ను ధీటుగా ఎదురించాల‌ని  శేఖ‌ర్ తెలిపారు. సుశాంత్ కు జ‌రిగిన అన్యాంపై బ‌లంగా, ఎలుగెత్తి నినాదం చేయాల‌ని, ఆయ‌న మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ చేప‌ట్టే మాదిరిగా ఒత్తిడి తీసుకురావాల‌ని అందుకే ఫోరాన్ని ప్రారంభించాన‌ని పేర్కొన్నారు. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హకారం అందించాల‌ని కోరారు. అదే విధంగా సుశాంత్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తి కాబట్టి బీహార్ సెంటిమెంట్ ఉద్య‌మానికి మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ, ఇది కేవం బీహారీ ఉద్య‌మం కాద‌ని, దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ నైతిక మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని , బాలీవుడ్లో సుశాంత్ లాంటి మ‌రో విషాదం జ‌ర‌గ‌కుండా యువ ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టేలా ఉద్య‌మాన్ని బ‌లోపేతం చేద్దాం అని శేఖ‌ర్ ట్వీట్ చేశారు. ఇవి చ‌ద‌వండి: క‌రోనాతో తృణ‌మూల్ ఎమ్మెల్యే మృతి

No comments:

Post a Comment