Friday, June 19, 2020

"రాజ్య‌స‌భ" ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం...!

అమ‌రావ‌తి( Amaravathi):
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నాలుగు రాజ్య‌స‌భ స్థానాల‌కు శుక్ర‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. ఎన్నిక‌లు జ‌రిగిన నాలుగు స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. వైసీపీ త‌ర‌పున ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వాని విజ‌యం సాధించారు. మొత్తం 175 ఓట్ల‌కు గాను 173 ఓట్లు పోల‌య్యాయి. గెలుపొందిన ఒక్కొక్క అభ్య‌ర్థికి 38 ఓట్లు రాగా..టిడిపి అభ్య‌ర్థి వ‌ర్ల రామ‌య్య‌కు 17 ఓట్లు వ‌చ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అవ‌న్నీటిడిపి స‌భ్యుల‌వే కావ‌డం గ‌మ‌నార్హం. అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. పోలింగ్ ముగిసిన వెంట‌నే కౌంటింగ్ చేప‌ట్టారు. తాజా గెలుపుతో రాజ్య‌స‌భ‌లో వైసీపీ బ‌లం 6కు చేరింది. 
దేశ‌వ్యాప్తంగా 8 రాష్ట్రాల ప‌రిధిలో 19 స్థానాల‌కు..ఏపీలోనాలుగు స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. టిడిపి ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఓటు హ‌క్కును వినియోగించుకోలేక‌పోయారు. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కే ఓటు వేశారు. జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర ప్ర‌సాద్ కూడా వైసీపీ అభ్య‌ర్థికే ఓటు వేశారు. దీంతో న‌లుగురు వైసీపీ అభ్య‌ర్థుల‌కు 38 చొప్పున  ప్రాధాన్య‌త ఓట్లు ల‌భించాయి. టిడిపి అభ్య‌ర్థి అయిన వ‌ర్ల రామ‌య్య‌కు 17 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇవి చ‌ద‌వండి: చ‌నిపోలేదు...చంపేశారు..!
చెల్ల‌ని టిడిపి రెబ‌ల్ ఎమ్మెల్యేల ఓట్లు..!
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టిడిపి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేల ఓటు చెల్ల‌లేదు. టిడిపి రెబ‌ల్ ఎమ్మెల్యేలు క‌ర‌ణం బ‌ల‌రాం, మ‌ద్దాలి గిరి, వ‌ల్ల‌భ‌నేని వంశీలు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ముగ్గురు గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టిడిపి నుంచి గెలిచారు. ఆ త‌ర్వాత టిడిపి పై తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేశారు. వారు రాజ్య‌స‌భ‌లో వైసీపీ అభ్య‌ర్థుల‌కే ఓట్లు వేస్తార‌ని ముందుగానే టిడిపి నేత‌లు ప‌సిగ‌ట్టారు. ఎవ‌‌రికి ఓటు వేశారో అనే విష‌యాన్ని ఏజెంట్‌కు త‌ప్ప‌కుండా చూపించాలి.దీంతో టిడిపికి క‌చ్చితంగా ఓటు వేయాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో వారు టిడిపికి ఓటు వేసినా చెల్ల‌ని విధంగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఒక‌టి అని పెట్టాల్సిన మొద‌టి ప్రాధాన్య‌త స్థానంలో టిక్ మార్కు పెట్టారు. దీంతో వారి ఓట్లు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో లెక్క‌కు రాకుండా పోయాయి. 

No comments:

Post a Comment