Friday, June 5, 2020

"స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు రుణ‌మాఫీ చేయాలి"

ఐద్వా తెలంగాణ రాష్ట్ర క‌మిటీ విజ్ఞ‌ప్తి

ఖ‌మ్మం(Khammam): గ‌త నాలుగు నెల‌లుగా క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌నుల్లేక ఇత‌ర ఆదాయ మార్గాలు లేక అల్లాడుతున్నార‌ని, ఈ నేప‌థ్యంలో పొదుపు గ్రూపుల్లో ఉన్న ల‌క్ష‌ల మంది స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు పొదుపు ఆగిపోకుండా చెల్లించ‌డం క‌ష్టంగా మారింద‌ని ఐద్వా తెలంగాణ రాష్ట్ర క‌మిటీ పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి గ్రూప్‌కు ల‌క్ష రూపాయ‌ల రుణ‌మాఫీ చేయాల‌ని ఐద్వా రాష్ట్ర క‌మిటీ ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేసింది. ఈ నెల 5 నుంచి అన‌గా శ‌నివారం నుంచి రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌కు పిలుపునిచ్చిన‌ట్టు శుక్ర‌వారం తెలిపారు. దీంతో పాటు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌కి పొదుపు మ‌హిళ‌లంద‌రూ ఈ డిమాండ్ల విష‌య‌మై ఎస్ ఎంఎస్‌ల ద్వారా పంపించాల‌ని ఐద్వా నాయ‌క‌త్వం కోరింది. గ‌తంలో అనేక స‌మ‌స్య‌ల‌పై పోరాడే సాధించుకున్నాం. కాబ‌ట్టి అంద‌రూ ఐక్యంగా క‌దిలితే ఎటువంటి స‌మ‌స్య అయినా సాధించగ‌లుగుతామ‌ని ఐద్వా సీనియ‌ర్ నాయ‌కురాలు బ‌త్తుల హైమావ‌తి పేర్కొంది. 

No comments:

Post a Comment