Monday, June 22, 2020

ముంబైకి మ‌రో ముప్పు ఉందంట‌..!

 దేశంలో అత్య‌ధికంగా క‌రోనా దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న ముంబాయి మ‌హాన‌గ‌రానికి మ‌రో ముప్పు ముంచుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హాన‌గ‌రానికి దాహార్తిని తీరుస్తున్న ఏడు స‌రస్సులు, ఆన‌క‌ట్ట‌ల్లో నీటి నిల్వ‌లు అడుగంటాయి. కేవ‌లం మ‌రో 42 రోజుల‌కు స‌రిప‌డే నీళ్లు మాత్ర‌మే వీటిలో మిగిలాయి. జూన్ నెల‌లో వాన‌లు బాగానే కురిసినా స‌ర‌స్సుల్లోకి చేరిన నీరు మాత్రం అంత‌త‌మాత్ర‌మే. 

ముంబాయి(Mumbai): ఎగువ వైత‌ర్ణ‌, మ‌ధ్య వైత‌ర్ణ‌, మోద‌క్ సాగ‌ర్‌, త‌న్సా, భ‌ట్సా, విహార్‌, తుల‌సి స‌ర‌స్సుల‌కు దాదాపు 14.47 ల‌క్ష‌ల లీట‌ర్ల తాగు నీటిని నిల్వ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉంది. ప్ర‌స్తుతం వీటిలో 1.57 ల‌క్ష‌ల లీట‌ర్ల నీరు మాత్ర‌మే అందుబాటులో ఉంది. తాగునీటి నిల్వ‌ల‌పై న‌గ‌ర‌వాసులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(బీఎంసీ) అధికారులు తెలిపారు. ముందుముందు వాన‌లు బాగా కురుస్తాయ‌నే స‌మాచారం త‌మ‌కు ఉంద‌ని చెప్పారు. గుడ్‌న్యూస్ :క‌రోనా చికిత్స‌కు ఔష‌ధం విడుద‌ల‌
గ‌తేడాది ఇదే స‌మ‌యానికి ఈ ఏడు స‌ర‌స్సుల్లో 82,829 లీట‌ర్ల నీరు మాత్ర‌మే ఉంది. 2018లో ఇంత‌కంటే దారుణంగా నీటి నిల్వ‌లు త‌గ్గిపోయాయి. దాంతో పంపిణీ  చేసే నీటిలో ప‌ది శాతం కోత విధించారు. ఈ ఏడాది నీటి పంపిణీలో కోత ఉండ‌క‌పోవ‌చ్చ‌ని బీఎంసీ అధికారులు వెల్ల‌డించారు. ముంబాయి దాహార్తిని తీర్చ‌డానికి రోజుకు 420 కోట్ల లీట‌ర్లు అవ‌స‌రం కాగా, 375 కోట్ల లీట‌ర్ల‌ను మాత్ర‌మే బీఎంసీ పంపిణీ చేయ‌గ‌లుగుతోంది.  ఈ ఏడాది ముంబాయిలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ సంస్థ వెల్ల‌డించింది. ఎగువ వైత‌ర్ణ‌, మ‌ధ్య వైత‌ర్ణ త‌దిత‌ర డ్యాముల్లో నీటి నిల్వ‌లు గ‌తేడాదితో పోల్చితే బాగానే ఉన్నాయి. ప్ర‌స్తుతానికి తాగునీటి అందుబాటుపై ఎలాంటి బెంగ అవ‌స‌రం లేదు అని బీఎంసీ అడిష‌న‌ల్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పీవేల్ ర‌సు తెలిపారు. 

చావుబ‌తుకుల మ‌ధ్య చిన్నారి..!

ఆగ్రా(Agra): దేశంలో ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న తరుణంలో పెరుగుతున్న రోగుల సంఖ్య కార‌ణంగా అంద‌రికీ స‌రైన వైద్యం అంద‌డం లేదనేది బ‌హిరంగంగా వినిపిస్తున్న మాట‌. ఓ వైపు కొన్ని ఆస్ప‌త్రుల్లో బెట్ల కొర‌త ఉంటే, మ‌రో చోట సిబ్బంది కొర‌త వేధిస్తోంది. ఈ నేప‌థ్యంలో హైడ్రోసెఫాలస్‌తో బాధ‌ప‌డుతున్న ఓ మూడు నెల‌ల ఆగ్రా కు చెందిన చిన్నారి న్యూరో స‌ర్జ‌న్ కోసం చావు బ్ర‌తుకుల మ‌ధ్య గ‌త 8 రోజులుగా ఎదురుచూస్తోంది. వివ‌రాల్లోకి వెళితే..ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఆగ్రాకు చెందిన పూజ‌, ల‌వ్‌కేశ్ కుమారల‌కు మార్చినెల‌లో ఓ కూతురు పుట్టింది. చిన్నారి హైడ్రోసెఫాల‌స్తో బాధ‌ప‌డుతోంద‌ని తెలుసుకున్న వారు ఏప్రిల్ 15న ఎస్ ఎన్ మెడిక‌ల్ కాలేజీ ఆసుప‌త్రిలో చేర్పించారు. అనంత‌రం ఆసుప‌త్రిలో న్యూరోస‌ర్జ‌న్ చిన్నారికి ఆప‌రేష‌న్ చేశాడు. 
పాప‌కోలుకోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే కొద్ది రోజుల త‌ర్వాత చిన్నారి త‌ల వాయిటం మొద‌లైంది. దీంతో జూన్ 14న మ‌ళ్లీ ఆసుప‌త్రికి తీసుకొచ్చారు. త‌మ ఆసుప‌త్రిలో ఉన్న ఒక్క న్యూరో స‌ర్జ‌న్  క్వారంటైన్‌లో ఉన్నాడ‌ని, వైద్యం అందించ‌లేమ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. దీంతో చావు బ్ర‌తుక‌ల మ‌ధ్య ఆ చిన్నారి గ‌త ఎనిమిది రోజులుగా వైద్యుడి కోసం ఎదురుచూస్తోంది.  1.భార‌త్ -చైనా స‌రిహ‌ద్దు: ఆ రోజు ఏం జ‌రిగిందంటే..?

ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో మృత‌దేహాం..!

హైద‌రాబాద్(Hyderabad): కాళ్లు, చేతులు క‌ట్టేసి ప్లాస్టిక్ క‌వ‌ర్‌లోచుట్టి ఉంచిన గుర్తి తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైన సంఘ‌ట‌న బాలాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్ట‌ర్ భాస్క‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... బురాన్‌ఖాన్ చెరువు ప్రాంతంలో గుర్తుతెలియ‌ని మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు ఉండ‌టాన్ని శ‌నివారం రాత్రి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.
వ‌న‌స్థ‌లిపురం ఏసీపీ జ‌య‌రాం, బాలాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్ భాస్క‌ర్‌, ఎస్సై నాగ‌రాజ్‌లు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ఆధారాలు సేక‌రించారు. మృత‌దేహాన్ని కాళ్లు, చేతులు క‌ట్టి ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో చుట్టి ఉంచారు. మృతుడి వ‌య‌సు 20 ఏళ్లు ఉండ‌వ‌చ్చున‌ని పోలీసులు భావిస్తున్నారు. ఎక్క‌డో హత్య‌చేసి ఇక్క‌డ ప‌డేసి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అయితే మృతుడి ఒంటిపై ఎలంటి గాయాలు లేవ‌ని తెలిపారు. అనుమాన‌స్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేపట్టారు. స‌మీపంలోని సీసీ కెమెరాల పుటేజీని ప‌రిశీలించ‌డంతో పాటు ఇత‌ర ఠాణాల్లో న‌మోదైన మిస్సింగ్ కేసుల‌పై దృష్టి సారించారు.  

No comments:

Post a Comment