Sunday, June 28, 2020

లాక్‌డౌన్ దిశ‌గా కేసీఆర్ ..ఎక్క‌డంటే?

 తెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి అత‌లాకుత‌లం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత ప్ర‌స్తుతం క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. లాక్ డౌన్ విధించాలా? వ‌ద్దా అన్న సందిగ్ధంలో ప‌డి పోయాయి.  కేసుల తీవ్ర‌త‌ను చూస్తుంటే దేశ‌వ్యాప్తంగా మ‌రో లాక్‌డౌన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తూన్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాక్‌డౌన్ విష‌యంలో మ‌రో సారి ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

 హైద‌రాబాద్‌(Hyderabad): జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా క‌ట్ట‌డికి మూడు, నాలుగు రోజుల్లో  ఏ విష‌య‌మైంది ప‌క్కా స‌మాచారం తెలియ‌జేయాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో అందులోనూ జీహెచ్ ఎంసీ ప‌రిధిలో రోజురోజుకీ క‌రోనా కేసుల సంఖ్య  పెరిగిపోతున్న నేప‌థ్యంలో కేసీఆర్ అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. క‌రోనా క‌ట్డ‌డికి వ్యూహం, అవ‌స‌ర‌మైతే లాక్‌డౌన్ విధించ‌డం లాంటి అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. 
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తేశాఖ క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య‌ను పెంచిన త‌ర్వాత ఇది  మ‌రింత ఎక్కువైంది. నిన్న(శ‌నివారం) ఒక్క‌రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1087 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అందులో జీహెచ్ ఎంసీవి 888 కేసులు కావ‌డం గ‌మ‌నార్హం. జీహెచ్ ఎంసీలో కేసుల  సంఖ్య పెరుగుతుండ‌టంతో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించాల‌ని ప్ర‌జ‌ల నుంచి విన‌తులు, వివిధ వ‌ర్గాల నుంచి ప్ర‌తిపాద‌న‌లు వ‌స్తున్నాయి.  లాక్‌డౌన్  అంశంపైనా స‌మావేశంలో చ‌ర్చించార‌ని స‌మాచారం. జీహెచ్ఎంసీలో లాక్‌డౌన్ విధింపుపై కొద్దిరోజుల్లో తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఎక్కువ క‌రోనా కేసులు వ‌చ్చినంత మాత్రాన ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెంద‌క్క‌ర్లేద‌ని సీఎం అన్నారు. అంద‌రికీ స‌రైన వైద్యం కోసం ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ఏర్పాట్లూ చేసింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఇవి చ‌ద‌వండి: తాజా ఘ‌ర్ష‌ణ‌ల దృష్ట్యా.. ఆ దేశ‌ సైనికుల‌కు క‌ఠోర శిక్ష‌ణ‌

క‌రోనా విష‌యంలో భారీ  జ‌రిమానా..!

రాజ‌స్థాన్ జిల్లా భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13 న త‌న కుమారుడి వివాహం జ‌రిపించాడు. క‌రోనా ముప్పు నేప‌థ్యంలో శుభ కార్య‌క్ర‌మాల‌కు కేవ‌లం 50 మంది అతిథుల‌కే అధికారుల అనుమ‌తి ఉంది. ఈ నిబంధ‌న‌ల‌ను లెక్క‌చేయ‌ని ఆ కుటుంబం వివాహ వేడుక‌కు భారీ సంఖ్య‌లో అతిథుల‌ను పెళ్లికి ఆహ్వానించింది. అనంత‌రం ఈ వేడుక‌కు హాజ‌రైన వారిలో 15 మందికి క‌రోనా సోకిన‌ట్టు తేలింది.
వీరిలో ఒక‌రు తీవ్ర ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతూ చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన గీసులాల్ రాఠీపై పోలీసులు ఈ నెల 22న కేసు నమోదు చేశారు. అయితే క‌రోనా సోకిన 15 మందిని ప్ర‌భుత్వం ఐసోలేష‌న్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించింది. వీరి క‌రోనా ప‌రీక్ష‌ల‌కు, చికిత్స‌కు , ఆహారానికి, అంబులెన్స్‌కు మొత్తంగా రూ.6,26,600 ఖ‌ర్చు అయింది. నిర్ల‌క్ష్యం వ‌హించి ఇంత‌మందికి క‌రోనా సోక‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తి నుంచే డ‌బ్బులు రాబ‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ రాజేంద్ర‌భ‌ట్ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.  జ‌రిమానా విధించిన డ‌బ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు డిపాజిట్ చేయాల‌ని సూచించారు. ఇవి చ‌ద‌వండి: క‌రోనా ప్ర‌భావం:ఎన్నారైల ‌పై ఎలా ఉందంటే?

No comments:

Post a Comment