Thursday, June 25, 2020

బీహార్‌లో పెనువిషాదం..!

పిడుగుపాటుకు 83 మంది మృతి

ప‌ట్నా(Patna): బిహార్ లో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో కురిసిన పిడుగుల వాన తీవ్ర న‌ష్టం క‌లిగించింది. ఐదు జిల్లాల ప‌రిధిలోని ఉరుములు, మెరుపుల‌తో కురిసిన భారీ వ‌ర్షానికి 83 మంది ప్రాణాలు కోల్పోయారు. గోపాల్ గంజ్ జిల్లాలో 13 మంది, న‌వాడా నుంచి 8, సివాన్‌, భ‌గ‌ల్ఫూర్ నుంచి చెరో ఆరుగురు, ద‌ర్భాంగ‌, బంకా నుంచి చెరో ఐదుగురు చొప్పున‌..ఇలా ప‌లు ప్రాంతాల్లో మొత్తం 83 మంది మృత్యువాత‌ప‌డ్డారు.

 గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రుల్లో చేర్పించారు. మ‌రో వైపు, ప్ర‌జ‌లంతా ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని అధికారులు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. బ‌య‌ట‌కు వెళ్లిన వాళ్లు చెట్ల కింద నిల‌బ‌డ‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. భార‌త వాతావ‌ర‌ణ శాఖ కూడా బీహార్‌లోని ప‌లు ప్రాంతాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. గురు, శుక్ర‌వారాల్లో బిహార్ లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. మృతుల్లో ప‌లువురు చిన్నారులు కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలోకి ఇంకా రుతు ప‌వ‌నాలు ప్ర‌వేశించ‌డానికి ముందే వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ ఘ‌టన‌పై బిహార్ సీఎం నితీష్ కుమార్ తీవ్ర దిగ్భాంత్రి వ్య‌క్తం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. ఇవి చ‌ద‌వండి :అలెర్ట్:ముంచుకొస్తున్న మిడ‌త‌ల ముప్పు..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ...

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షం, పిడుగులు ప‌డ‌టం వ‌ల్ల 24 మంది వ‌ర‌కూ చ‌నిపోయార‌ని, చాలా మంది గాయ‌ప‌డ్డార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప‌శువులు కూడా చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం. యూపీ రిలీఫ్ క‌మిష‌న‌ర్ స్పందిస్తూ పిడుగుల వ‌ల్ల గురువారం ఒక్క రోజే 24 మంది చ‌నిపోయ‌ర‌ని తెలిపారు. దేవ‌రియా జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువుగా ఉంది. అక్క‌డ ఆరుగుగురు చ‌నిపోయార‌న్నారు. 

No comments:

Post a Comment