Friday, June 5, 2020

కొత్త పథకాలు ఉండవు..విజ్ఞప్తులు పంపవద్దు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలు ప్రవేశ పెట్ట బోమని కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. 'ఆత్మ నిర్మర్ భారత్', 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అభియాన్' తదితర ప్రత్యేక పథకాలకు మాత్రమే నిధుల కేటాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. 
ఈ పథకాల పరిధిలోకి రాని ఏ ఖర్చులేనా.. ఆదాయ వ్యయం విభాగం అనుమతి పొందాలని సీతారామన్ స్పష్టం చేశారు. ఇప్పటికే బడ్జెట్ ఆమోదం పొందిన ఇతర పథకాలను 2021 మార్చి 31వరకు  నిలిపివేస్తున్నట్లు  మంత్రి వివరించారు. అంతే కాకుండా కొత్త పథకాలకు నిధులు కేటాయించాలంటూ విజ్ఞప్తులు పంపవద్దని ఇతర మంత్రిత్వ శాఖలకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ప్రస్తుతం 2,26,770 కరుణా కేసులతో భారతదేశం ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. ఇక మరణాలు కేసులో 12 స్థానాల్లోనూ యాక్టివ్ కేసులు విషయంలో ఐదవ స్థానంలోనూ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి కోసం సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్ డౌన్ ప్రభావంతో ప్రభుత్వ ఆదా యం పడిపోయింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చులపై కోత విధిస్తున్నాయి. కరోనా వ్యాప్తి తరుణంలో పరిమితంగా ఉన్న వనరులను మారు తున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా విచక్షణతో వినియోగించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ నేటి ప్రకటనలో తెలిపింది.

No comments:

Post a Comment