Friday, June 5, 2020

కాలుష్యం పెర‌గ‌డానికి ప్ర‌భుత్వాలే కార‌ణం

డివైఎఫ్ఐ ఖ‌మ్మం జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ బ‌షీరుద్దీన్‌

ఖ‌మ్మం(Khammam):ప‌్ర‌పంచంలోనూ దేశంలోనూ కాలుష్యం పెర‌గ‌డానికి చిత్త‌శుద్ధిలేని ప్ర‌భుత్వాలేన‌ని, ప‌ర్యావ‌ర‌ణ సంప‌ద‌ను బ‌హుళ‌జాతి కంపెనీల‌కు అప్ప‌గించి వాటిని నాశ‌నం చేస్తూ ఉన్న‌ర‌ని డివైఎఫ్ ఐ ఖ‌మ్మం జిల్లా కార్య‌ద‌ర్శి షేక్ బ‌షీరుద్దీన్ అన్నారు. శుక్ర‌వారం ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌రియు సంఘం 40 సంవ‌త్స‌రాలు అవుతున్న సంద‌ర్భంగా ఖ‌మ్మం రెండో ప‌ట్ట‌ణ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బ‌షీరుద్దీన్ మాట్లాడుతూ.. పెద్ద‌పెద్ద ఫ్యాక్టరీ నుండి కంపెనీ నుండి వ‌చ్చే కాలుష్యాన్ని అరిక‌ట్ట‌కుండా వారితో ప్ర‌భుత్వాలు మిలాఖ‌త్ అయి కాలుష్యాన్ని పెంచుతున్నాయ‌ని విమ‌ర్శించారు. మ‌రో ప‌క్క ప్ర‌జ‌ల‌ను మొక్క‌లు నాటాల‌ని చెబుతూ పోడు భూములు చేసుకునే వారి పైన వ్య‌వ‌సాయం చేసుకునే వారిపైన కాలుష్య నియంత్ర‌ణ పేరుతో దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు.
కాలుష్యం నివారించాలంటే అడ‌వుల‌ను, న‌దుల‌ను, గ‌నుల‌ను జంతువుల‌ను ర‌క్షించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మ‌రియు డివైఎఫ్ ఐ 40 వ‌సంతాలు సంద‌ర్భంగా ప్ర‌తి కార్య‌క‌ర్త ఒక మొక్క‌ను నాటాల‌ని ప్ర‌తి క‌మిటీ 40 మొక్క‌లు నాటాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో సంఘం జిల్లా ఉపాధ్య‌క్షులు భూక్య ఉపేంద్ర నాయ‌క్‌, నాయ‌కులు అల్లుడు దుర్గ‌, పుష్ప‌రాజ్‌, వెంక‌న్న‌, యాటా రాజేష్‌, ఉద‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment