Friday, June 19, 2020

అమానుషం: అపార్టుమెంట్‌లో ఆరు మృత‌దేహాలు..!

గుజ‌రాత్(Gujarat):
వారికి ఎంత క‌ష్ట‌మొచ్చిందో ఏమో తెలియ‌దు...ఏ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారో తెలియ‌దు కానీ కుటుంబమంతా ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న గుజ‌రాత్‌లోని వెలుగుచూసింది. ఈ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. 
 విహార‌యాత్ర‌కు అని చెప్పి వెళ్లిన ఆరుగురు కుటుంబ‌స‌భ్యులు ఓ అపార్టుమెంట్‌లో ఉరివేసుకొని విగ‌త‌జీవులుగా మారారు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు, వారి న‌లుగురు పిల్ల‌ల మృత‌దేహాల‌ను చూసి పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. ఈ అనుమాన‌స్ప‌ద సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో క‌ల‌క‌లం రేపింది. వాత్వా జీఐడీసీ ఇన్‌స్పెక్ట‌ర్ డీఆర్ గోపాల్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...అహ్మ‌దాబాద్‌కు చెందిన అమ్రిష్ ప‌టేల్‌(42), గౌరంగ్ ప‌టేల్‌(40) అన్న‌ద‌మ్ములిద్ద‌రూ న‌గ‌రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివ‌సిస్తున్నారు. ఈ నెల 17న విహార‌యాత్ర‌కు వెళుతున్నామ‌ని ఇంట్లో భార్య‌ల‌కు చెప్పి ఏడేళ్ల వ‌య‌స్సు నుంచి 12 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారి పిల్ల‌ల‌ను తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లారు. ఇది చ‌ద‌వండి: చ‌నిపోలేదు..చంపేశారు..!
కానీ 18వ తేదీ రాత్రి వ‌ర‌కూ కూడా ఇంటికి చేరుకోక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన కుటుంకానీ 18వ తేదీ రాత్రి వ‌ర‌కూ కూడా ఇంటికి చేరుకోక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన కుటుంస‌భ్యులు వాత్వా జీఐడీసీ ప్రాంతంలోని ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. లోప‌లి నుంచి గ‌డియ‌పెట్టి ఎంత‌కూ తీయ‌క‌పోవ‌డంతో పోలీసులకు స‌మాచారం అందించారు. త‌లుపులు తీసి లోప‌లికి వెళ్లిన పోలీసులు ఉరివేసుకొని  6గురు మృతి చెందిన‌ట్టు గుర్తించారు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మృత‌దేహాల‌ను డ్రాయింగ్ రూంలో, ఇద్ద‌రు అమ్మాయిలు కృతి(9), సాన్వి(7) మృత‌దేహాల‌ను వంట‌గ‌దిలో గుర్తించారు. 12 ఏళ్ల మ‌యూర్‌, ధృవ్ మృత‌దేహాల‌ను బెడ్‌రూమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఆహారంలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి పిల్ల‌ల‌కు తినిపించి అనంత‌రం ఉరివేసి, వారు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్టు అనుమానిస్తున్నారు. మృత‌దేహాల‌ను ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించి, విచార‌ణ జరుపుతున్న‌ట్టు ఇన్‌స్పెక్ట‌ర్ తెలిపారు. స‌భ్యులు వాత్వా జీఐడీసీ ప్రాంతంలోని ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూశారు. లోప‌లి నుంచి గ‌డియ‌పెట్టి ఎంత‌కూ తీయ‌క‌పోవ‌డంతో పోలీసులకు స‌మాచారం అందించారు. త‌లుపులు తీసి లోప‌లికి వెళ్లిన పోలీసులు ఉరివేసుకొని  6గురు మృతి చెందిన‌ట్టు గుర్తించారు. ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మృత‌దేహాల‌ను డ్రాయింగ్ రూంలో, ఇద్ద‌రు అమ్మాయిలు కృతి(9), సాన్వి(7) మృత‌దేహాల‌ను వంట‌గ‌దిలో గుర్తించారు. 12 ఏళ్ల మ‌యూర్‌, ధృవ్ మృత‌దేహాల‌ను బెడ్‌రూమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఆహారంలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి పిల్ల‌ల‌కు తినిపించి అనంత‌రం ఉరివేసి, వారు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్టు అనుమానిస్తున్నారు. మృత‌దేహాల‌ను ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించి, విచార‌ణ జరుపుతున్న‌ట్టు ఇన్‌స్పెక్ట‌ర్ తెలిపారు. 

No comments:

Post a Comment