Thursday, June 11, 2020

దేశ‌మంతా "అంబేద్క‌ర్" రాజ్యంగమైతే..ఏపీలో "రాజారెడ్డి రాజ్యాంగం"..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు లేఖ‌

అమ‌రావ‌తి(Amaravathi): దేశ‌మంతా అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం అమ‌లు చేస్తోంటే, ఏపీలో మాత్రం సీఎం వైఎస్ జ‌గ‌న్మోహాన్‌రెడ్డి త‌న సొంత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తున్నార‌ని , రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను చూస్తే అంబేద్క‌ర్ ఆత్మ‌క్షోభిస్తోంద‌ని, దేశ చ‌రిత్ర‌లో ఇంత‌టి రాక్ష‌స‌పాల‌న‌, విధ్వంజ‌కాండ ఏ ప్ర‌భుత్వ‌మూ  చేయ‌లేద‌ని ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌లు కురిపించారు. గురువారం రాష్ట్ర ప్ర‌జ‌లు బ‌హిరంగ లేక ఆయ‌న రాశారు. వైసీపీపాల‌న‌పై లేఖ‌లో పొందుప‌ర్చారు. 
ఏడాదిగా రాష్ట్రంలో ప‌రిణామాలు ఆందోళ‌న క‌రంగా మారాయ‌ని మాజీసీఎం చంద్ర‌బాబునాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాల‌కుల చేత‌గానిత‌నం, అవినీతి, క‌క్ష సాధింపుతో రాష్ట్రానికి తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టిడిపి హ‌యాంలో క‌న్నా వైసీపీ హ‌యాంలో ఆదాయం అధిక‌మైనా అభివృద్ధిలేద‌ని, సంక్షేమాన్ని కుదించార‌ని మండిప‌డ్డారు. అవినీతి, అరాచ‌కాలు పేట్రేగిపోయాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
వైసీపీ దుర్మార్గాల‌తో రాష్ట్రానికి కీడు, ప్ర‌జ‌ల‌కు చేటు ఏర్ప‌డింద‌న్నారు. వాటిని తెలియ‌జేసేందుకే ఈ బ‌హిరంగ లేఖ రాస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఏడాదిగా రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేక ‌పోయార‌ని, అప్పుల పాలైన రైతుల‌ను ఆదుకునే చ‌ర్య‌లు లేవ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పేద‌ల కోసం టిడిపి తెచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు ర‌ద్దు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. క‌రోనా ఉప‌శ‌మ‌న చ‌ర్య‌ల్లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని ఆక్షేపించారు. ప్ర‌జ‌ల‌పై రూ.50 వేల కోట్ల భారం మోపార‌ని, రూ.87 వేల కోట్లు అప్పులు చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. క‌రెంటు బిల్లులు, మ‌ద్యం ధ‌ర‌లు, ఇసుక‌, సిమెంట్ ధ‌ర‌లు విప‌రీతంగా పెంచేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వైసీపీ పాల‌న‌లో 70 మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు, 600 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 
1.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు త‌రిమేయ‌డంతో నిరుద్యోగం పెరిగిపోయింద‌న్నారు. ఏడాది పాల‌న‌లో వైసీపీ లోటుపాట్ల‌ను ఎత్తిచూపితే త‌ప్పులు చ‌క్క‌దిద్ద‌కుండా టిడిపిపై రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 
https://www.facebook.com/TDP.Official/?__tn__=kC-R&eid=ARBiZOctMXfBbMLsq8S57ZJtmQBRedD_wukNwN2Qj1ZripdzCB1adNH5ejbmhc4Bxz-Hlj8x2-o3z7HJ&hc_ref=ARQVBXnuyOwic_nDI4sKT-DZpk3BEZGeVQtbTq7b0OQAbQ2Vuam6OFHHAMvKFpr_oMU&fref=nf&__xts__[0]=68.ARDpHVnAQqZR0t_EtGmcff2fOPdjUVAOTdi1zkSW8IuiT4JkznW7STh8CdJ1VGx3Ak2p6--TQhPyfRrwMICnP84l8RKdBizni_VnbZToSnYSy9y2oO_VPA4EtG5gBJBCeeqejl8lKBPvGdnI4ZGXie_bt5hTpptBzoclaRDYd1fEWacnoZjPxZFSwIOyzT5n7K2eSnm9eBcNYjORwkdecgIxsuOqUMqLZ9zpsA_K2NoTt8pkSUXYZA8SzmPcsHAA6OCyCEKXcOqP6VtbOHT2fMjGOx42l7ZCVYMDXqVoXbDduCuqiBHx4m__mZtRjn1WsoWbsKYfon5VQED8eKo9soadWEOGMuU6W2QJWCzZkNPB36Zp8OUC_HOEGSwPCXNAp7GJs8VFVQqTFlyW3XyuGtQZ4BsjpNUJmmrfTlwpd-z8-vo94_dr2yv4RKdVr6iqWRGJBZa5mCfMmPTDDDoQZcyL7_xLm6JwEtMglbedU2KiUoCKGDwTw_rBgg
వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చ‌డానికే విధ్వంసాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ప్ర‌త్య‌ర్థ‌ల‌పై ప్ర‌తీకార‌మే ల‌క్ష్యంగా వైసీపీ ప‌నిచేస్తోంద‌ని మండిప‌డ్డారు. సీఎంగా ప్ర‌మాణం చేసిన రోజు నుంచే టిడిపిపై  జ‌గ‌న్ క‌క్ష‌సాధింపు చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసేందుకే ప్ర‌జావేదిక‌ను కూల్చేశార‌న్నారు. టిడిపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆర్థిక మూలాలు దెబ్బ‌తీయ‌డం, వ్యాపారాల‌కు న‌ష్టం చేయ‌డ‌మే వైసీపీ ల‌క్ష్య‌మ‌న్నారు. బెదిరించి,ప్ర‌లోభ‌ప‌రిచి లొంగ‌దీసుకోవ‌డ‌మే వైసీపీ దుష్ట‌సిద్ధాంత‌మ‌ని మండిప‌డ్డారు. ప్ర‌కాశం జిల్లాలో గ్రానైట్‌గ‌నుల య‌జ‌మానులపై రూ.2 వేల కోట్ల జ‌రిమానాలు విధించార‌ని విమ‌ర్శించారు. నెల్లూరులో టిడిపి ముస్లీం మైనార్టీ నాయ‌కులు ఇళ్లు కూల్చేశార‌ని, ప‌ల్నాడులో భ‌యోత్పాతం నెలకొల్పి టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ను ఊళ్ల లోంచి త‌రిమేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల‌పై దాడులు చేశార‌ని మం డిప‌డ్డారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో దాడులు, దౌర్జ‌న్యాల‌తో భ‌యోత్పాతం సృష్టిస్తున్నార‌ని, వైసీపీ బాధితుల కోసం పున‌రావాస శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన ప‌రిస్థితి రావ‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు. 

No comments:

Post a Comment