Friday, June 26, 2020

ఈఎస్ఐ కుంభ‌కోణం : స‌మ‌యంలో మంత్రిగా లేను..!

అమ‌రావ‌తి(Amaravathi) : ఈఎస్ ఐ మందుల కొనుగోళ్ల వ్య‌వ‌హారంతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని టీడీఎల్పీ ఉపనేత‌, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏసీబీ విచార‌ణ‌లో స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలుస్తోంది. మందుల కొనుగోలు అంశాల‌న్నీ ఈఎస్ఐ డైరెక్ట‌ర్ల చేతుల్లోనే ఉంటాయ‌ని తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ వ్య‌వ‌హారంలో అరెస్ట‌యి రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడు ప్ర‌స్తుతం గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల‌పాటు ఆస్ప‌త్రిలోనే ఆయ‌న్ను విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమ‌తించ‌డంతో గురువారం ద‌ర్యాప్తు అధికారులు అచ్చెన్నాయుడును 3 గంట‌ల‌పాటు ప‌శ్నించారు. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ఏసీబీ జేడీ ర‌విశంక‌ర్ ఈ విచార‌ణ‌కు రాలేద‌ని తెలుస్తోంది. రాష్ట్ర కార్యాల‌యం నుంచి ఏసీబీ డిఎస్పీ ప్ర‌సాద్‌..ఒక సీఐ, ఇద్ద‌రు స‌హాయ‌కులు, ఓ ఫొటోగ్రాఫ‌ర్‌, మ‌రో వీడియో గ్రాఫ‌ర్‌తో క‌లిసి జీజీహెచ్‌కు వ‌చ్చారు. తొలుత వారు ఆస్ప‌త్రి సూప‌రింటెండెంతో స‌మావేశ‌మ‌య్యారు.
 త‌ర్వాత అచ్చెన్నాయుడు ఉన్న గ‌దికి వెళ్లారు. కోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు ఓ వైద్యుడు, న్యాయ‌వాది స‌మ‌క్షంలో ఆయ‌న్ను విచారించారు. సాయంత్రం 5 గంట‌ల‌కు ప్రారంభ‌మైన విచార‌ణ‌లో.. మొద‌టి రెండు గంట‌లూ కుటుంబ నేప‌థ్యం, రాజ‌కీయ వ్య‌వ‌హారాల గురించి అడిగిన‌ట్టు తెలుస్తోంది. చివ‌రి గంట‌‌లో ఈఎస్ఐ స్కాంకు సంబంధించిన ప్ర‌శ్న‌లు వేశారు. మందుల కొనుగోళ్ల‌లో పాటించిన నిబంధ‌న‌లేంటి? ఇత‌ర కొనుగోళ్ల‌లో టెంట‌ర్లు పిల‌వ‌క‌పోవ‌డంపై అభ్యంత‌రం చెప్పారా..? ఈ వ్య‌వ‌హారంపై మీరేం ఏం చెప్ప‌ద‌లుచుకున్నార‌ని అడిగారు. 
అచ్చెన్నాయుడు జ‌వాబు ఇస్తూ... మందులు, ఇత‌ర కొనుగోళ్ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. అప్ప‌టికే తాను ఆ శాఖ మంత్రిగా లేన‌ని చెప్పారు. టెలిమెడిసిన్‌కు సంబంధించి కేంద్రం అడిగింద‌ని, మొద‌ట్లో ప‌ట్టించుకోలేద‌ని..రెండోసారి అడ‌గ‌డంతో స‌మావేశం ఏర్పాటు చేసి ప్ర‌తిఅంశాన్ని మినిట్స్ పుస్త‌కంలో రాసి సంత‌కం చేసిన‌ట్టు తెలిపారు. అయితే ఒప్పంద ప్ర‌క్రియ‌లో ఒక కంపెనీకి ఎలా సిఫారుసు చేశార‌ని అధికారులు ప్ర‌శ్నించ‌గా.. కేంద్రం టెలిమెడిసిన్ ప్రారంభించిన‌ప్పుడు ఎక్క‌డెక్క‌డ ఎలా చేస్తారో ప‌రిశీలించాల‌ని చెప్పాన‌ని, తెలంగాణ‌, ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయో అదే విధానంలో వెళ్లే అంశాన్ని ప‌రిశీలించాల‌ని మాత్ర‌మే లేఖ రాశాన‌ని అచ్చెన్నాయుడు బ‌దులిచ్చిన‌ట్టు స‌మాచారం. అందులో ఒప్పందం చేసుకోవాల‌ని ఉంది క‌దా..అని ఏసీబీ అడుగ‌గా..ఒప్పందం త‌ర్వాత ఎక్క‌డైనా నా సంత‌కం ఉందా.. అధికారులంద‌రూ సంత‌కం చేశాకే నేను చేయాలి..ఎక్క‌డైనా చేశానా..? అని మంత్రి ఎదురు ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. 

అచ్చెన్నాయుడు ప్రాణాల‌తో చెల‌గాటం: నారా చంద్ర‌బాబు నాయుడు

ప్ర‌భుత్వం అచ్చెన్నాయుడి ప్రాణాల‌తో చెల‌గాట‌మాడే కుట్ర‌లు చేస్తోంద‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఆయ‌న్ని ఆసుప‌త్రి మంచంపైనే ప్ర‌శ్నించాల‌ని ఏసీబీ కోర్టు చెప్పింది. జీజీహెచ్ అధికారులై ఒత్త‌డి చేసి..అర్థ‌రాత్రి డిశ్చార్జి చేయాల‌ని అనుకోవ‌డం ఏమిటి? ఏసీబీ అధికారులు అదే స‌మ‌యంలో అదుపులోకి తీసుకోవాల‌ని చూడ‌ట‌మేంటి? అస‌లీ అర్థ‌రాత్రి కుట్ర‌లేంటి? అని గురువారం ట్విట‌ర్ లో నిల‌దీశారు." కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ..ఆసుప‌త్రి వ‌ర్గాల‌పై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇది కేసు విచార‌ణాల లేదు.
బీసీ నేత‌పై హ‌త్యాయ‌త్నంలా ఉంద‌ని ప్ర‌జాసంఘాలే అంటున్నాయి. ఈ కేసులో చూపే అత్యుత్సాహం..వైసీపీ భూ మాఫియా, 108 అంబులెన్సుల వ్య‌వ‌హారం, ఆ భూముల కుంభ‌కోణం ఇసుక మాఫియాల‌పై ఎందుకు లేదు?  కొంద‌రు పోలీసు అధికారుల విప‌రీత ప్ర‌వ‌ర్త‌న వ‌ల్లే ఉన్న‌తాధికారులు కోర్టుల ముందు నిల‌బ‌డాల్సి వ‌స్తోంద‌ని నిన్న‌నే హైకోర్టు ఆక్షేపించింది. అచ్చెన్నాయుడి విష‌యంలో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తే  స‌హించేది లేదు. న్యాయ‌ప‌రంగా పోరాడ‌తాం. మీ కుట్ర‌ల‌ను అడ్డుకుంటాం. "అని చంద్ర‌బాబు ట్వీట్‌లో స్ప‌ష్టం చేశారు.

No comments:

Post a Comment