Wednesday, June 24, 2020

స‌రిహ‌ద్దులో "ఆస‌క్తిక‌ర‌మైన" ఘ‌ట‌న‌..!

దేశ స‌రిహద్దులోని ల‌ద్దాఖ్ గ‌ల్వాన్ లోయ‌లో జూన్ 15-16 న ఎల్ ఏసీ ద‌గ్గ‌ర జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త సైన్యానికి చెందిన  క‌ల్న‌ల్ సంతోష్‌బాబుతో స‌హా 20 మంది సైనికులు మృతి చెందిన విష‌యం దేశ ప్ర‌జ‌ల‌కు తెలిసిందే. ఇదే క్ర‌మంలో మ‌న సైనికులు దేశం కోసం పోరాడి  వీర‌మ‌ర‌ణం పొంద‌డంతో చైనా దొంగ‌దెబ్బ‌ను భారతీయుల ఆగ్ర‌హానికి గురిచేసింది.  చైనా దురాఘాతానికి వ్య‌తిరేకంగా దేశంలో ప‌లు చోట్ల నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. యుద్ధం వ‌స్తే ఇప్పుడే స‌రిహ‌ద్దులోకి వెళ్లి పోరాడ‌తామ‌నే తెగింపు దేశ ప్ర‌జ‌ల్లో క‌నిపించింది. అయితే స‌రిహ‌ద్దు విషయంలో మ‌న సైనికుల్లో ఓ యువ సైనికుడు ఆ దేశ సైనిక అధికారికి చేతితో బుద్ధి చెప్పిన క‌థ‌నం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. 

న్యూఢిల్లీ(New Delhi): గ‌స్తీలో ఉన్న భార‌త లెఫ్టినెంట్‌కు చైనా మేజ‌ర్ ఒక‌త‌ను మా భూభాగంలోకి ఎందుకు వ‌చ్చావు...వెన‌క్కి వెళ్లిపో..! అంటూ రెచ్చ‌గొట్టాడు. తాను ఉన్న భూభాగం క‌చ్చితంగా సిక్కింలోదేన‌ని భార‌త గ‌స్తీ ద‌ళానికి స్పష్టంగా తెలుసు. కానీ చైనా సైనికులు ప‌దేప‌దే బాగా రెచ్చ‌గొడుతున్నార‌ని అర్థ‌మైంది. దీంతో భార‌త గ‌స్తీ బృందానికి నేతృత్వం వ‌హిస్తున్న లెఫ్టినెంట్ కు కోపం క‌ట్ట‌లు తెచ్చుకుంది. త‌న మాతృభూమిలోకి అక్ర‌మంగా ప్ర‌వేశించ‌డ‌మే కాకుండా బెదిరిస్తున్న చైనా మేజ‌ర్‌పైకి ఒక్క‌సారిగా దూసుకెళ్లి అత‌ని మూతిపై చాచికొట్టాడు. ఆ దెబ్బ‌కి..చైనా మేజ‌ర్ ముక్కుప‌గిలింది. ర‌క్తం కారుతుండ‌గా కింద ప‌డిపోయాడు. భార‌త వీర‌సైనికుల ఆగ్ర‌హాన్ని గ్ర‌హించిన చైనా గ‌స్తీద‌ళం మెల్ల‌గా వెన‌క్కి మ‌ళ్లింది. 
కొన్ని రోజుల క్రితం సిక్కిం స‌రిహ‌ద్దులో జ‌రిగిన సంఘ‌ట‌న ఇది. భార‌త యువ సైనికాధికారి సైన్యంలో చేరిన కొద్దికాల‌మే అయింది. చూడ‌టానికి బ‌క్క‌పల్చ‌గా  క‌నిపించినా గుండెల నిండా ధైర్యం, దేశాన్ని ఏమాత్ర‌మూ త‌క్కువ చేసి మాట్లాడినా త‌ట్టుకోలేని తత్వం. ఈ ఘ‌ట‌న స‌మాచారం సైనిక ఉన్న‌తాధికారుల‌కు చేరింది. మొదట్లో ఆందోళ‌న చెందినా మ‌న దేశంలోకి చొచ్చుకొచ్చిన చైనా మూక‌ల‌పై దాడి స‌రైన నిర్ణ‌య‌మేన‌ని తీర్మానించారు. ఇవి చ‌ద‌వండి:విద్యాశాఖ ఆరా..!ప‌బ్జీకి బానిసై "10 మంది విద్యార్థులు " ఆత్మ‌హ‌త్య‌..!

ఆ సైనికాధికారి ఎవ‌రంటే..!

అత‌ని పేరు బిరోల్ దాస్‌. కొద్దికాలం క్రిత‌మే శిక్ష‌ణ పూర్తి చేసుకొని విధుల్లో చేరాడు. 2017 లో ఎన్డీయేకు ఎంపికైన అత‌ను శిక్ష‌ణ‌లో మంచి ప్ర‌తిభ‌ను చాటాడు. ఈ యువ‌సైనికాధికారి కుటుంబం దేశ సేవ‌లోనే ఉండ‌టం విశేషం. ఆయ‌న తాత‌, తండ్రి సైన్యంలో సేవ‌లందించారు. ఆయ‌న సోద‌రి కూడా సైన్యంలోనే విధులు నిర్వ‌హిస్తోంది. ఈ దాడిలో యువ సైనికాధికారిని ప‌క్క‌న ఉన్న స‌హ‌చ‌రులు బ‌ల‌వంతంగా నిలువ‌రించి శిబిరానికి తీసుకువ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌య‌మై ఆయ‌న తండ్రితో ప్ర‌స్తావించ‌గా మీడియాతో త‌న అభిప్రాయాల‌ను పంచుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. అయితే దేశ సేవ‌లో ప్ర‌తిసైనికుడు చూపించిన నిబ‌ద్ధ‌త‌నీ, వీర‌త్వాన్నే త‌న కుమారుడు ప్ర‌ద‌ర్శించాడ‌ని వెల్ల‌డించారు. దేశ‌భ‌క్తి, తెగింపు భార‌తీయుల‌కు అద‌న‌పు శ‌క్తి.. అని ఉద్వేగంతో చెప్పారు. 

భార‌త్‌-చైనా ఘ‌ర్ష‌ణ: గ‌ల్వాన్ లోయ రెండు దేశాల‌కు ఎందుకు కీల‌కం?

గ‌ల్వాన్ లోయ వివాద‌స్ప‌ద అక్సాయ్ చీన్ ప్రాంతంలో ఉంది. ఇది ల‌ద్ధాఖ్‌, అక్సాయి చీన్ మ‌ధ్య భార‌త‌-చైనా స‌రిహ‌ద్దుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇక్క‌డ వాస్త‌వాధీన రేఖ‌(ఎల్ ఏసీ) అక్సాయ్ చీన్‌ను భార‌త్ నుంచి వేరు చేస్తుంది. అక్సాయ్ చీన్ మాదంటే..మాద‌ని భార‌త్‌- చైనా రెండూ చెబుతున్నాయి. ఈ లోయ చైనా ద‌క్షిణ  షింజియాంగ్‌, భార‌త్ ల‌ద్ధాఖ్ వ‌ర‌కూ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతం భార‌త్ కు వ్యూహాత్మ‌కంగా చాలా కీల‌కం. ఎందుకంటే ఇది పాకిస్థాన్‌, చైనాలోని షింజియాంగ్‌, ల‌ద్ధాఖ్ స‌రిహ‌ద్దుల‌ను తాకుతుంటుంది. 1962 యుద్ధ సమ‌యంలో గ‌ల్వాన్ న‌ది ద‌గ్గ‌రున్న ఈ ప్రాంతం యుద్ధానికి ప్ర‌ధాన కేంద్రంగా మారింది. ఈ లోయ‌లో రెండు దేశాల ప‌ర్వ‌తాలు వ్యూహాత్మ‌కంగా సైన్యానికి అడ్వాంటేజ్ ఇస్తాయి. ఇక్క‌డ జూన్ ఎండ‌ల్లో కూడా ఉష్ణోగ్ర‌త సున్నాకంటే త‌క్కువ ఉంటుంది. ఇవి చ‌ద‌వండి:క‌రోనాతో తృణ‌మూల్ ఎమ్మెల్యే మృతి
చ‌రిత్ర‌కారులు ఈ ప్రాంతానికి ఆ పేరు ఒక సాధార‌ణ ల‌ద్ధాఖీ వ్య‌క్తి గులామ్ ర‌సూల్ గ‌ల్వాన్ పేరున వ‌చ్చింద‌ని చెబుతారు. ఈ ప్రాంతాన్ని గుర్తించింది ఆయ‌నే. గ‌ల్వాన్ లోయ‌లో త‌మ ప్రాంతంలో నిర్మిస్తున్న ర‌హ‌దారిని అడ్డుకోడానికే ఈ దాడి చేసింద‌ని భార‌త్ చెబుతోంది. దార్బుక్ -ష్యోక్‌-దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ భార‌త్‌కు ఈ మొత్తం ప్రాంతంలో పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుంది. ఈ రోడ్ కారోకోర‌మ్ పాస్ ద‌గ్గ‌ర మోహ‌రించి ఉన్న జ‌వాన్ల‌కు స‌రుకులు, ఆయుధాలు చేర్చ‌డానికి చాలా కీల‌కం. 

వాస్త‌వాధీన రేఖ‌కు..నియంత్ర‌ణ రేఖ‌కు తేడా ఏమిటి?

భార‌త్ భూ స‌రిహ‌ద్దు (లాండ్ బార్డ‌ర్‌) మొత్తం 15,106.7 కిలోమీట‌ర్లు. అది మొత్తం ఏడు దేశాల‌తో ఉంది.  అది కాకుండా 7516.6 కిలోమీట‌ర్ల స‌ముద్ర స‌రిహ‌ద్దులు కూడా ఉన్నాయి. భార‌త ప్ర‌భుత్వ వివ‌రాల ప్ర‌కారం ఏడు దేశాల్లో  బంగ్లాదేశ్ (4,096.7 కి.మీ), చైనా (3,488 కి.మీ), పాకిస్థాన్‌(3,323 కి.మీ), నేపాల్ (1.171 కి.మీ), మ‌యాన్మార్ (1,643 కి.మీ), భూటాన్ (699 కి.మీ), అఫ్గానిస్తాన్‌(106 కి.మీ ) ఉన్నాయి.  ఇవి చ‌ద‌వండి: 70 మంది క‌రోనా రోగులు ఏమ‌య్యారు?
భార‌త్-చైనాతో 3488 కిలోమీట‌ర్ల సుదీర్ఘ స‌రిహ‌ద్దును పంచుకుంటుంది. ఈ స‌రిహ‌ద్దు జ‌మ్ము - కాశ్మీర్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్, సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ల మీదుగా ఉంటుంది.  దానిని మూడు సెక్టార్లుగా విభ‌జించారు. ప‌శ్చిమ సెక్టార్ అంటే జ‌మ్ము- కాశ్మీర్‌, మిడిల్ సెక్టార్ అంటే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, తూర్పు సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌. అయితే రెండు దేశాల మ‌ధ్య ఇప్ప‌టి వ‌ర‌కూ పూర్తిగా స‌రిహ‌ద్దు విభ‌జ‌న జ‌రగ‌లేదు. ఎందుకంటే చాలా ప్రాంతాల గురించి రెండు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాల వ‌ల్లే రెండు దేశాల మ‌ధ్య ఎప్పుడూ స‌రిహ‌ద్దును నిర్ణ‌యించలేక‌పోయారు. అయితే య‌ధాత‌థ స్థితిని కొన‌సాగిం చ‌డానికి లైన్ ఆఫ్ యాక్చువ‌ల్ కంట్రోల్‌(ఎల్ ఏసీ) అనే ట‌ర్మ్ ఉప‌యోగించ‌డం మొద‌లైంది.
ఏడు ద‌శాబ్దాల‌కు పైగా కాలం గ‌డిచిపోయింది. కానీ, జ‌మ్ము -కాశ్మీర్‌, భార‌త్ -పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌కు ప్ర‌ధాన అంశంగా మారింది. ఆప్రాంతం ఇప్పుడు నియంత్ర‌ణ రేఖ‌తో విభ‌జించి ఉంది. అందులో ఒక భాగం భార‌త్ ద‌గ్గ‌ర‌, మ‌రో భాగం పాకిస్థాన్ ద‌గ్గ‌ర ఉన్నాయి. వీటి మ‌ధ్య ఉన్న దానికి భార‌త్‌, పాక్ నియంత్ర‌ణ రేఖ‌గా చెబుతున్నారు. 

రెండు దేశాల సంబంధాల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుంది?

ఘ‌ర్ష‌ణ అనంత‌రం రెండు దేశాల మ‌ధ్య ఇప్ప‌టికీ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే మ‌రికొన్ని నెల‌లు రెండు దేశాల‌కు నిర్ణ‌యాత్మ‌కంగా అవుతాయి. తాజా ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డ్డానికి సైనిక స్థాయి చ‌ర్చ‌ల‌కు బ‌దులు రాజ‌కీయ స్థాయి చర్చ‌లు జ‌ర‌గాల‌ని నిపుణులు భావిస్తున్నారు. ఇంత‌కు ముందు ప‌రిస్థితి తిరిగి ఏర్ప‌డేలా, ఉద్రిక్త‌ల నుంచి రెండు దేశాల‌ను విముక్తి క‌లిగించ‌డాన్ని డిస్ఎంగేష్‌మెంట్ ప్ర‌క్రియ అని కూడా అంటారు. అయినా ఈ అంశాన్ని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు రెండు దేశాలు స్ప‌ష్టం చేశాయి. 

No comments:

Post a Comment