Monday, June 22, 2020

చిచ్చ‌ర‌పిడుగులు: స‌రిహ‌ద్దులో యుద్దానికి సార్‌..!

దేశ సేవ చేయాల‌నే త‌ప‌న‌..యుద్ధం వ‌చ్చిన‌ప్పుడు నేనుసైతం..అనే పౌరుషం...శ‌త్రువును ఎదురించి పోరాడ‌తామ‌నే ధైర్యం..నిజంగా ఈ చిచ్చ‌ర పిడుగుల‌ను చూస్తుంటే రోమాలు నిక్క‌ర‌పొడుస్తున్న‌ట్టుగా ఉన్నాయి. నా దేశం..నా ప్ర‌జ‌లు..అనే భావ‌నకు స్ఫూర్తినిచ్చేందుకు వీరి మాట‌లు చాల‌నిపిస్తోంది.  ఇటీవ‌ల భార‌త్‌-చైనా దేశాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ లో స‌రిహ‌ద్దులో మ‌న సైనికులు దేశం కోసం పోరాడి వీర‌మ‌ర‌ణం పొందారు. ముసుగువేసుకొని స‌రిహ‌ద్దులోకి చొర‌బ‌డిన డ్రాగ‌న్ సైనికుల దురాఘాతాన్ని భార‌త్ దేశ ప్ర‌జ‌లు జీర్ణించుకోలేపోతున్నారు.  

ఉత్త‌ర‌ప్ర‌దేశ్(UttarPradesh): ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రం అలీఘ‌డ్ నుంచి చైనా మీద యుద్దానికి 10 మంది చిచ్చ‌ర పిడుగులు బ‌య‌లుదేరి న‌డుచుకుంటూ నినాదాలు చేసుకుంటూ వెళుతున్నారు. చైనా మ‌న సైనికుల‌ను క్రూరంగా చంపింద‌ని తెలియ‌గానే ఆవేశంతో ఊగిపోయి ఉన్న‌ప‌ళంగా కొంత‌మంది పిల్ల‌లు క‌నీసం చొక్కా కూడా వేసుకోకుండా వెళుతున్నారు. ఇది గ‌మ‌నించిన పోలీసులు వారిని ప్ర‌శ్నించారు. ఎక్క‌డికి వెళుతున్నారు మీరు..? అన్న ప్ర‌శ్న‌కు గుంపులో నాయ‌క‌త్వం వ‌హించే క‌ర‌ణ్ బ‌దులిస్తూ యుద్దానికి సార్ అంటూ బిగ్గ‌ర‌గా మాట్లాడారు. చైనా పై యుద్దం చేయ‌డానికి స‌రిహ‌ద్దుకు వెళుతున్నాం సార్‌..అన‌గానే ఆ పోలీసులు నిర్ఘాంత‌పోయారు. వారి తెగింపుచూసి కొంత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. పిల్ల‌ల పేర్లు అడిగి..వారికి న‌చ్చ‌జెప్పి మ‌రీ ముఖ్యంగా బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న క‌ర‌ణ్‌కు న‌చ్చ‌జెప్పి ఇళ్ల‌కు పంపించారు. ప్ర‌స్తుతం వీరి వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది..! నిజంగా వారికి సెల్యూట్ అంటూ ..!దేశ ప్ర‌జ‌లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇవి చ‌ద‌వండి: ముంబైకి మ‌రో ముప్పు ఉందంట‌..!

సైనికులెలా చ‌నిపోయారు?  కాంగ్రెస్ కేంద్రానికి ప్ర‌శ్న‌..!

న్యూఢిల్లీ(New Delhi): భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ పార్టీ త‌న విమ‌ర్శ‌ల దాడిని కొన‌సాగిస్తోంది. భార‌త భూభాగంలోకి ఎవ‌రూ చొర‌బ‌డ‌లేద‌ని, మ‌న శిబిరాలు ఎవ‌రి క‌బ్జాలోనూ లేవంటూ అఖిల‌ప‌క్ష స‌మ‌వేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాజాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. చైనా సైనికులు చొర‌బ‌డిన‌ట్టు మాజీ సైనికాధికారులు, ర‌క్ష‌ణ రంగ నిపుణ‌ల‌తో పాటు శాటిలైట్ ఫొటోలు కూడా పేర్కొంటుంటే కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఎందుకు ఖండిస్తోంద‌ని ప్ర‌శ్నించారు. అలాగే, మ‌న భూభాగంలోకి ఎవ‌రూ చొర‌బ‌డ‌లేద‌ని ప్ర‌ధాని ఎందుకు అన్నారు?  పీఎంఓ ఈ ప‌దాల‌ను త‌న అధికారిక ప్ర‌క‌ట‌న నుంచి ఎందుకు తొల‌గించింద‌ని సిబ‌ల్ అడిగారు.
 
మ‌న స‌రిహ‌ద్దులోకి ఎవ‌రూ చొర‌బ‌డ‌క‌పోతే 20 మంది సైనికులు ఎలా ప్రాణాలు కోల్పోయారు? మ‌రి 80 మందిసైనికులు ఎలా గాయ‌ప‌డ్డారు? 10 మంది సైనికులు, అధికారులు చైనా చేతుల్లో ఎలా బంధీలుగా మారారు? అని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. గుడ్‌న్యూస్ :క‌రోనా చికిత్స‌కు ఔష‌ధం విడుద‌ల‌
 అఖిల‌ప‌క్ష స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని చేసిన ప్ర‌క‌ట‌న‌కు ఆయ‌న మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌లు ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. గ‌తంలో ర‌క్ష‌ణ మంత్రి విదేశాంగ మంత్రి, ఆర్మీ చీఫ్ చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు ఈ నెల 19న ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌క‌ట‌న విరుద్ధంగా ఉంద‌ని సిబ‌ల్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

చైనాతో రెండు యుద్దాలు:  కేజ్రీవాల్‌

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దులో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌పైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమ‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. "చైనాతో భార‌త్ రెండు ర‌కాలుగా యుద్ధం చేస్తోంది. ఒక‌టి స‌రిహ‌ద్దు వ‌ద్ద అయితే, రెండోది చైనా నుంచి వ్యాప్తి అయిన క‌రోనా మ‌హమ్మారితో..అని వ్యాఖ్యానించారు. ఈ రెండింటిపైనా
మ‌న‌మంతా ఐక్యంగా పోరాడాల‌ని పిల‌పునిచ్చారు. దేన్నీ రాజకీయం చేయ‌కూడ‌ద‌న్నారు. మ‌న వీర సైనికులు వెన‌క్కి త‌గ్గ‌లేదు...అలాగే మ‌నం కూడా విజ‌యం సాధించే దాకా వెనుక‌డుగు వేయొద్దు." అని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు.   

No comments:

Post a Comment