Saturday, June 20, 2020

ప్ర‌పంచానికి కొత్త ప్ర‌మాదం: డబ్ల్యూహెచ్ ఓ

జెనీవా(Jeniva):
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తున్న వేళ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌పంచం కొత్త ప్ర‌మాద ద‌శ‌లోకి జారుకుంది. అని డ‌బ్ల్యూహెచ్ ఓ హెచ్చ‌రించింది. గురువారం-శుక్ర‌వారం మ‌ధ్య 24 గంట‌ల్లో ల‌క్షా 50 వేల కేసులు న‌మోదైన‌ట్టు సంస్థ చీఫ్ టెడ్రెస్ అధ‌నోమ్ తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో రికార్డ‌యిన కేసుల్లో ఇదే అత్య‌ధికం. వీటిలో స‌గానికి పైగా కేసులు రెండు అమెరికా ఖండాలు, ద‌క్షిణాసియా, మ‌ధ్య‌ప్రాచ్య దేశాల్లోనే నిర్థార‌ణ అయిన‌ట్టు అధ‌నోమ్ తెలిపారు. ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకోవాలంటే క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయాల్సిందేన‌ని టెడ్రోస్ అధ‌నోమ్ తేల్చి చెప్పారు. ఇప్ప‌టికే విధించిన లాక్‌డౌన్‌ల‌తో ప్ర‌జ‌లు విసిగిపోయార‌న్నారు. చాలా దేశాలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్ని తెరిచే దిశ‌గా వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయ‌ని తెలిపారు. కానీ, వైర‌స్ వ్యాప్తి మాత్రం అంత‌కంత‌కూ పెరిగిపోతోంద‌న్నారు. మాస్కులు ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌డం, త‌రుచూ చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం వంటి నియ‌మాల్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని సూచించారు. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 87,65,303

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 87,65,303 కాగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా సంభ‌వించిన మ‌ర‌ణాలు 4,62,678. క‌రోనా యాక్టివ్ కేసుల విష‌యానికి వ‌స్తే 36,74,791 కాగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డిన వారు 46,27,834. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి రోజు ల‌క్ష‌కు పైగా ప్ర‌పంచ వ్యాప్తంగా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అమెరికా, ద‌క్షిణాసియా, ప్రాచ్య‌దేశాల్లో పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోదువుతున్నాయి. 

యూఎస్‌లో క‌రోనా కేసులు 22,97,190

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసుల‌లో మొద‌టి స్థానంలో యూఎస్ఏ ఉంది. అమెరికాలో క‌రోనా దారుణ‌మైన ప‌రిస్థితుల‌ను సృష్టించింది. అగ్ర‌రాజ్య‌మైన అమెరికాను క‌రోనా వ‌ణికిస్తోంది. ఇక యూఎస్ేలో న‌మోదైన క‌రోనా కేసులు చూసిన‌ట్ట‌యితే ఇప్ప‌టి వ‌ర‌కు 22,97,190 కేసులు న‌మోదయ్యాయి. క‌రోనా మ‌ర‌ణాలు చూస్తే 1,21,407 గా ఉంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా  ప్ర‌భావిత దేశంగా యూఎస్ ఉంది. ఇక త‌ర్వాత స్థానంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ లో క‌రోనా కేసులు 10,38,568 కాగా, ఇక క‌రోనా మ‌ర‌ణాలు 49,090గా న‌మోద‌య్యాయి. 

మూడో స్థానంలో ర‌ష్యా..నాల్గో స్థానంలో ఇండియా

ఇక ప్ర‌పంచంలో మూడో స్థానంలో ర‌ష్యా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌ష్యాలో న‌మోదైన కేసులు చూస్తే 5,69,063 గా ఉంది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు చూస్తే 7,841 గా న‌మోద‌య్యాయి. ర‌ష్యా త‌ర్వాతి స్థానంలో ఇండియా ఉంది. ప్ర‌స్తుతం ఇండియా క‌రోనా కేసుల్లో నాల్గో స్థానంలో ఉంది. ఇండియాలో చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌ర‌ల్డ్ మీట‌ర్ ప్ర‌కారం 3,95,812 క‌రోనా కేసులు న‌మోదు కాగా 12,970 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. మూడో స్థానంలో ఉన్న ర‌ష్యాతో పోల్చుకుంటే, నాల్గో స్థానంలో ఉన్న ఇండియాలోనే క‌రోనా మ‌ర‌ణాలు ఎక్కువుగా సంభవించాయ‌ని వ‌ర‌ల్డ్ మీట‌ర్ ప్ర‌కారం లెక్క‌లు చెబుతున్నాయి. 

ఐదోవ స్థానంలో యూకే..

ఇక ఇండియా త‌ర్వాతి స్థానంలో యూకే ఉంది. యూకేలో క‌రోనా  కేసులు విష‌యానికి వ‌స్తే 3,01,815 కేసులు న‌మోదు కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు యూకేలో 42,461 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత‌ప‌డ్డారు. ప్ర‌స్తుతానికి అమెరికా, బ్రెజిల్‌, ర‌ష్యా, ఇండియా, యూకేలు టాప్ 5 ప్ర‌భావిత దేశాలుగా ఉన్నాయి. ఇక ప్ర‌తిదేశంలోనూ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తుంది. క‌రోనా విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏమ‌ర‌పాటు మంచిదికాద‌ని అన్ని దేశాల‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 

No comments:

Post a Comment