Thursday, June 11, 2020

ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించ‌కుండా.. అడ్డుకోవ‌డం అమానుషం

  • భ‌ట్టి విక్ర‌మార్క హౌస్ అరెస్టుపై  కాంగ్రెస్ జిల్లా క‌మిటీ ఖండ‌న‌

ఖ‌మ్మం(Khammam): తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలియ‌జేయ‌డానికి చ‌లోసెక్ర‌టేరియ‌ట్‌కు బ‌య‌లుదేరిన కాంగ్రెస్ నాయ‌కుల అక్ర‌మ అరెస్టులను ఖండిస్తూ గురువారం న‌గరంలో వైరారోడ్డులో జిల్లా కాంగ్రెస్ క‌మిటీ సీఎం  దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేసింది.ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షులు పువ్వాళ్ళ దుర్గా ప్ర‌సాద్ మాట్లాడుతూ..కేసీఆర్ పోలీసుల‌తో ప్ర‌తిప‌క్షాల‌ను తొక్కిపెట్టే ప్ర‌య‌త్నం మానుకోవాల‌ని, ప్ర‌తి ప‌క్షాల‌ను చూసి భ‌య‌ప‌డుతూ ఎన్నాళ్లు ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు లేవ‌నెత్త‌డం పాప‌ముగా వ్య‌వ‌హ‌రిస్తున్న సీఎం కేసీఆర్ ఇది ప్ర‌జా స్వామ్య దేశం అని గుర్తుంచుకోవాల‌ని అన్నారు. పేద‌వాడి నెత్తిపై క‌రెంట్ బిల్లుల భారం, ప్రాజెక్టుల‌లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌లు, క‌రోనా విజృంభణ పై గాంధీ హాస్ప‌ట‌ల్ లో నెల‌కొన్న అనేక స‌మ‌స్య‌లు, మ‌రియు రైతుల వ‌ద్ద కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపుపై సంబంధిత మంత్రులు మ‌రియు సీఎం దృష్టికి తీసుకువెళ్లాల‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు , నాయ‌కులు శాంతియుతంగా అతికొద్ది మంది నాయ‌కులు సెక్ర‌టేరియ‌ట్‌కు బ‌య‌లు దేరుతుండా అక్ర‌మంగా కాంగ్రెస్ నాయ‌కుల‌ను అరెస్టు చేశార‌ని పేర్కొన్నారు.

అదే విధంగా జిల్లాలో సీఎల్‌పీ నాయ‌కులు భ‌ట్టి విక్ర‌మార్క ను హౌస్ అరెస్టు చేశార‌ని తెలిపారు. తెలంగాణ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జాగొంతుకను అణిచివేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ న‌గ‌ర్ అధ్య‌క్షులు ఎండి.జావీద్‌, అనుబంధ సంఘ అధ్య‌క్షులు ఎండి.తాజుద్దీన్‌, పుచ్చ‌కాయ‌ల వీర‌భ‌ద్రం, య‌డ్ల‌ప‌ల్లి సంతోష్‌, య‌ర‌బోలు శ్రీ‌నివాస్‌, పాల‌కుర్తి నాగేశ్వ‌ర‌రావు, వై.ఉద‌య్‌కుమార్‌, ప్ర‌దిషా, పేరం మ‌ల్ల‌య్య‌, బొడ్డు బొంద‌య్య‌, ఎస్‌డి.ఫ‌రీద్ ఖాద్రి, శంక‌ర్ నాయ‌క్‌, సంప‌టం న‌ర్సింహ‌రావు, ఎస్‌కె.జ‌హీర్‌, ఎస్‌కె.అబ్బాస్‌, సిహెచ్‌. న‌గేష్‌, మ‌హిముద్, టి.నాగ‌భూష‌ణం, టోక్య నాయ‌క్‌, కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా ఇంచార్జి యాసిన్‌, కాళంగి క‌న‌క‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment