Friday, June 5, 2020

నాగ‌లి ప‌ట్టి అర‌క దున్ని..!

ఏరువాక కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే "సండ్ర‌"

ఖ‌మ్మం(Khammam): ఏరువాక పౌర్ణ‌మి సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏరువాక కార్య‌క్ర‌మాన్ని స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య ప్రారంభించారు. మండ‌లంలోని నారాయ‌ణ‌పురం గ్రామంలో రైతుల మ‌ధ్య స్వ‌యంగా నాగ‌లి ప‌ట్టి అర‌క దున్ని అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అనంత‌రం ఏరువాక పౌర్ణ‌మి సంద‌ర్భంగా రైతుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఏరువాక అంటే దుక్కుదున్నుట కార్య‌క్ర‌మాలు  ప్రారంభ‌మ‌ని, వ్య‌వ‌సాయానికి సిద్ధ‌మ‌వ్వ‌డ‌మే న‌ని పేర్కొన్నారు. ఆరుగాలం క‌ష్ట‌ప‌డిన రైతుకు పంట చేతికి వ‌స్తేనే క‌ష్టాలు తీరేద‌ని  తెలిపారు. 
అందుకే మ‌న దేశంలో వ్య‌వ‌సాయాన్ని ఓ ప‌విత్ర కార్యంలా, త‌పస్సుల్లా చేశార‌న్నారు. రైతాంగం దేశాన్ని స‌స్య‌శ్యామ‌లం చేసి, మాన‌వాళి ఆక‌లి తీర్చే చ‌ల్ల‌ని త‌ల్లి అని , భూమాత లాంటి త‌ల్లి గుండెల‌పై నాగ‌లి గ్రుచ్చి దుక్కిదున్న‌డం రైత‌న్న‌కు బాధ‌క‌ర‌మైన విష‌యం అయినా, బ్ర‌త‌కాలంటే దుక్కి దున్న‌క త‌ప్ప‌దు అని తెలిపారు. అందుకే ఆ త‌ల్లి ఆశీస్సుల‌తో భూమి పూజ చేసి పండ‌గ చేసుకోవ‌డ‌మే ఏరువాక పౌర్ణ‌మి అని పేర్కొన్నారు. 
ఇటువంటి విశిష్ట సంప్ర‌దాయాలు ఉన్న వ్య‌వ‌సాయాన్ని మ‌న రైత‌న్న‌లు దైవంగా భావిస్తార‌న్నారు. రైతాంగాన్ని ఆదుకోవ‌డానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, రైతురుణ‌మాఫీ వంటి ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టార‌న్నారు. అదే విధంగా రైతును రాజు చేయాల‌నే ఆశ‌యంతో రైతు పండించిన పంట ధ‌ర రైతే నిర్ణ‌యించాల‌నే సంక‌ల్పంతో నియంత్ర‌ణ సాగు విధానాన్ని అమ‌లు ప‌రిచార‌న్నారు. రైతులు అంద‌రూ ఈ నియంత్ర‌ణ సాగు విధానాన్ని ఈ పంట నుండే కొన‌సాగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.  

No comments:

Post a Comment