Monday, June 29, 2020

హోమంత్రికి క‌రోనా

  • ఆందోళ‌న‌లో పోలీసు ఉన్న‌తాధికారులు

హైద‌రాబాద్(Hyderabad): తెలంగాణ హోంమంత్రి మ‌హ‌మూద్ అలీకి క‌రోనా వైర‌స్ సోకింది. ఆయ‌న కొన్ని రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఆయ‌న సిబ్బందిలో కొంత‌మందికి ఇటీవ‌లే క‌రోనా నిర్థార‌ణ అయింది. దాంతో ఆయ‌న కూడా మూడు రోజుల కింద‌ట క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఆ ఫ‌లితాల్లో మహ‌మూద్ అలీకి క‌రోనా సోకిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. వెంట‌నే ఆయ‌న జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
మ‌హ‌మూద్ అలీతో పాటు ఆయ‌న మ‌న‌వుడికి కూడా క‌రోనా సోకిన‌ట్టు తేలింది. మ‌హ‌మూద్ అలీ ఈ నెల 25న గోహామ‌హ‌ల్ స్టేడియంలో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇదే కార్య‌క్ర‌మంలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్‌లు కూడా పాల్గొన్నారు. దీంతో వారు కూడా ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల‌కు, కాంగ్రెస్ సీనియ‌న్ నేత వీహెచ్  క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. 

వైర‌ల్ అవుతున్న క‌రోనా డెడ్‌బాడీల ఫేక్‌న్యూస్ 

హైద‌రాబాద్ ప‌రిధిలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ప్ర‌తి రోజూ 800  నుంచి 1000 వ‌ర‌కు కేసులు న‌మోదువుతున్నాయి. దాంతో న‌గ‌ర ప్ర‌జ‌లు గ‌డ‌ప‌దాటాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు అప‌రిచిత వ్య‌క్తులు క‌రోనాపై కావాల‌నే ఫేక్ వార్తలు పుట్టిస్తున్న క్ర‌మంలో తాగాజా బార్క‌స్ లో 10 క‌రోనా మృత‌దేహాల‌ను , డ‌బీర్ పురాలో 25 క‌రోనా మృత‌దేహాల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా కాల్చేశార‌ని కొన్ని వార్త‌లు ఫేస్‌బుక్‌, వాట్సాప్ మొద‌లైన సోష‌ల్‌మీడియా ఖాతాల్లో ఇంగ్లీష్‌, ఉర్ధూభాష‌ల్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిని ప‌రిశీలించిన అధికారులు ఇవ‌న్నీ ఫేక్ వార్త‌ల‌ని తేల్చారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఫేక్ వార్త‌లు పుట్టించి ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని న‌గ‌ర పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఇవి చ‌ద‌వండి:  లాక్‌డౌన్ దిశ‌గా కేసీఆర్‌..ఎక్క‌డంటే?
ఇలాగే బెంగుళూరులో కూడా రెండు రోజుల క్రితం ఓ ఫేక్ వార్త అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెట్టింది. సిటీలోని కొన్ని బేక‌రీలు, రెస్టారెంట్లు కు సంబంధించిన ఉద్యోగుల‌కు క‌రోనా సోకింద‌ని వార్త పుట్టించారు. ఆ బేక‌రీలు, రెస్టారెంట్లు మ‌రియు అవి ఉన్న ప్రాంతాల‌కు దూరంఆ ఉంటేనే మంచిద‌ని ప్ర‌చారం చేశారు.దీంతో బెంగుళూరు హోట‌ల్స్ అసోసియేష‌న్ న‌గ‌ర క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. సిటీలో ఏ హోట్‌లో లేదా బేక‌రీ ఉద్యోగుల‌కు క‌రోనా సోక‌లేద‌ని ప్రెస్ నోట్ రిలీజ్ చేయ‌డంతో ఫేక్ వార్త విష‌యంలో జ‌నం ఊపిరిపీల్చుకున్నారు. 

టిమ్స్‌ను సంద‌ర్శించిన కేంద్ర బృందం

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో రోజు రోజుకూ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో  ఉన్న‌త స్థాయి లో వాస్త‌వ ప‌రిస్థితులు తెలుస‌కునేందుకు ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు  సెంట్ర‌ల్ మానిట‌రింగ్ టీం వ‌చ్చింది. సోమ‌వారం గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించింది. టిమ్స్‌లోని ఐసోలేష‌న్‌, ఐసీయూ రూమ్‌ల‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని కంటైన్మెంట్ జోన్ల‌ను, గాంధీ ఆస్ప‌త్రిని కూడా కేంద్ర బృందం సంద‌ర్శించ‌నుంది. గాంధీ ఆస్ప‌త్రిలో క‌రోనా బాధితుల‌కు అందుతున్న వైద్యం, వారికి స‌మ‌కూర్చిన స‌దుపాయాలు, ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్లు, ఇత‌ర సిబ్బంది ప‌నితీరు త‌దిత‌ర అంశాల‌ను పూర్తిగా ప‌రిశీలించింది. ఆ త‌ర్వాత బీఆర్కే భ‌వ‌న్‌లో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో సెంట్ర‌ల్ మానిట‌రింగ్ టీం భేటీ కానుంది. 

No comments:

Post a Comment