Monday, June 22, 2020

రెండు ద‌శాబ్ధాల పాటు క‌రోనా మ‌నుగ‌డ‌..!

  • చైనా వైద్యురాలు కీల‌క విష‌యాలు వెల్ల‌డి

ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ పుట్టుక కేంద్ర‌మైన చైనాలో మ‌రోసారి వైర‌స్ విజృంభిస్తున్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ వైర‌స్ ప్ర‌భావం వ‌ల్ల వేల‌ల్లో మ‌ర‌ణాలు చ‌విచూడాల్సిన ప‌రిస్థితి దాపురించింది. మాన‌వుని మ‌నుగ‌డ ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో గంద‌ర‌గోళంగా మారింది. ఆర్థికంగా అనేక దేశాలు తీవ్ర‌న‌ష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా విష‌యంలో మ‌రో భ‌యాందోళ‌న క‌లిగించే విష‌యాలు చైనా దేశానికి చెందిన వైద్య నిపుణురాలు వెల్ల‌డించింది. 

బీజింగ్ః చైనా దేశానికి చెందిన వైద్య నిపుణురాలు లీ ల్యాన్‌జువాన్ ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. మైన‌స్ డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో క‌రోనా ద‌శాబ్ధాల కాలం పాటు అంటే సుమారు 20 సంవ‌త్స‌రాల పాటు జీవించి ఉండ‌గ‌ల‌ద‌ని పేర్కొంన్నారు. మైన‌స్ 4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద కొన్ని నెల‌ల‌పాటు ఉనికి చాటుకోగ‌ల మ‌హ‌మ్మారి...మైన‌స్ 20 డిగ్రీల కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద 20 ఏళ్ల‌కు పైగా బ‌తికి ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు చైనా వైద్యురాలు.
చైనా కోవిడ్‌-19 నిపుణుల బృందంలో ఒక‌రైనా లీ ఆ దేశ స్థానిక మీడియాతో మాట్లాడారు. శీత‌ల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకోగ‌ల క‌రోనాకు ఉన్న అసాధార‌ణ సామ‌ర్థ్యాల వ‌ల్ల అది దేశాల మ‌ధ్య సుల‌భంగా వ్యాప్తి చెందుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. క‌రోనా వ్యాపించిన తొలినాటి నుంచి చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను లోతుగా ప‌రిశీలిస్తే అత్యంత శీత‌ల ప్ర‌దేశాల్లో వైర‌స్ ఎక్కువ కాలం మ‌నుగ‌డ సాధించ‌గ‌ల‌ద‌నే విష‌యం సృష్ణ‌మ‌వుతోంది. మాంసాన్ని దీర్ఘ‌కాలం పాటు నిల్వ చేసే సీ ఫుడ్ మార్కెట్లో వైర‌స్ ఆన‌వాళ్ళు బ‌య‌ట‌ప‌డినందున ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.ఇవి చ‌ద‌వండి: ముంబైకి మ‌రో ముప్పు ఉందంట‌..!

మాంసానికి దూరంగా ఉండండి:లీ ల్యాన్‌జువాన్‌

ఇక నిల్వ చేసిన ఆహార పదార్థాలు, మాంసం మార్కెట్ల నుంచి క‌రోనా వ్యాపిస్తుంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కొన్నాళ్ల‌పాటు ప‌చ్చిమాంసం, చేప‌లు తిన‌కుండా ఉంటే మంచిద‌ని చైనా నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి సీ-ఫుడ్ కార‌ణంగా కోవిడ్ సోకింద‌న‌డానికి ఎటువంటి ఆధారాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో చైనా సీడీసీ ప‌రిశోద‌క‌లు ఫెంగ్ జావోలూ మాట్లాడుతూ.."కాచి చ‌ల్లార్చిన నీళ్లు తాగాలి. వేడివేడి ఆహార ప‌దార్థాలు తినాలి. అదే విధంగా పండ్ల తొక్క‌లు తీయ‌కుండానే తినేయాలి. త‌రుచుగా ఉప‌యోగించే టేబుల్ వేర్‌ను డిస్ ఇన్‌ఫెక్ట్ చేయాలిమాంసం వండుకున్న‌ప్పుడు దానికి క‌ట్ చేసుకునే క్ర‌మంలో ఉప‌యోగించిన చాపింగ్ బోర్డును ముట్టుకోవ‌డానికి ముందు, ఆ త‌ర్వాత చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలి." అని సూచించారు. 

యూర‌ప్ నుంచి వ‌చ్చిన వైర‌స్‌తోనే కొత్త కేసులు:చైనా

క‌రోనా తాజా విజృంభ‌ణ నేప‌థ్యంలో డ్రాగ‌న్ ప్ర‌భుత్వం  ఆదివారం క‌రోనా జెనోమ్‌డేటా(జ‌న్యుస‌మాచారం)ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం చైనాలో విస్త‌రిస్తోన్న వైర‌స్ యూర‌ప్ నుంచి వ్యాప్తి చెందుతోంద‌ని వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా..ఆదివారం చైనాలో  కొత్త‌గా 18పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య‌శాఖ సోమ‌వారం వెల్ల‌డించింది. ఇక రాజ‌ధాని బీజింగ్‌లో కొత్త‌గా తొమ్మిది మందికి క‌రోనా సోకిన‌ట్టు తెలిపింది. దీంతో ఇత‌ర ప్రాంతాల‌కు క‌రోనా విస్త‌రించ‌కుండా స్థానిక అధికారులు క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్న‌ట్టు పేర్కొంది. ఇక బీజింగ్‌లో అతిపెద్ద హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్ షిన్‌ఫాడిలో మ‌రోసారి క‌రోనా ఆన‌వాళ్లు బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన మేనేజ‌ర్లు, ప్ర‌భుత్వ క్యాంటీన్ల‌లో ప‌నిచేసే వారంద‌రికీ కోవిడ్‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా ఫుడ్‌మారె్ట్లో ప‌నిచేసే వాళ్లంతా త‌ప్ప‌నిస‌రిగా ఫేస్ మాస్కులు, గ్లౌవ్స్ ధ‌రించాల‌ని పేర్కొంది. గుడ్‌న్యూస్ :క‌రోనా చికిత్స‌కు ఔష‌ధం విడుద‌ల‌

క‌రోనా వ్యాక్సిన్ రేసులో నైజీరియా

వెబ్‌నెట్: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నుగొనే ప‌నిలో చాలా మంది శాస్త్ర‌వేత్త‌లు నిమ‌గ్న‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్రికా ఖండానికి చెందిన నైజీరియా సైంటిస్టులు వ్యాక్సిన్ క‌నుగొన్నార‌నే వార్త ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఇది వాస్త‌వమో.. కాదో తెలియ‌న‌ప్ప‌టికీ సార్స్‌కొవ్‌-2 వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ను నివారించ‌డంలో ఈ వ్యాక్సిన్ బాగా ప‌నిచేస్తుంద‌ని ది గార్డియ‌న్ నైజీరియా నివేదిక ప్ర‌కారం తెలిసింది. రిపోర్ట్ ప్ర‌కారం..అడెలెకె యూనివ‌ర్శిటీలో ఇమ్యునాల‌జీ అండ్ బ‌యో ఇన్ఫార్మాటిక్స్‌లో మెడిక‌ల్ వైరాల‌జీ స్పెష‌లిస్టు గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ ఒలాడిపో కోలావాలే నాయ‌క‌త్వంలో వ్యాక్సిన్‌పై రీసెర్చ్ జ‌రుగుతోంది.
ఆఫ్రిక‌న్స్ కోసం ఆఫ్రికాలో స్థానికంగా క‌రోనా వ్యాక్సిన్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నామ‌ని కోలావొలే ఓ మీడియా స‌మావేశంలో చెప్పారు. వ్యాక్సిన్ కోసం త‌మ సైంటిస్టుల టీమ్ చాలా క‌ష్ట‌ప‌డుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇంకా పేరు పెట్ట‌ని ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డానికి సుమారు 18 నెల‌ల స‌మ‌యం ప‌ట్టొచ్చ‌న్నారు. దీని గురించి ప‌లు అధ్య‌య‌నాలు, విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. అలాగే మెడిక‌ల్ అథారిటీస్ నుంచి అప్రూవ‌ల్స్ కోసం ఎదురుచూస్తున్నామ‌ని స్ఫ‌ష్టం చేశారు. కాగా క‌రోనా ట్రీట్‌మెంట్ కోసం వాడే ఓ డ్ర‌గ్ రెండ్రోజుల  క్రితం మ‌న దేశంలో అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఫ‌విపిర‌విర్ ఫ్యాబిఫ్లూ అనే ఈ ఔష‌ధాన్ని ముంబైకి చెందిన ప్ర‌ముఖ ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ శ‌నివారం ఆవిష్క‌రించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.1.భార‌త్ -చైనా స‌రిహ‌ద్దు: ఆ రోజు ఏం జ‌రిగిందంటే..?

ఒక్క రోజులోనే 1.80 వేల కేసులు..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రోజురోజుకీ మ‌రింత ఉధృతంగా వ్యాపిస్తోంది. శ‌నివారం, ఆదివారం మధ్య 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా ల‌క్షా 83 వేల కేసులు న‌మోదైన‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్ ఓ) తెలిపింది. ఒక్క రోజు వ్య‌వ‌ధిలో ఇన్ని కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. అత్య‌ధికంగా బ్రెజిల్‌లో 54,771 కేసులు వెలుగులోకి రాగా, అమెరికాలో 36,617,భార‌త్‌లో 15,413కేసులు న‌మోద‌య్యాయి. నిర్థార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌డం, లాక్‌డౌన్ ఎత్తివేస్తుండ‌టంతో వైర‌స్ వ్యాప్తి వేగంగా జ‌రుగుతుండ‌టం వంటి కార‌ణాల వ‌ల్లే ఎక్కువ కేసులు న‌మోదువుతున్నాయ‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 
ప్రపంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 87,08,008 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 4,61,715 మంది మృతి చెందారు. వీరిలో కొత్త‌గా 4,743 మంది ఆదివారంతో ముగిసిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే మ‌ర‌ణించిన‌ట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన మ‌ర‌ణాల్లో మూడో వంతు అమెరికా ఖండాల్లోని దేశాల నుంచే న‌మోదైన‌ట్టు వివ‌రించింది. 

స్పెయిన్‌లో లాక్‌డౌన్ తొల‌గింపు..

స్పెయిన్‌లో మార్చి 14న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పూర్తిగా తొల‌గించింది. దేశంలో ప్ర‌జ‌లు ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా ప్ర‌యాణంచేందుకు అనుమ‌తించింది. అలాగే బ్రిట‌న్ స‌హా 26 ఇత‌ర ఐరోపా దేశాల‌కు చెందిన ప‌ర్యాట‌కుల‌కు 14 రోజుల క్వారంటైన్ నిబంధ‌న‌ను తొల‌గించింది. ఈ సంద‌ర్భంగా ఆ దేశ ప్ర‌ధాని పెడ్రో శాంఛెజ్ మాట్లాడుతూ..ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వంజారీ చేసిన అన్ని నియ‌మ నిబంధ‌న‌ల్ని పాటించాల‌ని కోరారు. వైర‌స్ రెండో విడ‌త విజృంభించే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఇంగ్లాండ్‌లో ఇంకా అక్క‌డ‌క్క‌డా ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌జ‌లు వారాంత‌పు వినోదాల‌కు దూరంగా ఉంటున్నారు. జ‌ర్మ‌నీలో ఓ మాంస‌పు ప్యాకింగ్ ప్లాంట్‌లో 1000 మందికి క‌రోనా నిర్థార‌ణ అయ్యింది. దీంతో ఆ ప్రాంతంలో ఉండే 6,500 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. 

బ్రెజిల్‌లో 50 వేలు దాటిన మ‌ర‌ణాలు..

అమెరికా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాతోపాటు లాటిన్ అమెరికా దేశాల్లో కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్న‌ట్టు జాన్ హాప్‌కిన్స్ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. బ్రెజిల్‌లో మొట్ట‌మొద‌టిసారి ఒక్క రోజు వ్య‌వ‌ధిలో 50 వేల‌కు పైగా కేసులు న‌మోదైన‌ట్టు ఆ దేశ వైద్యారోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇక అక్క‌డ మృతుల సంఖ్య 50,000 వేలు దాటింది. అమెరికా త‌ర్వాత మృతుల సంఖ్య ఎక్కువుగా ఉన్న‌ది ఇక్క‌డే. అయినా వైర‌స్ కట్ట‌డి చ‌ర్య‌ల్ని అమ‌లు చేయ‌డంలో అధ్య‌క్షుడు జైల్ బోల్సోనారో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. 

No comments:

Post a Comment