Saturday, June 13, 2020

వ‌ధువు క్వారంటైన్‌కు..వ‌రుడు ఐసోలేష‌న్‌కు ..పెళ్లైన రెండో రోజుకే..!

క‌ర్నూలు(Kurnool):
వారికి పెళ్లి అయి రెండ్రోజులే అయ్యింది. క‌నీసం మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నారో లేదో..క‌రోనా భూతం వ‌ల్ల న‌వ వ‌ధువు క్వారంటైన్‌కు.. వ‌రుడు ఐసోలేష‌న్‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. మొత్తంగా ఆ వివాహానికి హాజ‌రైన బంధువులంద‌ర్నీ క్వారంటైన్ చేశారు అధికారులు.  ఈ సంఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ మండ‌లం మ‌ర్రిమానుతండాకు చెందిన యువ‌కుడు హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్నారు. క‌రోనా ప‌రీక్ష‌లకు న‌మూనాలు ఇచ్చి..ఫ‌లితాలు రాక‌ముందే ఈ నెల 10న వెల్దుర్తి మండ‌లం ఎల్‌.తండాకు చెందిన యువ‌తిని స్వ‌గ్రామంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు రాత్రి ఎల్‌.తండాలో జ‌రిగిన రిసెప్ష‌న్‌లో పెళ్లి కుమారుడు అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ఇదే స‌మ‌యంలోనే అత‌నికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అప్ప‌టికే వ‌ధూవ‌రులు ప‌త్తికొండ‌కు వెళ్లారు. వేడుక‌ల్లో బంధుమిత్రులు సహ‌పంక్తి భోజ‌నాలు చేసిన‌ట్టు గుర్తించిన అధికారులు గ్రామాన్ని కంటెయిన్‌మెంట్ జోన్‌గా గుర్తించారు. సుమారు 70 కుటుంబాల నుంచి న‌మూనాలు సేక‌రించారు.

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌కు రెండోసారి క‌రోనా నెగిటివ్‌

హైద‌రాబాద్(Hyderabad): హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌కు రెండోసారి నిర్వ‌హించిన కోవిడ్ ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ నిర్థారణ అయ్యింది. గురువారం మేయ‌ర్ డ్రైవ‌ర్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా మేయ‌ర్‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగానే ఆయ‌న నుంచి వైద్యులు న‌మూనాలు తీసుకున్నారు. ఆ నివేదిక‌ల్లో నెగిటివ్ వ‌చ్చిన‌ట్టు అధికారులు తెలిపారు. దీంతో మేయ‌ర్ కుటుంబ స‌భ్యులు, అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గ‌తంలో న‌గ‌రంలోని రోడ్డు ప‌క్క‌నే ఉన్న ఓ హోట‌ల్‌లో  అధికారుల‌తో క‌లిసి మేయ‌ర్ టీ తాగారు. ఆ హోట‌ల్‌లో ప‌నిచేసిన వ్య‌క్తికి క‌రోనా వ‌చ్చింద‌ని తేల‌డంతో వారం క్రితం మేయ‌ర్ సైతం ప‌రీక్ష చేయించుకోగా ఆ నివేదిక‌ల్లో నెగిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

No comments:

Post a Comment