Friday, June 19, 2020

చ‌నిపోలేదు..చంపేశారు..!..హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌..!

హైద‌రాబాద్(Hyderabad):
అది రాజ‌ధాని మ‌హా న‌గ‌రం..పెద్ద‌పెద్ద ఆస్ప‌త్రుల‌కు నిల‌యం. కానీ ఏ ప్ర‌యోజ‌నం..ఓ త‌ల్లి ప్రాణాల‌ను కాపాడ‌టానికి ముందుకు రాలేక‌పోయారు. ఓ కార్పొరేట‌ర్ ఆస్ప‌త్రికెళ్తే మ‌రో ఆస్ప‌త్రికి పంపించారు. అక్క‌డ ట్రీట్‌మెంట్ చేయ‌లేదు. అలా 10 ఆస్ప‌త్రులు తిరిగినా ఆ మ‌హిళ ప్రాణం ద‌క్క‌లేదు. ప్ర‌యివేటు, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌న్నీ తిరిగీతిరిగీ ఆమె చివ‌ర‌కు శ‌వంగా మారింది. ఈ హృద‌య విధాక‌ర‌క వార్త  తెలుగు దిన‌ప‌త్రిక "న‌వ‌తెలంగాణ" ప్ర‌చురించింది. 
హైద‌రాబాద్‌లో వైద్యం అంద‌క ఓ మ‌హిళ చ‌నిపోయిన ఈ హృద‌య విధార‌క ఘ‌ట‌న బుధ‌వారం రాత్రి చోటుచేసుకుంది. పి.శ్రీ‌కాంత్‌ది అత్తాపూర్‌. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ లేదు. బాబు ఇంట‌ర్‌, పాప తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో చిన్న జ్వ‌రం పెనువిషాధాన్ని నింపింది. శ్రీ‌కాంత్ భార్య పి.రోహిత‌(41)కు బుధ‌వారం స్వ‌ల్పంగా జ్వ‌‌రం వ‌చ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్ప‌త్రిలో చూపించారు. అదే రోజు రాత్రి 11-12 గంట‌ల మ‌ధ్య స‌మయంలో ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప‌డింది. దీంతో ఏమీ ఆలోచించ‌కుండా ఆమెను శ్రీ‌కాంత్ స‌న్‌షైన్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. 
అక్క‌డ క‌రోనా రోగుల కోసం బెడ్లు లేవ‌ని చేర్చుకోవ‌డానికి డాక్ట‌ర్లు నిరాక‌రించారు. క‌రోనా అని మీరెలా నిర్థారిస్తారు? అని శ్రీ‌కాంత్ నిల‌దీయ‌డంతో కొద్దిసేపు ఆక్సిజ‌న్ పెట్టారు. ఆ త‌ర్వాత మా వ‌ల్ల కాదంటూ పంపించేశారు. 
ఆ అర్థ‌రాత్రి పూట భార్య‌ను అపోలో ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కోరంటి ఫీవ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డా ఆమెను చేర్చుకోవ‌డానికి ఆస్ప‌త్రివారు నిరాక‌రించారు. 
బంజారాహిల్స్‌లోని విరించి ఆస్ప‌త్రికి..అక్క‌డ నుంచి బంజారా హిల్స్‌లోని కేర్ ఆస్ప‌త్రికి, కింగ్ కోఠి ప్ర‌భుత్వాస్ప‌త్రికి, ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రికి, కూక‌ట్‌ప‌ల్లిలోని హౌలిస్టిక్ ఆస్ప‌త్రికి, ఇలా రాత్రి నుంచి పొద్దుపోయి తెల్లారిందాకా భార్య‌ను బ‌తికించుకోవాల‌నే ఆరా టంతో ఆస్ప‌త్రుల‌న్నీ తిప్పారు. 
ఎక్క‌డా వైద్యం అంద‌లేదు. చివ‌ర‌కు గాంధీకి తీసుకెళ్లారు. గురువారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న భార్య చ‌నిపోయారు.

"కేసీఆర్ చెబుతున్న‌వ‌న్నీ అబద్దాలే. మంత్రులు చెబుతున్న‌వ‌నీ పచ్చి అబద్దాలే. ఒక్క ఆస్ప‌త్రిలోనూ రోగుల‌ను చేర్చుకోవ‌డం లేదు. ఒక్క బంజారాహిల్స్ కేర్ ఆస్ప‌త్రిలో మాత్రం తీసుకుంటామ‌ని చెప్పారు. అక్క‌డా రోజుకు రెండు ల‌క్ష‌లు క‌ట్టాల‌ని చెప్పారు. అంత క‌ట్ట‌లేం అంటే వెళ్లిపోమ‌న్నారు. ఒక్క ఆస్ప‌త్రి అడ్మిష‌న్ తీసుకున్నా నా  పిల్ల‌ల‌కు త‌ల్లి మిగిలేది.. "అని శ్రీ‌కాంత్ ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని న‌వ తెలంగాణ ప‌త్రిక పేర్కొంది. 

No comments:

Post a Comment