Sunday, June 7, 2020

శుభ్రం చేస్తుండ‌గా పేలిన తుపాకీ..!దూసుకెళ్లిన తూటా..!

నిర్మ‌ల్(Nirmal) :
తెలంగాణ రాష్ట్రంలో నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో మిస్ పైర్ ఆదివారం చోటుచేసుకుంది. తుపాకీని శుభ్రం చేస్తుండ‌గా మిస్‌ఫైర్ కావ‌డంతో కానిస్టేబుల్ శంక‌ర్ గౌడ్‌కు స్వ‌ల్ప ‌గాయాల‌య్యాయి. తూటా దూసుకెళ్ల‌డంతో కానిస్టేబుల్ ఛాతికి స్వ‌ల్ప‌గాయ‌మైంద‌ని అధికారులు తెలిపారు. వెంట‌నే అత‌న్ని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కానిస్టేబుల్ శంక‌ర్‌గౌడ్ గ‌త కొంత‌కాలంగా క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో విధులు నిర్వ‌హిస్తున్నారు. 

శ్రీ‌న‌గ‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్ ...!మిలిటెంట్లు హ‌తం..!

శ్రీ‌న‌గ‌ర్(Srinagar): ఆదివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 5 గురు గుర్తుతెలియ‌ని మిలిటెంట్ల‌ను భ‌ద్ర‌తాద‌ళాలు మ‌ట్టుపెట్టాయి. వివ‌రాల్లోకి వెళితే జ‌మ్మూ-కాశ్మీర్ లోని షోపియ‌న్ జిల్లా, రిబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్న‌ట్టు భ‌ద్ర‌తా ద‌ళాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో వారు అక్క‌డ‌కు చేరుకొని త‌నిఖీలు నిర్వ‌హించారు. వీరి రాక‌ను గ‌మ‌నించిన మిలిటెంట్లు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. వారిని నిలువ‌రించేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్పులు ఆరంభించిన కాసేప‌టికే మిలిటెంట్లు 5 గురు హ‌త‌మ‌య్యారు. వీరు ఏ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన వారో తేలాల్సి ఉంద‌ని, మరిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పోలీస్ అధికారి పేర్కొన్నారు. 

No comments:

Post a Comment