Saturday, June 20, 2020

సుశాంత్ మ‌ర‌ణం@బ్రేక‌ప్ ల‌వ్ కార‌ణ‌మే?

ముంబాయి(Mumbai):
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్యకేసు ద‌ర్యాప్తును పోలీసులు ముమ్మ‌రం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు స్నేహితులు, స‌న్నిహ‌తులను విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో సుశాంత్ సైక్రియార్టిస్ట్ కేస‌రి చ‌వ్డాను విచారించారు. ఈ నేప‌థ్యంలో వైద్యుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. న‌టి అంకిత‌తో బ్రేక‌ప్ ను సుశాంత్ త‌ట్టుకోలేక‌పోయాడ‌ని, ఆ విష‌యంలో చాలా రోజులు బాధ‌ప‌డ్డార‌ని తెలిపారు. 
"అంకిత‌తో ప్రేమ విఫ‌ల‌మైన త‌ర్వాత సుశాంత్ కుంగిపోయాడు. ఆమె త‌న‌ను ప్రేమించిన విధంగా ఇంకెవ్వ‌రూ ప్రేమించ‌రని, ప్రేమించ‌లేర‌ని ప‌శ్చాత్తాపం చెందారు. రాత్రిళ్లు నిద్ర‌పోయేవాడు కాదు. మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యారు. ఆపై న‌టి కృతిహాస‌న్ స్నేహం బ‌ల‌ప‌డింది. కానీ ఆ బంధం ముందుకు సాగ‌లేదు. ద‌ర్శ‌కుడి కుమార్తెను ఇష్ట‌ప‌డ్డారు. అది స‌క్సెస్ కాలేదు. సుశాంత్ త‌న ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల సంతోషంగా ఉండేవారు కాదు." అని చెప్పారు.  పాక్ డ్రోన్ కూల్చివేత‌

సూసైడ్‌కు ఆ గ్యాంగే కార‌ణం: కంగ‌న్ ఫైర్‌

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్ మ‌రోసారి బాలీవుడ్‌పై విరుచుకుప‌డ్డారు. య‌ష్‌రాష్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా బెదిరింపుల‌ను, బాలీవుడ్ గ్యాంగుల మోసాల‌ను, దాడుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌లు గ్యాంగుల ఎటాక్ చేయ‌డం వ‌ల్లే సుశాంత్ సింగ్ మాన‌సికంగా దెబ్బ తిని ఉంటారు. అందుకే అలాంటి నిర్ణ‌యం తీసుకొని విషాదంగా జీవితాన్ని ముగించాడు అనే అనుమానాల‌ను కంగ‌న వ్య‌క్తం చేశారు. కంగ‌న త‌న‌కు ఎదురైన విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ...
నిన్న సుశాంత్‌, గ‌తంలో చాలా మంది ఇలాంటి దురాగ‌తాల‌కు బ‌ల‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిందేదో జ‌రిగింది. ఇక నుంచి ఎలాంటి వారినైనా, ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదురించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎంత వ‌ర‌కు వెళ్లేందుకైనా రెడీగా ఉన్నాను. ఏం జ‌రుగుతుందో... ఏం చేస్తారో ఇక ముందు నేను చూసుకొంటాను అని కంగ‌న ర‌నౌత్ మాట‌ల దాడిని పెంచారు.
ఇప్ప‌టికీ నాపై ఆరు కేసులు పెట్టార‌న్నారు. నన్ను ఇంకా జైలులో పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. నేను మొండిగా వారిని ఎదుర్కొంటున్నాన‌న్నారు. ఎవ‌ర్నీ లెక్క చేయ‌కుండా నా ఫీలింగ్స్ ముఖం మీదే చెప్పేస్తాను. కానీ సుశాంత్ ఎమోష‌న‌ల్‌, సున్నిత మ‌న‌స్కుడు. పాపం అందుకే ఇలాంటి దాడుల‌ను భ‌రించ‌లేక‌పోయాడు. ఆదిత్య చోప్రా మాదిరిగానే ఎవ‌రో నీ కెరీర్ నాశనం చేస్తార‌ని బెదిరించి ఉంటారు. అందుకే ఇలాంటి తీవ్ర‌మైన నిర్ణ‌యం తీసుకొని ఉంటార‌ని కంగ‌న్ చెప్పారు. 

No comments:

Post a Comment