Saturday, June 20, 2020

నందిగామ‌లో యూట్యూబ్ విలేక‌రి హ‌త్య‌..!

నందిగామ(Nandigama):
కృష్ణాజిల్లా నందిగామ మండ‌లం మున‌గ‌చ‌ర్ల గ్రామానికి చెందిన గంటా న‌వీన్ అనే యూట్యూబ్ విలేక‌రి ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేసిన సంఘ‌ట‌న శ‌నివారం వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళితే..క్రైమ్ ఇండియా రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న గంటా న‌వీన్ గ‌త నాలుగు రోజులుగా క‌నిపించ‌కుండా పోవ‌డంతో నందిగామ పోలీస్ స్టేష‌న్‌లో అత‌ని త‌ల్లి ఫిర్యాదు చేశారు.  తాజాగా శ‌నివారం నందిగామ కాక‌తీయ స్కూల్ రోడ్డులో పాతి పెట్టి ఉన్న గుర్తు తెలియ‌ని మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృత‌దేహాన్ని ప‌రిశీలించి గంటా న‌వీన్‌గా గుర్తించారు. గ‌తంలో న‌వీన్‌పై నందిగామ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వాట్సాప్ గ్రూపుల్లో వివాద‌స్ప‌ద పోస్టులు పెట్టిన నేప‌థ్య‌లో అప్ప‌టి నుంచి న‌వీన్ క‌నిపించ‌కుండా పోయాడు.  సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న నందిగామ స‌బ్ డివిజ‌న్ ప‌రిధి డిఎస్పీ జివి ర‌మ‌ణ‌మూర్తి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు ఘ‌ట‌నా స్థ‌లానికి భారీ ఎత్తున గుమ్మిగూడారు. నందిగామ‌లో హ‌త్య జ‌ర‌గ‌డంతో సంచ‌ల‌నంగా మారింది. 

No comments:

Post a Comment