Thursday, June 4, 2020

మ‌ళ్లీ వ‌డ్డీ వ‌సూలు ఎందుకు..? ఆర్‌బిఐని ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు:హెచ్‌డీఎఫ్‌సీ క‌స్ట‌మ‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌..!

న్యూఢిల్లీ(New Delhi):
అస‌లే క‌రోనాతో ఉపాధి లేక పూట‌గ‌డ‌వ‌డం క‌ష్టంగా మారిన ఈ ప‌రిస్థితుల్లో సామాన్యుడికి గుదిబండ‌లా మారిన  ఈఎంఐలు విష‌య‌మై ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణ‌యాన్ని సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్టింది. క‌రోనా కార‌ణంతో ఈఎంఐలు క‌ట్టేవారికి ఆర్‌బిఐ మార్చి 1 నుంచి ఆగ‌ష్టు 31 వ‌ర‌కు మార‌టోరియానికి అవ‌కాశం ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆరు నెల‌లు వ‌డ్డీ విధిస్తుండ‌టంతో స‌ర్వోన్నత్త న్యాయ‌స్థానం ఆర్‌బిఐపై తీవ్రంగా మండిప‌డింది. ఓ వైపు మార‌టోరియానికి అవ‌కాశం ఇస్తూనే మ‌రోవైపు వ‌డ్డీ వ‌సూలు చేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది. ప్ర‌జ‌ల ఆరోగ్యం కంటే, ఆర్థిక కార్య‌క‌లాపాలు ముఖ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది. మార‌టోరియం కాలంలో వ‌డ్డీ మాఫీ చేయాల‌ని ధాఖ‌లైన కేసుల‌లో సుప్రీం కోర్టులో ఆర్‌బిఐ అఫిడవిట్ దాఖ‌లు చేసింది. ఈ ఆరు నెల‌ల కాలంలో మార‌టోరియానికి వ‌డ్డీ  వ‌సూలు చేయ‌క‌పోతే, బ్యాంకులు రూ.2 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోతాయ‌ని ఆర్‌బిఐ సుప్రీం కోర్టు ముందు తెలిపింది. దీంతో సుప్రీం కోర్టు తీవ్రంగా మండిప‌డింది. మీడియాకు లీకులు ఇస్తూ ఈ విష‌యాన్ని ఆర్‌బిఐ మ‌రింత సంచ‌ల‌నం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల (జూన్‌)12కు వాయిదా వేసింది.

హెచ్‌డీఎఫ్‌సీ క‌స్ట‌మ‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త‌..!

ప్రైవేటు రంగ దిగ్గ‌జ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తాజాగా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అదిరిపోయే శుభ‌వార్త అందించింది. రిజ‌ర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) ఆదేశాల ప్ర‌కారం క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ ఎంఐ మార‌టోరియం ఫెసిలిటీ అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. మ‌రో 3 నెల‌లు లోన్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. జూన్‌, జూలై, ఆగ‌ష్టు నెల‌ల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంది. 
అయితే ఈఎంఐ మార‌టోరియం ఆఫ్ష‌న్ ఎంచుకునే వారు మాత్రం ఒక విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని తెలిపింది. ఈ ఎంఐ ఇప్పుడు క‌ట్ట‌క‌పోయినా ప‌ర్లేద‌ని, కానీ మార‌టోరియం గ‌డువు ముగిసిన త‌ర్వాత చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. లేదంటే లోన్ గ‌డువు పెరుగుంద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే మార‌టోరియం గ‌డువులో మీ లోన్ ఔట్ స్టాండింగ్ అమౌంట్‌పై వ‌డ్డీ ప‌డుతూనే వ‌స్తుంద‌ని తెలిపింది.
వ్య‌వ‌సాయ రుణాలు, మైక్రోఫైనాన్స్ క‌స్ట‌మ‌ర్లు, కార్పొరేట్ క‌స్ట‌మ‌ర్లు, ఎస్ ఎంఈ క‌స్ట‌మ‌ర్లు అంద‌రూ ఈఎంఐ మార‌టోరియం బెనిఫిట్‌కు అర్హులే. రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్ల‌తో మాట్లాడి క‌స్ట‌మ‌ర్లు ఈ సౌక‌ర్యం పొంద‌చ్చ‌ని సూచించింది. మార్చి, ఏప్రిల్‌, మే నెల‌ల‌కు మార‌టోరియం పొందిన క‌స్ట‌మ‌ర్లు మ‌ళ్లీ త‌ర్వాతి మూడు నెల‌ల‌కు ఈఎంఐ మార‌టోరియం పొందాలంటే కొత్త అప్లికేష‌న్ పెట్టుకోవాల‌ని పేర్కొంది. 
ఇక జూన్ నెల‌కు మార‌టోరియం కోసం అప్లై చేసుకున్న వారి అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్ అయితే.. అవి 5 రోజుల్లో మ‌ళ్లీ రీఫండ్ వ‌స్తాయ‌ని హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. మార‌టోరియం గ‌డువు వ‌డ్డీని బ్యాంకు వ‌సూలు చేయ‌నుంది. క‌స్ట‌మ‌ర్ చెల్లించ‌ని కాలం పాటు లోన్ టెన్యూర్ పెరుగుతుంద‌ని, బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ మార‌టోరియం ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చ‌ని సూచించింది. 

No comments:

Post a Comment