Wednesday, June 24, 2020

ట్రై చేయండి...ప‌రీక్ష లేకుండా ఎస్‌బీఐలో ఉద్యోగం..!

ముంబాయి(Mumbai):
నిరుద్యోగుల‌కు ఎస్‌బీఐ ఓ శుభ‌వార్త తెలిపింది. భార‌తీయ స్టేట్ట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) సెష్ప‌లిస్టు ఆఫీస‌ర్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్తులు జూలై 12లోగా ద‌ర‌ఖాస్తు చేయాల‌ని ప్ర‌క‌టించింది. త‌మ వెబ్‌సైట్ లో లాగిన్ అయి ద‌ర‌ఖాస్తులు చేయొచ్చ‌ని సూచించింది.  ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు రెజ్యూమ్‌, గుర్తింపు, వ‌య‌సు ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, విద్యార్హ‌త‌, అనుభ‌వానికి సంబంధించిన ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్ధులు ఎలాంటి ప‌రీక్ష రాయ‌న‌వస‌రం లేదు. ఎస్‌బీఐ క‌మిటీ అభ్య‌ర్థ‌లను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కుల‌కు ముఖాముఖి నిర్వ‌హిస్తోంది. అందులో అర్హ‌త మార్కుల‌ను బ్యాంకు నిర్ణ‌యిస్తుంది. ఏ ఇద్ద‌రికైనా క‌టాఫ్ మార్కులు స‌మానంగా వ‌స్తే వ‌య‌సు ఆధారంగా ఎంపిక ఉంటుంది. 

అప్లై చేసుకునేందుకు ఈ ఫొటోపై క్లిక్ చేయండి..!డైరెక్టుగా ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకి వెళ‌తారు.

No comments:

Post a Comment