Saturday, June 20, 2020

పాక్ డ్రోన్‌ను కూల్చివేత‌

శ్రీ‌న‌గ‌ర్(Srinagar):
పాకిస్థాన్ కుయుక్తుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌రోసారి తిప్పికొట్టాయి. దొంగ‌దెబ్బ తీయాల‌ని పాక్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. శ‌నివారం తెల్ల‌వారు జామున 5.10 గంట‌ల స‌మ‌యంలో జ‌మ్ముకాశ్మీర్‌లోని క‌థువా జిల్లా ప‌న్సార్ చెక్‌పోస్టు వ‌ద్ద పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ఎగ‌ర‌డం గ‌మ‌నించిన బీఎస్ఎఫ్ సిబ్బంది వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై కూల్చివేశారు. కూల్చివేసే స‌మ‌యానికి డ్రోన్ భార‌త ప్రాదేశిక భూ భాగంలోకి 250 మీట‌ర్ల మేర చొచ్చుకు వ‌చ్చిన‌ట్టు అధికారులు తెలిపారు.
9 రౌండ్లు కాల్పులు జ‌రిపిన అనంత‌రం డ్రోన్‌ను కూల్చివేసిన‌ట్టు చెప్పారు. అనంత‌రం డ్రోన్‌కు అమ‌ ర్చిన అధునాత‌న రైఫిల్‌, రెండు మ్యాగ‌జిన్లు,  60 రౌండ్ల తూటాలు, 7 గ్ర‌నేడ్లు స్వాధీనం చేసుకున్నారు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లాన్ని సంద‌ర్శించిన బీఎస్ఎఫ్ ఉన్న‌తాధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌తో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌రింత అప్ర‌మ‌త్త‌య్యాయి. 

No comments:

Post a Comment