Tuesday, June 9, 2020

మొక్క‌ను నాటిన ఎమ్మెల్యే సీత‌క్క‌

బూర్గంపాహాడ్(Burgampahad)
: పుణ్య‌క్షేత్ర‌మైన భ‌ద్రాచ‌లం రామాల‌యం ద‌ర్శ‌నం అనంత‌రం మంగ‌ళ‌వారం న‌ర్సంపేట వెళ్లే మార్గ‌మ‌ధ్య‌లో బూర్గంప‌హాడ్ మండ‌ల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే సీత‌క్క మొక్క‌ను నాటారు. ఈ సంద‌ర్భంగా  సీతక్క మాట్లాడుతూ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుంటూ క‌రోనా విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ పెరుగుతున్న ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో అడ్వ‌కేట్ భ‌జ‌న స‌తీష్‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మంద నాగ‌రాజు, నాగ‌ముర‌ళి, గోనెల వెంక‌టేశ్వ‌ర్లు, గుండె వెంక‌న్న‌, స‌త్త‌పండు, శ‌న‌క కిషోర్‌, గోనేల ప్ర‌శాంత్‌, యూత్ స‌భ్యులు పాల్గొన్నారు. 

సీఎంఆర్ ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేసిన ఎమ్మెల్యే 

కారేప‌ల్లి(Karepalli): మండ‌లంలోని ఎంపీడిఓ కార్యాల‌యంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కుల‌ను వైరా శాస‌న స‌భ్యులు లావుడియా రాములు నాయ‌క్ మంగ‌ళ‌వారం అంద‌జేశారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేద‌వారికి స‌హాయార్ధం ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి ‌నుండి చెక్కుల‌ను అంద‌జేశామ‌ని తెలిపారు. 
మండ‌లంలోని 10 చెక్కుల‌కు గాను సుమారు రూ.4 ల‌క్ష‌ల 80,500 వేలు అంద‌జేశామ‌ని తెలిపారు. కారేప‌ల్లి ఎంపీపీ మాలోతు శ‌కుంత‌ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో టిఆర్ ఎస్ మండ‌ల పార్టీ అధ్య‌క్షులు తోట‌కూరి పిచ్చ‌య్య, ఆత్మ క‌మిటీ ఛైర్మ‌న్ ముత్యాల స‌త్య‌నారాయ‌ణ పిఎసిఎస్ ఛైర్మ‌న్ శ్రీ‌నివాస‌రావు, వైస్ ఎంపీపీ రావూరి శ్రీ‌ను జ‌డ్పిటీసీ వాంకుడోత్ జ‌గ‌న్ నాయ‌క్‌, టిఆర్ ఎస్ మండ‌ల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ్మీర వీర‌న్న గ్రామ స‌ర్పంచులు , ఎంపీటీసీలు త‌దిత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. ఇవి చ‌ద‌వండి:గాలిబుడ‌గ‌ల దుమారం..కిమ్‌కు కోపం..!

No comments:

Post a Comment