Tuesday, June 9, 2020

జ‌ర్న‌లిస్టుపై దూర్భాష‌లాడిన రెవెన్యూ అధికారి, నిర‌స‌న‌గా ధ‌ర్నా


 మేడ్చ‌ల్(Medchal): మేడ్చ‌ల్ జిల్లా, కాప్రా మండ‌లం జ‌వ‌హార్ న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో కాప్రా త‌హ‌శీల్దార్‌గా ఉన్న గౌత‌మ్ కుమార్ విలేక‌ర్ల‌పై దాడులు చేస్తున్నార‌ని, దుర్భాష‌లాడుతూ బెదిరిస్తున్నార‌ని తెలుపుతూ  ఇందుకు నిర‌స‌న‌గా మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ ఎదుట ఫ్రింట్ అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా ప్ర‌తినిధులు ధ‌ర్నాకు దిగారు. జ‌ర్న‌లిస్టు సూద‌గాని వెంక‌టేష్ మాట్లాడుతూ.. ఇటీవ‌ల కాలంలో జ‌ర్న‌లిస్టుల‌పై త‌హ‌శీల్దార్ భౌతికంగా దాడి చేశార‌ని, ఈ క్ర‌మంలో "మీడియాటుడే" విలేక‌రి పోర‌ల్ల యాద‌గిరి విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా స‌మాచార‌సేక‌ర‌ణ‌కు వెళ్లి ఫొటో తీస్తుంటే.." ఎవ‌రు?  నువ్వు" అని ప్ర‌శ్నించ‌గా..విలేక‌రిన‌ని ఐడి కార్డు చూపించిన‌ప్ప‌టికీ.."విలేక‌రి లేడు..ఎవ్వ‌డూ లేడు..ప్ర‌క్క‌కు పోండ్రా.." అని నీచంగా దుర్భాష‌లాడార‌ని తెలిపారు. ఎంఆర్ఓ అంటే మండ‌లానికి మెజిస్ట్రేట్‌..ఒక జ‌డ్జి లాంటి వాడ‌ని, కానీ ఈ రకంగా పూర్వ‌కాలంలో ప‌టేల్ చేసిన‌ విధంగా దౌర్జ‌న్యాల‌ను ఈ ఎంఆర్ఓ అనుస‌రిస్తున్నార‌ని, ప్ర‌జాస్వామ్యుత దేశంలో నాల్గో స్థంభ‌మైన మీడియా రంగంపై భౌతిక దాడికి పాల్ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక టాస్క్‌ఫోర్స్ అధికారిగా బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ త‌హ‌శీల్దార్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌భుత్వం త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న‌కు దిగారు. 

No comments:

Post a Comment