Wednesday, June 24, 2020

పాకిస్తాన్ విమానం ప్ర‌మాదం..కార‌ణాలివే..!

మాన‌వ త‌ప్పిద‌మే..ప్ర‌క‌టించిన పాక్ మంత్రి

ఇస్లామాబాద్(Islamabad) : పాకిస్తాన్‌‌లో గ‌త నెల‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో 97 మంది మ‌ర‌ణానికి కార‌ణ‌మైన ఈ ప్ర‌మాదం మాన‌వ త‌ప్పిదం వ‌ల్లే జ‌రిగింద‌ని ఆ దేశం వెళ్ల‌డించింది. ఫైలెట్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగాల పొర‌పాట్లే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని ప్రాథ‌మిక నివేదిక ఒక‌టి తేల్చింది. విమాన ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను పార్ల‌మెంటులో చెబుతూ ఆ దేశ విమాన‌యాన శాఖ మంత్రి గులాన్ స‌ర్వార్ ఖాన్‌..ఫైలట్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌(ఏటీసీ) సిబ్బంది ప్రోటోకాల్ పాటించ‌లేద‌ని అన్నారు. మే 22న క‌రాచీలో నివాస ప్రాంతాల‌పై కూలిన ఈ ప్ర‌మాదంలో 97 మంది మ‌ర‌ణించార‌ని, కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డ్డార‌ని తెలిపారు. 
పాకిస్తాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌లైన్స్‌కు (పీఐఏ)కు చెందిన ఆ ఎయిర్‌బ‌స్ 320 విమానంలో ఎలాంటి లోపం లేద‌ని మంత్రి చెప్పారు. ఏటీసీ నుంచి వ‌చ్చిన సూచ‌న‌ల‌ను ఫైల‌ట్ ప‌ట్టించుకోలేద‌ని, అలాగే ఇంజిన్ ఢీకొన్న సంగ‌తిని ఏటీసీ ఫైలట్‌కు చెప్ప‌లేద‌ని స‌ర్వార్ ఖాన్ అన్నారు. లాహోర్ నుంచి క‌రాచీ వ‌స్తూ ల్యాండింగ్ స‌మ‌యంలో విమానాశ్ర‌యానికి స‌మీపంలో నివాస‌ప్రాంతాల మ‌ధ్య కూలిపోయింది. ఇవి చ‌ద‌వండి:స‌రిహ‌ద్దులో "ఆస‌క్తిక‌ర‌మైన" ఘ‌ట‌న‌..!
"విమానాన్ని మొద‌ట ర‌న్‌వేపై దించే క్ర‌మంలో ల్యాండింగ్ గేర్ స‌రిగా వేయ‌క‌పోవ‌డంతో విమానం ర‌న్‌వేపై ఈడ్చుకుంటూ వెళ్లింద‌ని.. దీంతో విమానాన్ని మ‌ళ్లీ గాల్లోకి ఎగిరించి రెండో సారి ల్యాండింగ్ కు ప్ర‌య‌త్నించాడు ఫైలెట్‌. కానీ ఈ లోగా ఏటీసీ సిబ్బంది విమానం తొలి ల్యాండింగ్ ప్ర‌య‌త్నంలో ఇంజిన్ దారుణంగా దెబ్బ‌తిందన్న సంగ‌తిని ఫైలెట్‌కు చెప్ప‌లేదు."అని మంత్రి వెల్ల‌డించారు. ఇవి చ‌ద‌వండి: 70 మంది క‌రోనా రోగులు ఏమ‌య్యారు?

పైలెట్‌, ఏటీసీ మ‌ధ్య సంభాష‌ణ ఇలా..!

విమానం కూలిపోయిన త‌ర్వాత పాకిస్తాన్ మీడియాలో ఫైలెట్‌, ఏటీసీ మ‌ధ్య సంభాష‌ణ‌గా చెబుతున్న ఆడియో సారంశం ఒక‌టి వ‌చ్చింది. అందులో విమానం ఇంజిన్లు పోయాయి అని ఫైల‌ట్ అన‌డం వినిపిస్తుంది. అప్పుడు ఏటీసీ నుంచి బెల్లీ ల్యాండింగ్ చేస్తారా అని అడ‌గ్గా మేడే మేడే మేడే అని ఫైల‌ట్ చెప్ప‌డం వ‌ర‌కు వినిపిస్తుంది. అదే ఫైల‌ట్‌, ఏటీసీ మ‌ధ్య చివ‌రి సంభాష‌ణ‌. కాగా మొద‌టి సారి ల్యాండింగ్‌కు ప్ర‌య‌త్నించ‌డం, ఆ త‌ర్వాత విమానం కూలిపోవ‌డానికి మ‌ధ్య 10 నుంచి 15 నిమిషాల స‌మ‌యం ప‌ట్టింద‌ని ఈ ప్ర‌మాదం నుంచి బ‌తికి బ‌య‌ట‌ప‌డిన ముహ‌మ్మ‌ద్ జుబేర్ చెప్పారు.  అయితే..క్రాష్ అయ్యేంత వ‌ర‌కు ప్ర‌యాణం సాఫీగా అనిపించ‌డంతో ఎవ‌రూ ఈ ఘోరాన్ని ఊహించ‌లేద‌ని మంత్రి  ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

No comments:

Post a Comment