Thursday, June 25, 2020

అలెర్ట్:ముంచుకొస్తున్న మిడ‌త‌ల ముప్పు..!

మిడ‌త‌ల దండ‌యాత్ర ఇటు రైతులు, అటు ఆఫీస‌ర్ల‌లో ద‌డ పుట్టిస్తోంది. నైరూతి రుతుప‌వ‌నాల స‌మ‌యం కావ‌డంతో గాలివాటం ద్వారా ఒక‌టి రెండు రోజుల్లో మిడ‌త‌ల దండు సంగారెడ్డి జిల్లాలోకి క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల మీదుగా ప్ర‌వేశించే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

 హైద‌రాబాద్‌(Hyderabad): ఈ నెల 25 నుంచి జులై 5వ లోగా జిల్లాలోని రాష్ట్ర బార్డ‌ర్ల ద్వారా దాదాపు 33 గ్రామాల్లోకి మిడ‌త‌లు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు జిల్లా యంత్రాంగం ఇటీవ‌ల గుర్తించింది. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా, మండ‌ల స్థాయి క‌మిటీలు ఏర్పాటుచేసి వాటిని అంత‌మొందించేందుకు ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధ‌మ‌వుతోంది. ఈ విష‌యంపై 22న క‌లెక్ట‌ర్ హ‌నుమంతురావు పోలీసు, అగ్నిమాప‌క‌, వ్య‌వసాయ, ఉద్యాన వ‌న‌, అట‌వీ, పంచాయ‌తీ శాఖ‌ల అధికారుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. మిడ‌త‌లను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన ముంద‌స్తు జాగ్రత్త‌ల‌పై చ‌ర్చించారు. ప్ర‌స్తుతం మిడ‌త‌ల‌ను ఎదుర్కొనేందుకు సూక్ష్మ స్థాయి ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేసే ప‌నిలో ఆయా శాఖ‌ల ఆఫీస‌ర్లు నిమ‌గ్న‌మ‌య్యారు. ఇవి చ‌ద‌వండి: సంచ‌ల‌న‌మైన "తండ్రి-కొడుకు"ల మ‌ర‌ణం..!

గాలివాటం ఆధారంగా..

గాలివాటం ఆధారంగా ప్ర‌వేశించే మిడ‌త‌ల దండు రాజస్థాన్ నుంచి మధ్య‌ప్ర‌దేశ్ లోకి ప్ర‌వేశించిన‌ట్టు తెలిసింది. అంత‌ర్ రాష్ట్రాల మీదుగా జిల్లా స‌రిహ‌ద్దులోని నార‌య‌ణ‌ఖేడ్ ద్వారా జిల్లాలోని 33 గ్రామాల్లో మిడ‌త‌లు వ‌చ్చే  అవ‌కాశం ఉన్న‌ట్టు  వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిస్తోంది.  ఏ రోజుకుకారోజు గాలిని బ‌ట్టి కూడా ప‌రిస్థితులు మార‌వ‌చ్చ‌ని చెబుతోంది. ప్ర‌స్తుతం గాలివాటం ప్ర‌కారం మిడ‌త‌ల దండు తెలంగాణ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనిక వెళ్లే చాన్స్ క‌నిపిస్తోంద‌ని ఆ శాఖ పేర్కొంది. ఈ ప్ర‌కారంగా జిల్లా ఆఫీస‌ర్లు ఇప్ప‌టికే సంబంధిత ఆఫీస‌ర్ల‌ను అల‌ర్డ్ చేశారు. జిల్లా, మండ‌ల‌, గ్రామ స్థాయిల్లో క‌మిటీలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్న వ‌న‌రులు, సామాగ్రిల‌తో నివేదిక‌లు త‌యారు చేయించింది. మ‌రో వైపు గ్రామాలు, మండ‌లాల వారీగా గ్రూపుల‌ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. 
స‌రిహ‌ద్దులోని పంట‌ల స‌ర‌ళిపై ఇప్ప‌టికే నివేదిక‌లూ రూపొందించారు. అధికారులు సూక్ష్మ స్థాయిలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. గ్రామాల వారీగా ఇన్వెంట‌రీ త‌యారు చేసుకోవ‌డం, హ్యాండ్   స్ప్రేయ‌ర్లు, జెట్టి మిష‌న్లు, ర‌సాయ‌నాలు, ఫైరింజ‌న్ వాహ‌నాలు, ర‌సాయ‌నాల స్ప్రే ప‌ర్స‌న‌ల్ ప్రొటెక్ష‌న్ కిట్ల‌ను అందుబాటులో ఉంచింది. 33 గ్రామాల స‌ర్పంచ్‌లు, పంచాయ‌తీ సెక్ర‌ట‌రీలు, ఏఈఓలు, వీఆర్ ఓలు, ఫైర్ సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. స‌రిహ‌ద్దు నుంచి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న గ్రామాల జాబితా మ్యాప్ ల‌ను రెడీగా ఉంచారు. ఇవి చ‌ద‌వండి: బ‌య‌టే నా సేవ‌లు అవ‌స‌రం: ఐపీఎస్ వీకే సింగ్ రాజీనామా

33 గ్రామాల‌కు ముప్పు..

సంగారెడ్డి జిల్లాలో 33 గ్రామాల్లో మిడ‌త‌ల దండు అటాక్ చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు ఆఫీస‌ర్లు గుర్తించారు. నార‌య‌ణ‌ఖేడ్ డివిజ‌న్ ప‌రిధిలో క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు గ్రామాలైన నాగల్ గిద్ద మండ‌లంలో ఔద‌ర్ పూర్‌, గోడేగావ్ వాడ‌, క‌ర‌స్ గుత్తి, ఏస్గీ, కార‌ముంగి, షాపూర్‌, శాంతి న‌గ‌ర్ తండా, మొర్గి, కంగ్తి మండ‌లం దేగుల్ వాడి, చంద‌ర్ తండా, సిద్ద‌న్‌గిర్గా, నాగూర్ కె. బాబుల్ గావ్‌, జ‌హీరాబాద్ డివిజ‌న్‌లో మొగుడంప‌ల్లి మండ‌లం  గౌసాబాద్ తండా, ధ‌న‌శ్రీ‌, మాడిగి, జాడి మ‌ల్కాపూర్‌, ఔరంగాన‌గ‌ర్‌, జ‌హీరాబాద్ మండ‌లం స‌త్వార్‌, చిరాగ్ ప‌ల్లి, బుర్దిపాడు, బుచినెల్లి, కోహిర్ మండ‌లం సిద్ధాపూర్ తండా, మ‌నియార్ ప‌ల్లి, న్యాల్క‌ల్ మండ‌లం శంష‌ల్లాపూర్ , రాజోల‌, మాలీగి, హుస్సేన్ న‌గ‌ర్‌, క‌ల్బెమ‌ల్‌, డ‌ప్పూర్‌, ర‌త్నాపూర్‌, హుసెళ్లి, గ‌ణేష్ పూర్ గ్రామాల‌కు మిడ‌త‌ల దండు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు అంచ‌నాలువేస్తున్నారు. ఈ గ్రామాల వ‌ద్ద అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ హ‌నుమంతురావు ఆఫీస‌ర్ల‌కు సూచించారు. 

ఆ గ్రామంలో అలెర్ట్‌..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండ‌లం దేగుల్ వాడి గ్రామంలో  చాలా వ‌ర‌కు వ్య‌వ‌సాయాన్ని న‌మ్ముకుని జీవిస్తున్న వారే ఎక్కువ‌. క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో ఈ ఊరికి మూడు కిలోమీట‌ర్లు ఉండ‌గా, మ‌హారాష్ట్ర బార్డ‌ర్ 13 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఈ గ్రామంలోకి మిడ‌త‌ల దండు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు అధికారులు ఊళ్లో చాటింపు వేయించారు. ఈ గ్రామంలో తిరుగుతూ ప‌ల్లె జ‌నాన్ని చైత‌న్య ప‌రుస్తున్నారు. నాలుగు రోజులుగా ముందు జాగ్ర‌త్త‌ల‌పై ఆఫీస‌ర్లు హ‌డావుడి చేస్తుండ‌టంతో గ్రామ‌స్తుల్లో భ‌యాందోళ‌న మొద‌లైంది. 

No comments:

Post a Comment