Thursday, June 25, 2020

బ‌య‌టే నా సేవ‌లు అవ‌స‌రం : ఐపీఎస్ వీకే సింగ్ రాజీనామా

హైద‌రాబాద్(Hyderabad):  తెలంగాణ పోలీస్ అకాడ‌మీ డైరెక్ట‌ర్ ప‌ద‌వికి సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శికి పంపారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. గాంధీ జ‌యంతి రోజున ప‌ద‌వీ విర‌మ‌ణ ఇవ్వాల‌ని వీఏ సింగ్ కేంద్రాన్ని కోరారు. పోలీస్ శాఖ‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తేవాల‌నే ఆశ‌యం త‌న‌కు ఉండేద‌న్నారు. సంస్క‌ర‌ణ‌ల అమ‌లులో స‌ఫ‌లం కాలేక‌పోయాన‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. త‌న స‌ర్వీస్ ప‌ట్ల ప్ర‌భుత్వం సంతృప్తిగా లేన‌ట్టుంద‌ని వీకే సింగ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌భుత్వానికి తాను భారం కాద‌ల్చుకోలేద‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వంలో కంటే బ‌య‌టే త‌న సేవ‌లు అవ‌స‌ర‌మ‌న్నారు. తాను ఏ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకం కాద‌ని సృష్టం చేశారు. 
ఈ లేఖ‌ను తెలంగాణ ప్ర‌భుత్వ సీఎస్‌కు , సీఎం కేసీఆర్‌కు కూడా పంపారు. డీజీపీగా త‌న‌కు ప‌దో న్న‌తి క‌ల్పించాల‌ని, అందుకు త‌న‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ఆ లేఖ‌లో ఆయ‌న ప్ర‌భు త్వానికి విన్న‌వించారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం 33 ఏళ్లు సేవ‌లందించిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిగా తాను డీజీపీ ప‌ద‌వికి అర్హుడ‌నని ఆయ‌న లేఖ‌లో ప్రభుత్వానికి తెలిపారు. పోలీస్ అకాడ‌మీ కోసం తెలంగాన ప్ర‌భుత్వం చేస్తున్న ఖ‌ర్చు వృథానే అని, పోలీస్ అకాడ‌మీ వ‌ల్ల పెద్ద ఉప‌యోగం లేద‌ని వీకే సింగ్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు పోలీసు శాఖ‌లో పెను దుమారాన్నే రేపాయి. తాను ప‌దోన్న‌తికి ప‌నికిరానంటే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ద‌మ‌ని గ‌తంలో వీకే సింగ్ ప్ర‌భుత్వాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి సంచ‌ల‌నం సృష్టించారు. 

No comments:

Post a Comment