Sunday, June 28, 2020

క‌రోనా ప్ర‌భావం:ఎన్నారైల ‌పై ఎలా ఉందంటే?

 ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌ల్లాడిస్తున్న క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల అగ్ర‌దేశాల్లో ఉంటున్న‌భార‌తీయుల ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ప‌డుతూ దేశంకాని దేశంలో ఉంటూ కుంగుబాటు, నిరాశ‌, నిస్స‌హాయ స్థితిలో మ‌నోవేద‌న ప‌డుతున్న‌ట్టు ఓ స‌ర్వేలో తేలింది. ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రులో ఈ ప్ర‌భావం క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ముంబాయి(Mumbai): అమెరికాలో ప్ర‌తి ఐదు భార‌తీయ అమెరిక‌న్ల‌లో ఇద్ద‌రు త‌మ దీర్ఘాక‌ల ఆర్థిక స్థిర‌త్వం గురించి ఆందోళ‌న చెందుతున్నారు. అగ్ర‌రాజ్యాన్ని అతులాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ ప్ర‌భావ‌మే ఇందుకు కార‌ణమ‌ట‌. ఈ వైర‌స్ దెబ్బ‌కు దాదాపు ప్ర‌తి ఎన్నారై జీవ‌న‌శైలి మారిపోయింద‌ని తెలిసింది. భార‌తీయ అమెరిక‌న్ స‌మాజంపై కోవిడ్‌-19 ప్ర‌భావాన్ని తెలుసుకునేందుకు ఫౌండేష‌న్ ఫ‌ర్ ఇండియా, ఇండియన్ డ‌యాస్పొరా స్ట‌డీస్ (ఎఫ్ ఐఐడీ ఎస్‌) నిర్వ‌హించిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దాదాపు 30 శాతం భార‌తీయ అమెరిక‌న్ల ఉద్యోగం, ఇంట‌ర్న‌షిప్స్ పై ఆర్థిక ప్ర‌భావం ప‌డింద‌ని నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌తి ఆరుగురు లో ఒక‌రు లేదా కుటుంబ స‌భ్యుల్లో ఒక్క‌రికైనా కొవిడ్‌-19 పాజిటివ్ ఉన్న‌ట్టు పేర్కొంది. మ‌హ‌మ్మారి వ‌ల్ల కొద్ది మంది భార‌తీయులు వ‌ల‌స ఇబ్బందులు చ‌విచూశార‌ని తెలిపింది.
"భార‌తీయ అమెరిక‌న్ల‌పై కొవిడ్‌-19 ప్ర‌భావం, దానికి స్పంద‌న ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ స‌ర్వే చేప‌ట్టాం." అని ఆ సంస్థ డైరెక్ట‌ర్ ఖందెరావ్ కండ్ అన్నారు. ఇలాంటి స‌ర్వే చేయ‌డం ఇదే మొద‌టి సార‌ని చెప్పారు. చాలా మంది ఎన్నారైలు సామాన్య ప్ర‌జ‌ల‌కు మాస్కులు, ఆహారం, వైద్య స‌హాయం, ఆవాసం క‌ల్పించేందుకు కృషి చేశార‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి ఆరుగురిలో ఐదుగురుభార‌తీయ అమెరిక‌న్లు త‌మ కుటుంబ సంబంధాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయ‌ని లేదా మార్పు లేమీ లేవ‌ని వెల్ల‌డించారు. న‌లుగురిలో ఒక‌రు కుంగుబాటు, నిరాశ‌, నిస్స‌హాయుత వ్య‌క్తం చేశారు. కొవిడ్ -19 వ‌ల్ల ప్ర‌తి భార‌తీయ అమెరిక‌న్ త‌మ జీవ‌న శైలిని మార్చుకోవ‌డం గ‌మ‌న‌ర్హాం. ప్ర‌పంచంలో అత్య‌ధిక క‌రోనా వైర‌స్ కేసులు అమెరికాలోనే ఉన్న సంగ‌తి తెలిసిందే. 

No comments:

Post a Comment