Thursday, June 25, 2020

తాజావార్త‌..రైల్వేశాఖ కీల‌క నిర్ణ‌యం..!

న్యూఢిల్లీ(Newdelhi):
దేశంలో క‌రోనా మ‌హమ్మారి అంత‌కంత‌కూ పెరుగుతున్న వేళ రైల్వేశాఖ మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టైంటేబుల్ ఆధారిత అన్ని రెగ్యుల‌ర్ ప్ర‌యాణికుల రైలు స‌ర్వీసుల‌ను(మెయిల్‌/ఎక్స్ ప్రెస్ , ప్యాసింజ‌ర్‌, స‌బ‌ర్బ‌న్ రైళ్లు) ఆగ‌ష్టు  12 వ‌ర‌కు ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో జూలై 1 నుంచి ఆగ‌ష్టు 12 మ‌ధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు ర‌ద్దువుతాయ‌ని రైల్వే బోర్డు గురువారం  ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి మార్చిలో విధించిన లాక్‌డౌన్ నిర్ణ‌యంతో అన్ని రెగ్యుల‌ర్ ప్యాసింజ‌ర్ రైళ్లు స‌ర్వీసుల‌ను రైల్వే శాఖ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. త‌దుప‌రి నోటీసు జారీ చేసే వ‌ర‌కు ఈ నిర్ణ‌యం కొన‌సాగుతుంద‌ని అప్ప‌ట్లో తెలిపింది. ఆ త‌ర్వాత దాన్ని మే 3 వ‌ర‌కు పొడిగించింది. అప్ప‌టికీ క‌రోనా వైరస్ అదుపులోకి రాక‌పోవ‌డంతో రైళ్ల ర‌ద్దును జూన్ 30 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో కేసులు న‌మోదవుతున్న వేళ మ‌రోసారి రెగ్యుల‌ర్ ప్యాసింజ‌ర్ రైళ్లు స‌ర్వీసులు ర‌ద్దు గ‌డువును పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దేశంలో లాక్‌డౌన్ మూలంగా ప‌లు చోట్ల చిక్కుకున్న వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్ర‌త్యేక రైళ్లు, ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన మ‌రికొన్ని రైళ్లు మాత్రం య‌థాత‌థంగా న‌డ‌వ‌నున్నాయి. ఇవి చ‌ద‌వండి: సంచ‌ల‌న‌మైన "తండ్రి-కొడుకు"ల మ‌ర‌ణం..!

దేశ రాజ‌ధానిని బెంబేలెత్తిస్తున్న క‌రోనా..!

దేశంలో లాక్‌డౌన్ ఎత్తేసిన మ‌రుస‌టి రోజు దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై క‌రోనా కేసుల్లో పుట్టిల్లు చైనా లోని వ్యూహాన్‌ను దాటేసింది. స‌రిగ్గా రెండు వారాల త‌ర్వాత దేశ రాజ‌ధాని ఢిల్లీ, ముంబైని క‌రోనా వ్యాప్తిలో మించిపోయింది. సోమ‌వారం ఉద‌యానికి ఢిల్లీలో న‌మోదైన క‌రోనా కేసులు 70,390. ఇదే స‌మ‌యానికి ముంబైలో ఉన్న కేసులు సంఖ్య 69,529. ఢిల్లీ క‌రోనా హాట్‌స్పాట్‌గా మారుతుంది.ఇవి చ‌ద‌వండి: బీహార్‌లో పెనువిషాదం..!

 ఒక‌సారి కేసులు ప్ర‌భావం ఎలా పెరిగిందో ప‌రిశీలిస్తే...

మే 29 నుంచి ఢిల్లీలో క‌రోనా కేసులు రోజుకు వెయ్యికి పైనే న‌మోద‌వుతూ వస్తున్నాయి. మే 31ను బేస్‌లైన్ గా తీసుకుంటే, అప్ప‌టిదాకా న‌మోదవుతున్న కేసులు రోజుకు మూడింత‌లు పెరిగాయి. జూన్ రెండో వారం దాకా ముంబైలో విప‌రీతంగా కేసులు పెరిగాయి. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ క‌రోనా వ్యాప్తి 5.25 శాతం కాగా, ముంబైలో 3 కంటే త‌క్కువ‌. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు జులైలో ముంబైని, ఢిల్లీ దాటేస్తుంద‌ని భావించారు. కానీ, ఓ వారం ముందే ఢిల్లీ ఆ స్థాయిని చేరుకుంది. జూన్ 23న ఢిల్లీలో 3947 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌పంచం మొత్తం మీద కూడా ఒకే న‌గ‌రంలో ఇన్ని కేసులు బ‌య‌ట‌ప‌డ‌లేదు. జ‌నాభాలో ముంబై కంటే ఢిల్లీనే ముందుంది. ఆర్థిక రాజ‌ధాని జ‌నాభా 1.25 కోట్లు కాగా ఢిల్లీ జ‌నాబా 1.68 కోట్లు. అయితే, ముంబై కంటే ఢిల్లీలో నే ఎక్కువ టెస్టులు జ‌రిగాయి. ఢిల్లీలో ప్ర‌తి ప‌ది లక్ష‌ల మందికి 22,142 మందికి క‌రోనా టెస్టులు జ‌రిగాయి. ముంబైలో ఈ సంఖ్య 22,668 గా ఉంది. ఇదే స‌మ‌యంలో ముంబైలో రేటు 23 శాతం కాగా ఢిల్లీలో కేవ‌లం 17 శాతం మాత్ర‌మే కొన్ని రోజులుగా ఈ ప‌రిస్థితి మారింది. ప్ర‌స్తుతం ముంబై, ఢిల్లీ పాజిటివ్ రేటు స‌మాన‌మైంది.జ‌నాభాతో పోల్చితే ఢిల్లీలో త‌క్కువ కేసులు ఉన్న‌ట్టే లెక్క‌. ఇక్క‌డ 10 ల‌క్ష‌ల మందికి 347 కేసులు న‌మోద‌య్యాయి. ముంబైలో ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల మందికి 5,478 కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ముంబైలో కంటే ఢిల్లీలో మ‌ర‌ణాలు, రిక‌వ‌రీల రేటు ఎక్కువుగా ఉంది. ముంబైలో 28,548 యాక్టివ్ కేసులుఉన్నాయి. ఢిల్లీలో ఈ సంఖ్య 26,588 గా ఉంది. ముంబైలో రోజూ న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య జూన్‌లో త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త వారం కేసుల పెరుగుద‌ల 2.7 శాతం నుంచి 2.4 శాతానికి ప‌డిపోయింది. దేశ‌వ్యాప్తంగా రోజూ బ‌య‌ట‌ప‌డుతున్న కేసుల రేటు 3.3 శాతంగా ఉంది. ఢిల్లీలో కేసుల డ‌బులింగ్ రేటు 12 కి త‌గ్గింది.  ఇవి చ‌ద‌వండి :అలెర్ట్:ముంచుకొస్తున్న మిడ‌త‌ల ముప్పు..!

No comments:

Post a Comment