Thursday, June 25, 2020

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో క‌రోనా అల‌జ‌డి..!

 క‌రోనా లాక్‌డౌన్ స‌డ‌లింపు త‌ర్వాత ‌ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోకూడా కేసులు న‌మోద‌వుతుండ‌టం మ‌రింత అల‌జ‌డ‌ని సృష్టిస్తోంది.  ఉమ్మ‌డి జిల్లా ప్ర‌జ‌లు వైద్యానికి సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ హైద‌రాబాద్‌పై ఆధార‌ప‌డ‌టం , లేదంటే విజ‌య‌వాడ‌కు వెళ్ల‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఇప్పుడు అదే కొత్త చిక్కుల‌ను తీసుకొచ్చిపెడుతోంది. హైద‌రాబాద్ వెళ్లారంటే చాలా క‌రోనా అంటుకున్న‌ట్టే. ఉమ్మ‌డి జిల్లాలో ఒకే రోజు ప‌ది కేసులు న‌మోదు కావ‌డం, రూర‌ల్ ప్రాంతంలో సంబంధాలు ఉండ‌టం క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంది. బ‌య‌ట‌కు రావాలంటే జ‌నం జంకుతున్నారు. అధికారులు మాత్రం ప‌ట్టింపును వ‌దిలేసి ఎవ‌రి ర‌క్ష‌ణ‌వారే చూసుకుంటారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇవి చ‌ద‌వండి:ప‌ల్నాడులో వింత శిశువు జ‌న‌నం..!

ఖమ్మం(Khammam): ఖ‌మ్మం జిల్లాలో బుధ‌వారం నాలుగు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా వాటిలో ఓ చిన్నారితో స‌హా ఇరువురు మృతిచెందారు. మండ‌ల కేంద్ర‌మైన ముదిగొండ కు చెందిన మూడు నెల‌ల పాప మృతి చెందింది. ఆ చిన్నారికి క‌రోనా పాజిటీవ్ గా తేలింది. న‌గ‌రంలో డిఆర్‌డిఏ వ‌ద్ద బ్యాంకులో ప‌నిచేస్తున్న ఉద్యోగి కూడా మృతి చెందాడు.అత‌నికి కూడా క‌రోనా పాజిటీవ్‌గా తేలింది. వీరితో పాటు ఎన్ ఎస్ టి రోడ్డులోని 60 ఏళ్ల వృద్ధురాలికి క‌రోనా పాజిటీవ్‌గా న‌మోదైంది. న‌గ‌రంలోని క‌విరాజ్  న‌గ‌ర్‌కు చెందిన ఓప్రైవేటు ఉద్యోగికి కూడా పాజిటివ్ వచ్చింది. భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు కేసులు న‌మోదు కాగా పాల్వంచ‌లో ఒక‌రికి, రేగ‌ళ్ల‌లో ఒక‌రికి, కొత్త‌గూడెంలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. రోజురోజుకూ క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. 

క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటించ‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు:క‌లెక్ట‌ర్‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం: క‌రోనా వ్యాధి నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటించ‌ని ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార దుకాణాలు, వీధి వ్యాపారులు, హోట‌ళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ యంవి రెడ్డి హెచ్చ‌రించారు. బుధ‌వారం జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌లు నిర్వ‌హ‌ణ అధికారులు, పోలీసు బెటాలియ‌న్‌, మున్సిప‌ల్ ఛైర్మ‌న్లు, క‌మీష‌న‌ర్లు, చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ తో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న త‌రుణంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ అధికారులు ముమ్మ‌ర త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని వైర‌స్ నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటించ‌ని వారిపై జ‌రిమానాలు విధించి ,సీజ్ చేయాల‌ని ఆదేశించారు. ఈ ద‌శ‌లో క‌ఠిన నియ‌మాలు పాటించ‌క‌పోతే ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిపారు. ఇటీవ‌ల న‌మోదైన కేసుల్లో ప‌రిశ్ర‌మ‌ల్లో విధులు నిర్వ‌హిస్తున్న వారి ద్వారా వ్యాప్తి జ‌రిగిన‌ట్టు తెలుస్తుంద‌ని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు వివిధ ప్రాంతాల నుంచి వ‌స్తున్న వాహ‌నాల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని, ర‌హ‌దారుల ప్ర‌క్క‌న నిలుపుద‌ల చేస్తే సంబంధిత ప‌రిశ్ర‌మ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  ఆదేశించారు.క్లిక్ చేయండి: ట్రై చేయండి..ప‌రీక్ష లేకుండా ఎస్‌బీఐలో ఉద్య‌గోం..!
 అలాగే వాహ‌న డ్రైవ‌ర్లు ర‌హ‌దారులు ప్ర‌క్క‌న వాహ‌నాలు నిలుపుద‌ల చేసి హోట‌ళ్లు నందు భోజ‌నాలు చేస్తున్నార‌ని, అలా కాకుండా పార్శిల్ ద్వారా ఆహార ప‌దార్థాలు విక్ర‌యాలు నిర్వ‌హించాల‌ని తెలిపారు. ఆరు బ‌య‌ట మ‌ల మూత్ర విస‌ర్జ‌న చేయ‌కుండా అవ‌గాహ‌న కొర‌కు ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మైకు సిస్టం ద్వారా తెలుగు, హిందీ, భాష‌ల్లో ప్ర‌చారం చేయాల‌ని అన్నారు. సిబ్బందికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ణ‌తో పాటు మాస్కులు, సామాజిక దూరం పాటించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌వేశ మార్గం ఒక్క‌టే ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు రోజూ వ్యాధి నియంత్ర‌ణకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను తెలియ‌జేయుట‌కు ఒక‌నోడ‌ల్ అధికారిని నియ‌మించాల‌ని తెలిపారు. 
ప్ర‌భుత్వ , ప్రైవేటు ఆసుప‌త్రుల్లో జ్వ‌రం, జ‌లుపు, తుమ్ములు, దగ్గు శ్వాస‌కోశ వ్యాధులున్న వ్య‌క్తుల స‌మాచారం ప్ర‌తి రోజూ సేక‌రించి నివేదిక‌లు అంద‌జేయాల‌ని తెలిపారు. అలాగే మెడిక‌ల్ షాపుల‌పై నిరంత‌ర తనిఖీలు నిర్వ‌హించాల‌ని సూచించారు. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో వైర‌స్‌తీవ్ర‌త చాలా అధికంగా ఉన్నందున ఆ ప్రాంతాల నుంచి వ‌చ్చే వ్య‌క్తుల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌లునిర్వ‌హించాల‌ని అనుమానిత ల‌క్ష‌నాలుంటే త‌క్ష‌ణ‌మే ఐసోలేష‌న్‌కు త‌ర‌లించాల‌ని తెలిపారు. ఏమ‌ర‌పాటు ప్ర‌ద‌ర్శించ‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు పాటిస్తేనే మ‌నం ఈ వైర‌స్ నుండి క్షేమంగా ఉండ‌గ‌ల‌మ‌నేవిష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తుంచుకోవాల‌ని సూచించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో అద‌న‌పు క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, ప‌రిశ్ర‌మ‌ల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ సీతారం, ఆర్డిఓ స్వ‌ర్ణ‌ల‌త‌, మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్  సీతాల‌క్ష్మి, క‌మిష‌నర్లు, జిల్లాలోని వివిధ ప‌రిశ్ర‌మ‌లు ముఖ్య అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు. బీహార్‌లో వారి సినిమాలు బ్యాన్‌?

No comments:

Post a Comment