Wednesday, June 24, 2020

క‌రోనాతో తృణ‌మూల్ ఎమ్మెల్యే మృతి

ప‌శ్చిమ‌బెంగాల్(west bengal) :
ప‌శ్చిమ బెంగాల్‌లోని తృణ‌మూల్ కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే త‌మోనాశ్ ఘోష్ (60) క‌రోనా వైర‌స్‌తో చ‌నిపోయారు. సౌత్ 24 ప‌ర్గ‌నాస్‌లోని ఫ‌ల్టా నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన త‌మోనాశ్ 1998 నుంచి పార్టీ ట్రెజ‌ర‌ర్‌గా వ్య‌హ‌రిస్తున్నారు. మేలో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ రావడంతో హాస్పిట‌ల్‌లో చేశారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చ‌నిపోయిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పాయి. త‌మోనాష్ మృతి పార్టికి తీర‌ని లోటు అని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ట్వీట్ చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, 1998 నుంచి పార్టీ ట్రెజ‌ర‌ర్‌గా ప‌నిచేస్తున్న ఘోష్ మృతి బాధ‌ను క‌లిగించింది. 35 ఏళ్లు పార్టీకి, ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అద్భుత‌మైన సేన చేశారు. ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిది. అని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. ఘోష్‌కు భార్య ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. క‌రోనా వైర‌స్ బారిన ప‌డి చ‌నిపోయిన ఎమ్మెల్యేల్లో ఘోష్ ఒక‌రు. ఇటీవ‌ల త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీకి చెందిన  ఎమ్మెల్యే అన్బాజ‌గ‌న్ చ‌నిపోయారు. క‌రోనా వైర‌స్ సోకి చ‌నిపోయిన మొద‌టి ఎమ్మెల్యే అత‌నే. ఇవి చ‌ద‌వండి: 70 మంది క‌రోనా రోగులు ఏమ‌య్యారు?

దేశంలో  కొత్త‌గా 15,968 కేసులు...

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. బుధ‌వారం రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 15.968 పాజిటివ్ కేసులు వచ్చాయ‌ని తెలిపింది  కేంద్ర వైద్యారోగ్య‌శాఖ‌. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,56,183 కి చేర‌గా.. ఒక్క‌రోజే వైర‌స్ తో 465 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 24 గంట‌ల్లో 10,495 మంది క‌రోనా  నుంచి కోలుకోగా..ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2,58,685 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా మొత్తం క‌రోనా బారిన‌ప‌డ్డ 1,83,022 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నార‌ని ..ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,476 కి చేరింద‌ని తెలిపింది కేంద్ర ఆరోగ్య‌శాఖ‌.ఇవి చ‌ద‌వండి: ముంబైకి మ‌రో ముప్పు ఉందంట‌..!
క‌రోనా వైర‌స్ సోకిన వారిలో 2.58 ల‌క్ష‌ల మంది ఇంత‌వ‌ర‌కూ రిక‌వ‌ర్ అయ్యార‌ని, రిక‌వ‌రీ రేటు 56.7 శాతానికి చేరుకుంద‌ని కేంద్రం తెలిపింది. మంగ‌ళ‌వారం 2,15,195 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని, ఒక రోజులో చేసిన అత్య‌ధిక ప‌రీక్ష‌ల సంఖ్య ఇదేన‌ని తెలిపింది. ఇంత‌వ‌ర‌కూ 73.52.911 ల‌క్ష‌ల‌కు పైగా టెస్ట్‌ల‌ను చేశామ‌ని వెల్ల‌డించి.యావ‌రేజ్ పాజిటివ్ రేటు 7.42 శాత‌మ‌ని తెలిపింది కేంద్ర ఆరోగ్య‌శాఖ‌. ఇవి చ‌ద‌వండి : హ‌లో సార్..హోంక్వారంటైన్ నేను..!

No comments:

Post a Comment