Tuesday, June 23, 2020

హ‌లో సార్‌..హోంక్వారంటైన్ నేను..!

ఇంట్లో ఉంటున్న పేషెంట్ల‌ను ప‌ట్టించుకోవ‌డం

 లేద‌ని బాధితులు ఆవేద‌న‌..!

 క‌రోనా పాజిటివ్ వ‌చ్చి ఇంటి వ‌ద్ద‌నే హోంక్వారంటైన్‌లో ఉంటున్న పేషెంట్లు ఒకింత ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. హోం క్వారంటైన్లో ఉంటున్న పేషెంట్ల చికిత్స‌ను అధికారులు గాలికి వ‌దిలేశార‌ని  ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు కొంద‌రు క‌రోనా పాజిటివ్ పేషెంట్లు. క‌రోనా కేసులు పెరుగుతున్న కొద్దీ, బాధితుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిగ్గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో హోం క్వారంటైన్ లో ఉంటున్న వారి ప‌రిస్థితి విష‌మిస్తే, ఒక వేళ కుటుంబ స‌భ్యుల‌కు ఎవ‌రికైనా సోకితే ఏం చేయాల‌ని భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో "వి6వెలుగు" లో వ‌చ్చిన క‌థ‌నం మేర‌కు...

హైద‌రాబాద్(Hyderabad): దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు ఇటీవ‌ల వైర‌స్ పాజిటివ్ వ‌చ్చింది. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంటున్న అత‌నికి రోజూ రెండు సార్లు కాల్స్ వ‌స్తున్నాయి. "మందులు వేసుకుంటున్నారా?  సింప్ట‌మ్స్ ఉన్నాయా?" అని అడిగి ఫోన్ పెట్టేస్తున్నారు. ఇంట్లో చిన్న పిల్ల‌లు ఉన్నార‌ని వాళ్ల‌కు కూడా టెస్టులు చేయించాల‌ని కోరితే, అది మా డ్యూటీ కాదండీ అంటూ కాల్ క‌ట్ చేస్తున్నార‌ని బాధితుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైర‌స్  పాజిటివ్ వ‌చ్చిన త‌ర్వాత 3 రోజుల వ‌ర‌కూ త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ని ఉప్ప‌ల్‌కు చెందిన మ‌రో వ్య‌క్తి తెలిపారు. త‌న‌కు తెలిసిన అధికారుల‌కు కాల్ చేసినా రెస్పాన్స్ లేద‌ని, చివ‌ర‌కు హెల్త్ మినిస్ట‌ర్‌కు ఫోన్ చేసి చెప్పిన త‌ర్వాత త‌న వ‌ద్ద‌కు డాక్ట‌ర్లు వ‌చ్చార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అప్ప‌టి వ‌ర‌కూ తాను ఇంట్లో భ‌యం భ‌యంగా గ‌డిపాన‌ని చెప్పారు. త‌న‌కు జ్వ‌రం వ‌స్తోంద‌ని హాస్పిట‌ల్‌కు షిప్ట్ చేయండ‌ని అడిగితే , ఒక రెండ్రోజులు చూసి త‌గ్గ‌క‌పోతే షిప్ట్ చేస్తామంటున్నార‌ని చార్మినార్‌కు చెందిన మ‌రో వ్య‌క్తి తెలిపారు. ఈ స‌మ‌యంలో ప‌రిస్థితి విష‌మిస్తే బాధ్యులెవ‌ర‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు, భ‌యంతో హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తులు, వాళ్ల కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి చ‌ద‌వండి:వ‌ర్మ‌..ఏడుద్ధామ‌న్నా క‌న్నీళ్లు ఇంకిపోయాయి:అమృత‌

ఐసీఎంఆర్ సూచ‌న‌లు పాటిస్తున్నారా?

ఎసింప్ట‌మాటిక్‌, మైల్డ్ సిస్ట‌మాటిక్ వ్య‌క్తుల‌ను హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌నివ్వొచ్చ‌ని ఐసీఎంఆర్ సూచ‌న‌లు తెలిపింది. ఇందుకు కొన్ని నిబంధ‌న‌లు పాటించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించింది. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఆ నిబంధ‌న‌లు పాటించ‌కుండానే వంద‌ల మందిని హోమ్ ఐసోలేట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం 3 వేల మంది పేషెంట్లు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. పాజిటివ్ వ‌చ్చిన వెంట‌నే సింప్ట‌మ్స్ లేకుంటే హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని చెబుతున్నారు. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి ఏమిటి? ఇత‌ర జ‌బ్బులేమైనా ఉన్నాయా? ఇంట్లో ఐసోలేష‌న్ లో ఉండే స‌దుపాయం ఉన్న‌దా లేదా అనే అంశాల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం  లేదు. ఐసోలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తుల‌కు స్థానికంగా ఉండే ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు వ‌చ్చి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్తున్నారు. అవి వేసుకున్న‌దీ లేనిదీ రోజుకు రెండు సార్లు కాల్ చేసి అడుగుతున్నారు. అప్ప‌డ‌ప్పుడు డాక్ట‌ర్లు మాట్లాడుతున్నారు. ఐసీఎంఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐసోలేష‌న్‌లో ఉన్న వ్య‌క్తిని చూసుకునేందుకు కుటుంబంలో ఒక స‌భ్యుడిని నియ‌మించాలి. అత‌ను పూర్తి ఆరోగ్య వంతుడై ఉండాలి.  వైర‌స్ సోకుండా ఆ వ్య‌క్తికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. కానీ, చాలా మందికి ఈ ట్యాబ్లేట్లు ఇవ్వ‌డం లేద‌నేది తెలుస్తోంది. ఇవి చ‌ద‌వండి:చిచ్చ‌ర‌పిడుగులు: స‌రిహ‌ద్దులో యుద్దానికి సార్‌..!
క‌నీసం మాస్కులు, శానిటైజ‌ర్లు కూడా ప్రొవైడ్ చేయ‌డం లేదు. తొలుత కంటైన్‌మెంట్ జోన్ల‌లో వంద‌ల ఇండ్ల‌కు స‌రుకులు పంపించిన అధికారులు, ఇప్పుడు పాజిటివ్ వ్య‌క్తుల‌కు ఎలాంటి స‌హాయం చేయ‌డం లేదు. వైర‌స్ భ‌యంతో తెలిసిన వాళ్లు కూడా సాయం చేసేందుకు వెన‌కాడుతున్నారు. 

భ‌యం భ‌యంగా జీవ‌నం...

చిన్న పిల్ల‌లు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఉన్న ఇంట్లో క‌రోనా పేషెంట్ల‌ను ఐసోలేట్ చేయ‌డం ప్ర‌మాద‌మ‌ని తెలిసినా, అధికారులు అవేమీ ప‌ట్టించుకోవ‌డం లేదు. సింప్టమ్స్ లేకుంటే ఇంట్లోనే ఉండాల‌ని చెబుతున్నారు. జిల్లాల నుంచి గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర‌కూ ప‌రిస్థితి ఇలానే ఉంది. ఊళ్ల‌లో జ‌నాలు తిర‌గ‌బ‌డుతుండ‌గా, ఇక్క‌డ అపార్ట్‌మెంట్ వాసులు  పేషెంట్ల‌ను చిన్న చూపుచూస్తున్నారు. ఇటీవ‌ల వైర‌స్ బారిన ప‌డిన క‌రోనా హైలెవ‌ల్ క‌మిటీ స‌భ్యుడికి సైతం ఇలాగే చేదు అనుభ‌వం ఎదురైంది. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉందామ‌ని వెళ్లిన అత‌నికి, అపార్ట్‌మెంట్ వాసులు అభ్యంత‌రం చెప్ప‌డంతో తిరిగి నిమ్స్‌లో అడ్మిట్  అయ్యాడు. వాస్త‌వానికి హోమ్ ఐలోలేష‌న్‌లో ఉండాలా? గ‌వ‌ర్న‌మెంట్ ఐసోలేష‌న్ సెంట‌ర్‌కు వెళ్లాలా అనేది పెషంట్లు నిర్ణ‌యించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్న క‌రోనా పేషెంట్ల ప‌ట్ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండి వారికి జాగ్ర‌త‌గా చికిత్స చేసి అందుబాటులో ఉండాల‌ని ప్ర‌జ‌లు, వారి కుటుంబ‌ స‌భ్యులు కోరుతున్నారు. 

మ‌హా న‌గ‌రంలో భ‌యంభ‌యం....!

హైద‌రాబాద్ క‌రోనాకు హాట్ స్పాట్‌గా మారింది. రోజురోజుకూ పెద్ద సంఖ్య‌లో పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్తుండ‌టంతో భ‌యం భ‌యంగా బ‌త‌కాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అన్ని జోన్ల‌కు, ఏరియాల‌కూ వైర‌స్ విస్త‌రించింది. సోమ‌వారం  ఒక్క రోజే గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఏకంగా 713  పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. సిటీకి ఆనుకొని ఉన్న రంగారెడ్డిలో 107, మేడ్చ‌ల్‌లో 16, సంగారెడ్డి లో 12 పాజిటివ్ కేసులు..మొత్తంగా 848 కేసులు ఇక్క‌డే వ‌చ్చాయి. రోజూ న‌మోద‌వుతున్న  కొత్త కేసుల్లో 80,90 శాతం ఇక్క‌డివే ఉంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల్లో 70 శాతానికి పైగా హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్  కేసుల సంఖ్య 8,674 కాగా.. ఇందులో గ్రేట‌ర్ హైద‌రాబాద్ లోనివే 6,276 ఇందులో గ‌త వారం రోజుల్లో వ‌చ్చిన‌వి 2,840 కేసులు. జీహెచ్ఎంసీ స‌హా చాలా స‌ర్కారీ  ఆఫీసులు, గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ళ్ల‌లో క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఉద్యోగులు భ‌యంతో ఆఫీసుల‌కు వెళ్తున్నారు. దుకాణాల వాళ్లు టెన్ష‌న్ ప‌డుతున్నారు. మ‌రోవైపు ఊర్ల‌లో వాళ్లు హైద‌రాబాద్ అంటేనే జ‌డుసుకుంటున్నారు. హైద‌రాబాద్ కు రావాల‌న్నా.. ఇక్క‌డి నుంచి వెళ్లినోళ్ల‌ను చూసినా భ‌య‌ప‌డుతున్నారు. 

పెరిగిన పాజిటివ్ రేటు..!

మార్చి 2 న మొద‌టి కేసుతో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌రోనా క‌ల‌క‌లం మొద‌లైంది. అదే నెల 14న రెండు కేసులు వ‌చ్చాయి. త‌ర్వాత వ‌రుస‌గా పెరిగిపోయాయి. ఆ నెలాఖ‌రుకు 25 మందికి, ఏప్రిల్‌లో 519, మేలో 876 మందికి పాజిటివ్ గా తేలింది. అన్‌లాక్ మొద‌లైన జూన్ 1 నుంచి ఆదివారం (జూన్‌21) వ‌ర‌కు, 4,143 కేసులు న‌మోదయ్యాయి. అంటే తొలి మూడు నెల‌ల్లో 1,420 మందికి పాజిటివ్ తేల‌గా... ఈ నెల 20 రోజుల్లోనే నాలుగు వేల మందికి పైగా వైర‌స్ సోకింది. టెస్టుల సంఖ్య పెంచుతామ‌న్న స‌ర్కారు..కొద్ది రోజులుగా సిటీలో ఎనిమిది చోట్ల శాంపిళ్లు సేక‌రించ‌డం మొద‌లు పెట్టింది. ఈ నెల 18న 2,250 శాంపిళ్లు సేక‌రించ‌గా.. అందులో 14.62 శాతం మందికి, 19న 2,520 శాంపిళ్ల‌లో 19.24 శాతం మందికి, 20న తీసిన 2,132 శాంపిళ్ల‌లో 30.4 శాతం మందికి వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అంటే టెస్టులు చేసిన కొద్దీ పెద్ద సంఖ్య‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వాళ్లు ఉద్యోగాలు, ఇత‌ర ప‌నులు కోసం బ‌య‌ట తిరిగి  ఉండ‌టంతో ఇంకెద‌రికి వైర‌స్ సోకి ఉంటుందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

క‌రోనాతో మ‌రో డాక్ట‌ర్ మృతి

క‌రోనాతో మ‌రో డాక్ట‌ర్‌(77) మృతి చెంఆరు. తీవ్ర‌మైన జ్వ‌రం, జ‌లుబుతో జూన్ 16న కిమ్స్ హాస్పిట‌ల్‌లో చేరిన ఆయ‌న‌.. ట్రీట్‌మెంట్ పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఖైర‌తాబాద్‌లోని లైబ్ర‌రీ వెనుకాల 20 ఏళ్లుగా ప్రైవేటు క్లినిక్‌లో ఈయ‌న ప్రాక్టీస్ చేస్తున్నారు. లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రాక్టీస్ మానేసి ఇంటి ద‌గ్గ‌రే ఉంటున్న‌ప్ప‌టికీ వైర‌స్ ఎలా సోకిందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 

No comments:

Post a Comment