Monday, June 8, 2020

ఖ‌మ్మంలో ..ఐటీసీ కార్యాల‌యం ఎదుట బీజేపీ ఆందోళ‌న‌

ఖ‌మ్మం(Khammam):
ఐటీసీ ప‌రిశ్ర‌మ సుబాబుల్ జామాయిల్ కొనుగోలు కేంద్రాలు చేర్పాటు చేయాల‌ని బ్రోక‌ర్ల వ్య‌వ‌స్థ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసూ్త బీజేపీ ఆధ్వ‌ర్యంలో సుబాబుల్ జామాయిల్ రైతుల‌తో క‌లిసి ఖ‌మ్మంలోని ఐటీసీ కార్యాల‌యాన్ని ఆదివారం ముట్ట‌డించారు. గ‌త కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొండ‌ప‌ల్లి శ్రీ‌ధ‌ర్ రెడ్డి బిజేవైఎం రాష్ట్ర ఉపాధ్య‌క్షులు గ‌ల్లా స‌త్య‌నారాయ‌ణ నేతృత్వంలో మండ‌లాల వారిగా బీజేపీ ఐటీసీ పై ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తున్న నేప‌థ్యంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వ‌ర్యంలో రైతుల‌తో క‌లిసి ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ..ఐటీసీ కొనుగోలు విభాగం అధికారులు బ్రోక‌ర్ల‌తో కుమ్మక్కై రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్య‌క్షులు స‌న్నే ఉద‌య్ ప్ర‌తాప్‌, బిజేవైఎం రాష్ట్ర ఉపాధ్య‌క్షులు గ‌ల్లా స‌త్య‌నారాయ‌ణ , ఉప్ప‌ల శార‌దా, రుద్ర ప్ర‌దీప్ మ‌రియు రైతుల‌తో క‌లిసి ఐటీసీ కార్యాల‌యంలో బైఠాయించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చేంత వ‌ర‌కు ఇక్క‌డ నుండి క‌దిలేది లేద‌ని  స్ప‌ష్టం చేశారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇవి చ‌ద‌వండి: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు శుభ‌వార్త‌
\అక్క‌డికి చేరుకున్న అర్బ‌న్ ఎస్ఐ వ‌రాల శ్రీ‌నివాస్‌రావు కంపెనీ ప్ర‌తినిధుల‌తో ఆందోళ‌న కారుల‌తో రైతుల‌తో మాట్లాడారు. ఐటీసీ అధికారి గోపాల్ క‌న్న‌న్‌పై అధికారి అమిత్ సింగ్ దృష్టికి స‌మ‌స్య‌ను ఫోన్ ద్వారా తెలిపారు. ఈ సంద‌ర్భంగా అమిత్ సింగ్ ఫోన్లో బిజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి శ్రీ‌ధ‌ర్ రెడ్డి , జిల్లా అధ్య‌క్షులు ప్ర‌తాప్‌, బిజేవైఎం ఉపాధ్య‌క్షులు గ‌ల్లా స‌త్య‌నారాయ‌ణ‌ల‌తో మాట్లాడారు. అనంత‌రం జిల్లా వ్యాప్తంగా రేప‌టి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌ని రైతులు సుబాబుల్ బెర‌డు తొల‌గించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఐటీసీ లో అవినీతి కి పాల్ప‌డిన అధికారుల‌పై  చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ఉపాధ్య‌క్షులు వీరెల్లి ల‌క్ష్మ‌య్య‌, మేక‌ల నాగేంద‌ర్‌, కొలిపాక శ్రీ‌దేవి, కూతురు ముర‌ళి, బోయిన‌ప‌ల్లి శేఖ‌ర్‌, ఆనంతు, ఉపేంద‌ర్ గౌడ్‌, వీరుగౌడ్ గిరిజ‌, ల‌క్ష్మిచావా కిర‌ణ్‌, వెంక‌ట‌నారాయ‌ణ‌యాద‌వ్‌, గుత్తా వెంక‌టేశ్వ‌ర‌రావు, సుబాబుల్ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షులు వ‌త్తికొండ శ్రీ‌నివాస‌రావు, క‌ర్నాటి రాజేంద్ర ప్ర‌సాద్‌, సీతారాం, తాతా సీతారాం, భ‌ద్రం, వేల్పుల సుధాక‌ర్‌, వెంక‌ట్, శ్యాం, అన్వ‌ర్‌, యోల్ల రావు, ప్రీత‌మ్‌, అశోక్‌గౌడ్‌, గాజుల శ్రీ‌నివాస‌రావు, దుర్గా ప్ర‌సాద్ రెడ్డి త‌దిత‌ర‌లు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment