Friday, June 19, 2020

క‌రోనా : ప్రైవేటు..స‌ప"‌రేటు"..!

హైద‌రాబాద్(Hyderabad):
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా టెస్టుల పేరుతో దందా మొదలైన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వం నిర్ణ‌యిం చిన ధ‌ర‌ల‌క‌న్నా ఎక్క‌వు వ‌సూలు చేస్తున్న‌ట్టు బాధితులు తెలుపు తున్నారు. రూ.300 నుంచి రూ.500 వ‌ర‌కు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయి. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌కు ఒక్క‌పైసా ఎక్కువ వ‌సూలు చేసినా, రూల్స్ అతిక్ర‌మించినా ల్యాబులు సీజ్ చేస్తామ‌ని ఆరోగ్య‌మంత్రి, సీఎస్ హెచ్చ‌రిక‌లను ప‌ట్టించుకోవ‌టంలేదు. పీపీఈ కిట్లు, రిజిస్ట్రేష‌న్ ఛార్జీ, క‌న్జ్యూమ‌బుల్స్ పేర్లు చెప్పి అద‌నంగా దండుకుంటున్నాయి. అందుకు సంబంధించి ప్ర‌క‌ట‌న‌ల‌ను గుప్పిస్తున్నాయి. ల్యాబుకు వెళ్లి శాంపిల్ ఇస్తే రూ.2,200 వారే ఇంటికి వ‌చ్చి శాంపిల్ తీసుకెళ్తే రూ.2,800 గా టెస్టుల ధ‌ర‌ల‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కానీ ప్రైవేటు ల్యాబులు ఎక్క‌వు వ‌సూలు చేస్తున్నాయి. పీపీఈ కిట్లు, ఇత‌ర క‌న్జ్యూమ‌బుల్స్ రూ.2,800 చార్జీతో పాటు పీపీఈ కిట్లు, క‌న్జ్యూమ‌బుల్స్ కు రూ.500 అద‌న‌మ‌ని అపోలో ల్యాబ్స్ ప్ర‌క‌టించింది. బంజారాహిల్స్‌లోని టెనెడ్ డ‌యాగ్న‌స్టిక్స్‌లో రూ.500, మేడ్చ‌ల్‌లోని బ‌యాగ్న‌సిస్ ల్యాబ్‌లో రూ.400, మాదాపూర్‌లోని మ్యాప్‌మై జీనోమ్ రూ.300 ఎక్కువుగా వ‌సూలు చేస్తున్నారు. ప్ర‌తి ల్యాబులోనూ దాదాపు ఇదే దందా న‌డుస్తున్న‌ట్టు తెలుస్తోంది. 
ప్రిస్క్రిప్ష‌న్‌పై అద‌న‌పు ఛార్జీ..
వైర‌స్ ల‌క్ష‌ణాలు లేక‌పోయినా చాలా మంది భ‌యంతో క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని అనుకుంటున్నారు. అయితే, ల‌క్ష‌ణాలుంటే త‌ప్ప ప్ర‌భుత్వం  ల్యాబుల్లో టెస్టులు చేయ‌ట్లేదు. దీంతో చాలా మంది ప్రైవేటు ల్యాబుల‌కు వెళుతున్నారు. అయితే, ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ మెడిక‌ల్ రీసెర్చ్ గైడ్‌లైన్స్ ప్ర‌కారం డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ ఉంటేనే టెస్టులు చేయాలి. దాన్నే ఆస‌రాగా చేసుకుంటున్న క‌రోనా టెస్టుల సౌక‌ర్యం ఉన్న కొన్ని ఆస్ప‌త్రులు.. ల‌క్ష‌ణాల్లేకున్నా ప్రిస్క్రిప్ష‌న్ ఇస్తున్నాయి. అందుకు రూ.400 నుంచి రూ.1000 వ‌ర‌కు ఛార్జి వ‌సూలు చేస్తున్నాయి. క‌రోనా టెస్టుల కోసం గ‌చ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆస్ప‌త్రిలో టెస్టుకు రూ.2,300 అవుతుంద‌ని, ప్రిస్రిప్ష‌న్‌కు రూ.400అవుతుంద‌ని ఆ ఆస్ప‌త్రి ప్ర‌తినిధులు టెస్టులు చేయించుకునేందుకు వ‌స్తున్న‌వారికి చెబుతున్నారు. ల‌క్ష‌ణాలు లేక‌పోయినా డాక్ట‌ర్ల‌తో ప్రిస్రిప్ష‌న్ ఇప్పిస్తామ‌న్నారు. చాలా హాస్పిట‌ల్స్‌లో ఇదే ప‌రిస్థితి ఉంద‌ని బాధితులు చెబుతున్నారు.
ప్ర‌భుత్వ నిబంధ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు..!
క‌రోనా టెస్టుల‌పై మార్కెటింగ్ చేస్తూ దందా చేసినా, ఛార్జీలు ఎక్కువ వ‌సూలు చేసినా ఊరుకునేది లేద‌ని నాలుగు రోజుల క్రితం సీఎస్ సోమేష్ కుమార్ హెచ్చ‌రించారు. రూల్స్ ను ఉల్లంఘిస్తే హాస్పిటళ్లు, ల్యాబుల‌ను సీజ్ చేస్తామ‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దానిని మానిట‌ర్ చేసేందుకు ఓ టీమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రి, ఇప్పుడు ఎక్కువ వ‌సూలు చేస్తున్న ఈ ల్యాబులు, హాస్పిట‌ళ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి. 

No comments:

Post a Comment