Monday, June 8, 2020

అభినందించాల్సిందే పోయి.. వెటకారమా..!

సినీనటుడు సోనుసూద్ చుట్టూ నడుస్తున్న రాజకీయం
 మహారాష్ట్ర(maharashtra): కరోన వల్ల భారతదేశంలో వలస కార్మికులు పడిన వేదన, పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎంతోమంది వలస కార్మికులు వేల మైళ్ళ దూరం నిలువుటెండలో కాలినడకన నడచి సొంత గ్రామాలకు చేరిన వారు కొందరైతే, ఆహారం లేక నీరసించి చనిపోయిన వారు మరికొందరు. ఈ నేపథ్యంలో వారి బాధలను ఆలోచన చేసిన సినీనటుడు సోను సూద్ వలస కూలీల ను సొంత గ్రామాలకు పంపేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కొంతమందిని విమానాల్లో ను, ట్రైన్లలో ను పంపించారు. గత 20 ఏళ్లలో తాను కూడబెట్టిన ఆస్తులను సైతం లెక్కచేయకుండా వారి కోసం దానధర్మాలు చేశారు.
మంచి నటుడని అభినందించాల్సింది పోయి, శివసేన నేత సంజయ్ రౌత్ సోన్ సూద్ పై నోరు పారేసుకున్నారు. బిజెపి రాసిచ్చిన స్క్రిప్టు మేరకు సోను సూద్ పనిచేస్తున్నారని, స్థానిక  వలస కూలీల పాలిట మహాత్మ గా మారారని సెటైర్లు వేశారు. అయితే ఆయన కామెంట్ చేసిన మరుసటి రోజే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోను సూద్ తో సమావేశమయ్యారు.
ఆదివారం రాత్రి ముంబైలోని సీఎం నివాసంలో సోనుసూద్తో ఆదిత్య తో సమావేశమయ్యారు. వలస కూలీల సహాయంపై చర్చించారు. తర్వాత సోను సూద్ చేసిన సేవలను సీఎం ప్రశంసించారు. ముంబై లో ఉన్న ఉత్తరాదికి చెందిన వలస కూలీలను తరలించడంలో తీసుకున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. శివసేన నేత విమర్శించటం, సీఎం ఉద్ధవ్ ఠాక్రే  ప్రశంసించడం తో ఒక్కరోజులోనే రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

No comments:

Post a Comment