Friday, June 19, 2020

గొప్ప మ‌న‌స్సు చాటుకున్న సీఎం కేసీఆర్‌..!

హైద‌రాబాద్(Hyderabad)
: చైనా జ‌వాన్ల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో వీర‌మ‌ర‌ణం పొందిన సూర్య‌పేట వాసి క‌ల్న‌ల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి అండ‌టా ఉంటామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు. స‌రిహ‌ద్దుల్లో శుత్ర‌దేశాల నుంచి దేశాన్ని కాపాడుతోన్న జ‌వాన్ల‌కు యావ‌త్ దేశం అండ‌గా ఉంటుంద‌న్నారు. క‌ల్న‌ల్ సంతోష్ బాబు కుటుంబానికి చేసే సాయాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. చైనాతో ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ అఖిల‌ప‌క్షం స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశంలో టిఆర్ ఎస్ పార్టీ త‌ర‌పున పాల్గొన్న కేసీఆర్ రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌జేయ‌బోయే సాయాన్ని ప్ర‌ధానికి వివ‌రించారు. 
సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల న‌గ‌దు అంద‌జేస్తామ‌ని , అలాగే నివాస‌స్థ‌లం, సంతోష్ బాబు భార్య‌కు గ్రూప్ 1 క్యాడ‌ర్ ఉద్యోగం ఇవ్వ‌బోతున్నామ‌ని పేర్కొన్నారు. సంతోష్ బాబు ఇంటికెళ్లి మ‌రీ స్వ‌యంగా తానే అంద‌జేస్తాన‌ని పేర్కొన్నారు. గాల్వాన్ లోయ‌లో ఘ‌ర్ష‌ణ జ‌రిగిన మిగ‌తా 19 మంది జ‌వాన్ల‌కు కూడా ఆర్థిక సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఒక్కోకుటుంబానికి రూ.10 ల‌క్ష‌లుచొప్పున అందజేస్తామ‌ని వివ‌రించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ మంత్రికి అంద‌జేయ‌బోతున్నామ‌ని తెలిపారు. 
స‌రిహ‌ద్దుల్లో దేశంకోసం ర‌క్ష‌ణ‌గా ఉంటున్న సైనికుల‌కు దేశం అండ‌గా ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. డ్రాగ‌న్ తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో చ‌నిపోయిన సైనికుల కుటుంబాల‌కు ఆత్మ‌స్థైర్యం నింపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశం మొత్తం మీ వెంట ఉంద‌నేలా సందేశం ఇవ్వాల‌ని వారి కుటుంబాల్లో భ‌రోసా నింపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ల‌కు రాష్ట్ర ప్ర‌బుత్వాలు కూడా సాయం చేయాల‌ని సూచించారు. కేంద్రం అందించే సాయంతో పాటు ముందుకు వ‌స్తే ఆర్థికంగా వారికి భ‌రోసా ఇచ్చిన వార‌మ‌వుతామ‌ని తెలిపారు. 
సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు: కోమ‌టిరెడ్డి
గాల్వ‌న్ లోయ‌లో చైనా చైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో మ‌ర‌ణించిన క‌ర్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన సీఎం కేసీఆర్‌కు భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. సంతోష్ కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సాయంతో పాటు ఇంటి స్థ‌లం, ఉద్యోగం ఇస్తాన‌న‌డం చాలా సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. సీఎం కేసీఆర్ 19 మంది సైనికుల కుటుంబాల‌కూ ఆర్థిక సాయం ప్ర‌క‌టించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. 

No comments:

Post a Comment