Saturday, June 13, 2020

ఆ మంత్రికి "ప‌ద‌వి" పోతుంది..!

  • ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌

హైద‌రాబాద్(Hyderabad): క‌రోనా వైఫ‌ల్యాన్ని సాకుగా చూపించి...వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద‌ర్ ని వ‌చ్చే వారం మంత్రి ప‌ద‌వి నుంచి తీసేయ‌బోతున్నార‌ని ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. క‌రోనా బారిన ప‌డిన జ‌ర్న‌లిస్ట్ మ‌నోజ్ మృతిచెంద‌డంతో  జ‌ర్న‌లిస్టుల సంఘం ఆయ‌న కుటుంబాన్ని ఆదుకోవ‌డంతో పాటు, జ‌ర్న‌లిస్టులంద‌రికీ క‌రోనా ఇన్సూరెన్స్ మ‌రియు బీమా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరుతూ టీయూడబ్ల్యూ జే  ఉప‌వాస దీక్ష‌కు దిగింది. శ‌నివారం ఎంపీ రేవంత్ రెడ్డి శిబిరానికి వెళ్లి వారికి మ‌ద్ద‌తు తెలిపారు. ప్ర‌ర‌జ‌ల‌కు , ప్ర‌భుత్వానికి వార‌ధులుగా ఉండే మీడియా ప్ర‌తినిధుల‌కు క‌రోనా ఇన్సూరెన్స్ క‌ల్పించాల‌ని ఆయ‌న కోరారు.
అదే విధంగా దేశంలో, రాష్ట్రంలో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేసే దూత‌లు జ‌ర్న‌లిస్టులు అని రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి క‌ష్టాల‌ను, బాధ‌ల‌ను, న‌ష్టాల‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేసింది మీడియానేన‌ని అన్నారు. ఇప్పుడు ఆ మీడియా ప్ర‌తినిధుల ప‌రిస్థితి రోడ్డున ప‌డింద‌ని, దీంతో వారు కూడా నిర‌స‌న‌కు దిగార‌ని పేర్కొన్నారు. మీడియా ప్ర‌తినిధులు ఉప‌వాస దీక్ష‌కు కూర్చున్నారంటే..రాష్ట్ర ప్ర‌భుత్వం వంద శాతం వైఫ‌ల్యం చెందిన‌ట్టేన‌ని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిపాల‌న న‌చ్చితే న‌జ‌రానా..న‌చ్చ‌క‌పోతే జ‌రిమానా అన్న‌ట్టు ఉంద‌ని తెలిపారు. పీవీ సింధు, సానియా మీర్జాల‌కు కోట్లు ఇచ్చారు కానీ..క‌రోనాతో ఒక పాత్రికేయుడు చ‌నిపోతే క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌రోనా పేషెంట్ల‌కు రూ.3.5 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెడుతున్నామ‌న్న ప్ర‌భుత్వం, జ‌ర్న‌లిస్ట్ మ‌నోజ్‌కు గాంధీ ఆస్ప‌త్రిలో ఎంత ఖ‌ర్చు చేసిందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఆస్ప‌త్రిలో స‌రిపోయేంత సిబ్బంది లేక‌పోవ‌డం వ‌ల్ల డాక్ట‌ర్ల‌కు ప‌ని ఒత్తిడి ఎక్క‌వు అవుతుంద‌ని, ప్ర‌భుత్వం పీపీఈ కిట్ల‌కు ఎంత ఖ‌ర్చు చేసింది..ఎక్క‌డ‌, ఎంత‌కు కొన్న‌దో లెక్క చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. 
ప్ర‌భుత్వ వైఫల్యాల‌ను ఎత్తిచూపుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాల‌ను బ‌య‌ట‌కు రానీయ‌డం లేద‌న్నారు. కోర్టులు ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పులిస్తే..కోర్టుల‌పై గౌర‌వం ఉందంటారు. అదే వ్య‌తిరేకంగా తీర్పులిస్తే హైకోర్టుకు వెళ్తామంటార‌ని విమర్శించారు.  టిఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి క‌రోనా వ‌చ్చింద‌ని తెలిసింద‌న్నారు. గాంధీ లో క‌రోనా పేషంట్ల‌కు స‌దుపాయాలు అన్నీఉంటే.. మ‌రి అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన యాద‌గిరి రెడ్డి య‌శోద హాస్ప‌ట‌ల్ లో ఎందుకు క‌రోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారో చెప్పాల‌ని పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరితేనే క‌దా అక్క‌డ స‌దుపాయాలు ఎలా ఉన్న‌యో తెలిసేద‌ని వివ‌రించారు. ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, గాంధీ డాక్ట‌ర్ల‌యితే ప్ర‌జ‌ల‌కు క‌రోనా ట్రీట్‌మెంట్ చేస్తున్న‌ప్పుడు ఎమ్మెల్యేకు చేయ‌లేమా అని ప్ర‌శ్నిస్తున్నార‌న్నారు. మ‌రో  టిఆర్ ఎస్ నాయకుడు త‌న‌కు ఎదురుతిరిగిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మీద క‌త్తి దూయ‌డానికి సిద్ధంగా ఉన్నాడ‌ని , క‌రోనా వైఫ‌ల్యాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు సీఎంకు చేర‌వేస్తున్నాడ‌ని ఆరోపించారు. వ‌చ్చే వారం మంత్రి వ‌ర్గం నుంచి ఈటెల రాజేంద‌ర్ ప‌ద‌వి ఊడిపోతుంద‌ని , క‌రోనా వైఫ‌ల్యాన్ని సాకుగా చూపించి, ఈటెల‌ను ప‌ద‌వి నుండి తొల‌గించేలా చూస్తున్నార‌ని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‌

No comments:

Post a Comment