Saturday, June 20, 2020

ఇప్పుడు కావాల్సింది రాజ‌నీతికాదు..ర‌ణ‌నీతి:సీఎం కేసీఆర్‌

భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తిన నేప‌థ్యంలో ఏమాత్ర‌మూ తొంద‌ర‌పాటు ఉండొద్దు, అదే స‌మ‌యంలో దేశ ప్ర‌యోజ‌నాల విష‌యంలో త‌ల‌వం చాల్సిన అవ‌స‌రం లేదు.దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజ‌కీయం (రాజ‌నీతి) కాదు..యుద్ధ‌నీ‌తి(ర‌ణ‌నీతి).
- సీఎం కేసీఆర్

హైద‌రాబాద్(Hyderabad): చైనాతో ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ శుక్ర‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో టిఆర్ఎస్ అధ్య‌క్షుడి హోదాలో సీఎం కేసీఆర్ త‌న అభిప్రాయాలు వెల్ల‌డించారు. చైనా, పాకిస్తాన్ ల‌కు త‌మ దేశాల్లో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లున్న‌ప్పుడు స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించ‌డం అల‌వాటుగా పెట్టుకున్నాయ‌న్నారు. ఇప్పుడు చైనాలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లున్నాయ‌ని, ద‌క్షిణ చైనా స‌ముద్ర తీర దేశాలైన మ‌లేషియా, ఫిలిప్పీన్స్‌, జ‌పాన్ త‌దిత‌ర దేశాల‌తో కూడా చైనా ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగుతోంద‌న్నారు. చైనా వైఖ‌రి ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాగా బ‌ద్నాం అయింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. భార‌త‌దేశం లో పాల‌న సుస్థిరంగా ఉండ‌టంతో పాటు గొప్ప ఆర్థిక శ‌క్తిగా ఎద‌గ‌డం ఓర్వ‌లేక‌నే చైనా క‌య్యానికి కాలు దువ్వుతోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

చైనా వ‌స్తువుల‌పై తొంద‌ర‌పాటు చ‌ర్యే..!

చైనా నుంచి వ‌స్తువుల దిగుమ‌తులు ఆపాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌న్నారు. అది తొంద‌ర‌పాటు చ‌ర్య అవుతుంద‌ని, ప్ర‌స్తుతం దిగుమ‌తి చేసుకుంటున్న వ‌స్తువులు మ‌న దేశంలో త‌యారు కావాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో వ‌స్తువులు దొర‌కాల‌ని తెలిపారు. ముందుగా మ‌నం ఈ విష‌యాల‌పై దృష్టి పెట్టాల‌ని కేసీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల్లో మిత్ర‌దేశాల‌తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఏర్పాటు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. బ్రిట‌న్ ప్ర‌తిపాదించిన డి-10 గ్రూపులో క‌ల‌వాల‌ని, ఓరాన్ అల‌యెన్సులో చేరాల‌ని,హువాయ్ కంపెనీ ఎత్తుగ‌డ‌ను తిప్పి కొట్టాల‌ని అభిప్రాయ‌పడ్డారు. భార‌త‌దేశంతో చైనా మొద‌టి నుంచి ఘ‌ర్ష‌ణ వైఖ‌రి అవ‌లంభిస్తోంద‌న్నారు. గాల్వ‌న్ లోయ వంటి సంఘ‌ట‌న‌లు గ‌తంలోనూ జ‌రిగాయ‌ని గుర్తుచేశారు. ఇవి చ‌ద‌వండి:గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం కేసీఆర్‌
ఇది మొద‌టిది కాదు...చివ‌రిదీ కాదు..1957 లో సరిహ‌ద్దు వివాదం లేవ‌నెత్తింద‌ని, 1962లో ఏకంగా భార‌త్‌-చైనా మ‌ధ్య పూర్తిస్థాయి యుద్ధ‌మే జ‌రిగింద‌ని తెలిపారు. ఇక ఇటీవ‌ల చైనా మ‌న‌దేశంలో ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి అవ‌లంభించ‌డానికి  ప్ర‌త్యేక కార‌ణాలున్నాయ‌న్నారు. కాశ్మీరు విష‌యంలో కొత్త చ‌ట్టాలు తెచ్చామ‌ని, అక్క‌డి స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తున్నామ‌న్నారు. మ‌న‌ది శాంతికాముక దేశ‌మ‌ని, అదే స‌మ‌యంలో స‌హ‌నానికి హ‌ద్దు ఉంటుంద‌ని, ఎవ‌రైనా మ‌న మీద‌కు వ‌స్తే తీవ్రంగా ప్ర‌తిఘ‌టించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. దేశ ర‌క్ష‌ణ‌, ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీప‌డొద్దుని, ఈ ప‌రిస్థితుల్లో రాజ‌కీయ అవ‌స‌రం లేద‌ని, ర‌ణ‌నీతి కావాల‌ని సూచించారు. దేశ‌మంతా ఒక్క‌తాటిపై నిల‌బ‌డాల్సిన స‌మ‌య‌మిద‌న్నారు. గ‌తంలో కూడా ఇత‌ర దేశాల‌తో ఘ‌ర్ష‌ణ‌లు, యుద్దాలు జ‌రిగిన‌ప్పుడు ఇలాగే నిల‌బ‌డిన సంద‌ర్భాలున్నాయ‌ని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. 

దేశ అభివృద్ధిని ఓర్వ‌లేక‌నే...

క‌రోనా వైర‌స్‌కు చైనాయే కార‌ణ‌మ‌నే అప‌ఖ్యాతి వ‌చ్చింది. ఆ దేశం నుంచి చాలా బ‌హుళ జాతి సంస్థ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అవి భార‌త‌దేశంలో వైపు చూస్తున్నాయి. పెట్టుబడుల‌కు భార‌త‌దేశం అత్యుత్త‌మైన‌ద‌ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా భావిస్తున్నార‌ని కేసీఆర్ అన్నారు. ప్ర‌పంచ‌బ్యాంకు రిపోర్టు ప్ర‌కారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భార‌త్ 142వ స్థానం నుంచి 63వ స్థానానికి ఎదిగింద‌న్నారు. భార‌త‌దేశంలో ఇన్వెస్ట‌ర్ ఫ్రెండ్లీ పాల‌సీలు బాగా అమ‌ల‌వుతున్నాయ‌న్నారు. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు కూడా పెరుగుతున్నాయ‌ని, 2014 నుంచి 2017 వ‌ర‌కు విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబడులు 36 బిలియ‌న్ డాల‌ర్ల నుంచి 61 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగాయ‌న్నారు. ఇంకా పెర‌గ‌డానికి అవ‌కాశాలున్నాని తెలిపారు. చైనా నుంచి తీసుకొచ్చి తెలంగాణ‌లో త‌మ కంపెనీలు పెట్ట‌డానికి చాలా మంది ముందుకొస్తున్నారన్నారు. ఇది చైనాకు న‌చ్చ‌డం లేద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

No comments:

Post a Comment